Happy Ganesh Chaturthi | బ్లాగు మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
|
Happy Ganesh Chaturthi |
*సామాన్య వినాయకుడు - సంకేత వినాయకుడు*
మానసిక శారీరక శక్తి యుక్తుల సామర్థ్యాల పరంగా జ్ఞానం వివేచనల పరంగా, వ్యక్తులు వివిధ స్థాయిలలో ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. వారిని మౌలికంగ రెండు విధాలుగా వర్గీకరించవచ్చు.
*1) మూర్త ప్రజ్ఞులు (సామాన్య దృష్టి పరులు):*
వీరు ఏదైన ఒక విషయాన్ని ప్రత్యక్షంగా చూచినపుడు తాను చూస్తున్న విషయాన్ని మాత్రమే గుర్తించగలరు. కాని ఆ ప్రత్యక్షం ద్వారా తెలుపబడుతున్న పరోక్షాన్ని గుర్తించలేరు.
*2)అమూర్త ప్రజ్ఞులు (సంకేత దృష్టి పరులు):*
వీరు ఏదైనా ఒక విషయాన్ని చూచినపుడు తాము ప్రత్యక్షంగా చూస్తున్న విషయాన్ని మాత్రమే కాక ఆ ప్రత్యక్షం ద్వారా తెలుపబడుతున్న పరోక్షాన్ని సైతం గుర్తించగలరు.
ఉదాహరణకు మేడ మెట్లు ఎక్కడం కష్టం, దిగడం సులభం ఎందుచేత అని ప్రశ్నిస్తే మూర్త ప్రజ్ఞులు ఇచ్చే సమాధానం- మెట్లు ఎక్కడం శ్రమతో కూడుకున్న పని కాబట్టి కష్టం, దిగడం శ్రమరహితం కాబట్టి సులభం అన్నది! మరి ఇదే ప్రశ్నకు అమూర్త ప్రజ్ఞులు ఇచ్చే సమాధానమేమిటంటే- మెట్లు ఎక్కడం కష్టంగా ఉంది, దిగడం సులువుగా ఉంది అనే ప్రత్యక్ష విషయాన్ని ప్రమాణంగా చేసుకొని భూమికి ' *గురుత్వాకర్షణ శక్తి' (GRAVITATIONAL FORCE)* ఉందనే పరోక్ష విషయాన్ని సైతం గుర్తించగలరు. మూర్త, అమూర్త ప్రజ్ఞులకు గల ఈ తేడాను మరొక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. తాజ్ మహల్ లాంటి అద్భుత కళాఖండాన్ని చూసి మూర్త ప్రజ్ఞులు ( *సామాన్య దృష్టి పరులు* ) ఆ 'కళాఖండపు గొప్పతనాన్ని మాత్రమే గుర్తించి, దానినే కీర్తిస్తారు'. కాని అమూర్త ప్రజ్ఞులు ( *సంకేత దృష్టి పరులు* ) ఆ కళాఖండాన్ని చూసి 'దాని ఆ కళాత్మకతకు కారకుడైన దాని కళాకారుని కళాచాతుర్యాన్ని కొనియాడి వానిని కీర్తిస్తారు. అంటే- వీరు తమకు తారస పడిన దాని పైపై జ్ఞానాన్ని మాత్రమే కాక దాని మూలజ్ఞానాన్ని సైతం గ్రహిస్తారన్నమాట. *అలా చూడటాన్నే సామాన్య దృష్టి మరియు సాంకేతిక దృష్టి అంటారు.*
*హిందూమతంలో విగ్రహాల నిర్మాణ మౌలిక ఉద్దేశం ఏమిటి?*
విగ్రహం అనే పదానికి అమర కోసం అనే నిఘంటువిస్తున్న నిర్వచనం- *విశేషేణ గ్రహణం విగ్రహ:* *విశేషంగా గ్రహించేది విగ్రహం* అంటే విగ్రహ నిర్మాణ మౌలిక ఉద్దేశం వాటి నుండి మనం సమాచారాన్ని గ్రహించడం అన్నమాట.
🔎 *వినాయకుని విగ్రహం - విశిష్ట వ్యక్తిత్వ నిర్మాణం*🔍
🔹ఏనుగు తల, ఏక దంతం, భారీ బొజ్జ వంటి వాటితో కూడిన వినాయకుని విగ్రహం హిందూ విగ్రహాలు అన్నింటికంటే ఎక్కువ విమర్శలకు గురవుతుంది.
❤️ వాస్తవానికి వినాయకుని విగ్రహం అవ్యక్తుడైన దైవంపై విశ్వాసానికి, మానవతా విలువలకు సంకేతం. సాధారణ వాడుక భాషలో తెలివైనవాళ్లు ఉద్దేశించి వారిది పెద్ద తల అని అనటం వింటుంటాం.
⏩అవ్యక్తుడైన దేవుడు అత్యంత జ్ఞానవంతుడు అనే విషయం తెలుపటానికే వినాయకుని విగ్రహానికి భారీ తల పెట్టడం జరిగింది. అంటే వినాయకుని భారీ తల జ్ఞానానికి ప్రతీకన్నమాట.
🧏♂️ అదేవిధంగా మనిషి ప్రతిభను మెరుగుపరిచే అంశాలలో విషయాన్ని సావధానంగా వినటం అనేది ఒకటి. సావధాన చిత్తులను చెవులు చేటలుగా చేసుకుని వింటున్నాడని అంటుంటాం. ఇతరులు చెబుతున్న విషయం పట్ల సావధాన చిత్తులై ఉండాలని చెప్పడానికి వినాయకుని చెవులు అంత పెద్దవిగా చిత్రీకరించారు మన పూర్వీకులు.
👃అలానే ముక్కుసూటిగా మాట్లాడటం అనేది నైతిక విలువలలో అత్యంత ప్రధానమైనది. మనసులో సకల చెడు భావనలు కలిగి ఉండి పైకి మాత్రం చాలా గొప్ప భావనలు కలవారిగా నటించటం ఎంతో హేయమైన విషయం. ఇలాంటి రుగ్మతకు దూరంగా ఉండమని తెలియచేయటానికే వినాయకుని ముక్కుని తొండంగా పెట్టారు మన పూర్వీకులు.
☝️సృష్టికర్త అయిన దైవం ఒక్కడు అనే సందేశాన్ని భద్రపరచటానికే వినాయకుని విగ్రహానికి ఒకే దంతం పెట్టడం జరిగింది.
🗣️ ఒకరిలోని లోపాలను మరొకరి ముందు చెప్పటం అనేది అత్యంత ఘోరమైన అవలక్షణం. దీని కారణంగానే వ్యక్తుల మధ్య మనస్పర్ధలు, కొట్లాటలు జరుగుతుంటాయి.
ఇతరుల లోపాలు బహిర్గతం చేసే అవలక్షణాలను కడుపు నొప్పి, పొట్ట పేలి పోవడం లాంటి తదితర మాటలతో పోల్చటం చూస్తుంటాం. ఇతరుల రహస్యాలను గుప్తంగా ఉంచటం అనేది నైతిక విలువలకు పరాకాష్ఠ. ఇతరుల తప్పులను కడుపులో దాచుకోమని చెప్పడానికే వినాయకుని విగ్రహానికి భారీ బొజ్జ (పొట్ట) ను పెట్టడం జరిగింది.
⏭️అంతేకాక వినాయకుని చూసి చంద్రుడు అవహేళనచేస్తూ నవ్వాడని అందుకే వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదనే ప్రచారం వింటుంటాం. ఈ విషయం చూసి కొందరు- చంద్రుడు ఒక గ్రహం కదా!? గ్రహం నవ్వటం ఏమిటి? అని ప్రశ్నించటం మనకు విదితమే. వాస్తవానికి ఈ సంఘటన ద్వారా మన పూర్వీకులు ఎంత మనోహరమైన సమాచారాన్ని తెలియజేస్తున్నారో చూడండి.
🔹ఇతరుల బాహ్యాన్ని చూసి అవహేళన చేసేవారిని సమాజం నుండి దూరంగా ఉంచాలని, వారితో మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు కనీసం కన్నెత్తి కూడా చూడకూడదనే సమాచారాన్ని తెలియజేయటానికే ఆ కథను కల్పించటం జరిగిందే తప్ప నిజంగానే చంద్రుడు వినాయకుని చూసి నవ్వాడని కాదు ఇతరులలోని బాహ్యాన్ని చూసి హేళనచేయటం కాదు అంతర్గతంగా ఉన్న విశిష్టతలను గుర్తించటమే విజ్ఞత అన్న సమాచారం అందులో దాగి ఉంది.
❤️ఇలా అనేక ధార్మిక, నైతిక విలువలకు ప్రతీకగా వినాయకుని విగ్రహాన్ని సంకేత దృష్టితో గుర్తించటం విజ్ఞానం అవుతుంది. అలాకాక సామాన్య దృష్టితో ఆ వినాయకుని విగ్రహమే సాక్షాత్తు ఆ అవ్యక్త దేవుడని భావించి, దానినే వేడుకుంటే అది అజ్ఞానమవుతుంది.
ఉదాహరణకు నీరు (water) కు కేవలం సంకేతం మాత్రమే అయిన H2O ను సాక్షాత్తు నీరు(Water) అని అనుకోవటం ఎలా అయితే అజ్ఞానం అవుతుందో..!💡
➡️ వినాయకుని విగ్రహాన్ని సామాన్య దృష్టితో చూసే భక్తులు ఆ విగ్రహాన్ని ఆరాధించటం వలన కలిగే లాభాలేమిటి అనే ఆలోచనలో ఉంటారు ( *నిజానికి వైదిక ధర్మం విగ్రహారాధనను అనుమతించదన్నది వేరే విషయం*). కానీ ఆ వినాయక విగ్రహాన్ని సంకేత దృష్టితో చూసే భక్తులు దాని నిర్మాణం వెనుక ఉన్న మహత్తర ఉద్దేశాన్ని గ్రహించి తన వ్యక్తిత్వాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసుకుంటాడు. *నిజానికి పరమ పవిత్ర హిందూ మతానికి చెందిన విగ్రహాల వెనుక ఉన్న పరమోన్నత లక్ష్యం ఇదే*.
ఇలా వినాయకుని విగ్రహాన్ని సంకేత దృష్టితో చూసినప్పుడే మనలో విశిష్ట వ్యక్తిత్వ నిర్మాణం జరిగి తద్వారా భారత జాతికి పునర్ వైభవం దక్కుతుంది.
*సర్వేశ్వరుడు భారత దేశానికి విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతీ ఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.*
*తథాస్తు! జైహింద్! జై శ్రీరామ్! భారత్ మాతాకి జై!*
ganesh chaturthi, happy ganesh chaturthi, ganesh chaturthi 2022, happy ganesh chaturthi wishes, ganesh chaturthi date, ganesh chaturthi video, ganesh chaturthi katha, ganesh chaturthi wishes, ganesh chaturthi kab hai,ganesh, ganesh chaturthi puja vidhi, ganesh chaturthi status 2022, happy ganesh chaturthi song, ganesh chaturthi shubh muhurat, ganesh chaturthi kab hai 2022 august, happy ganesh chaturthi whatsapp status, ganesha,ganesh aarti, ganesh chaturthi ads