బుధవారం, ఫిబ్రవరి 18, 2026

 Benefits of Terrace Gardening: హాయ్ రీడర్స్! నాకున్న ప్రధానమైన అభురుచుల్లో Terrace Garden ఒకటి. మనం స్వంతంగా గార్డెన్ పెంచుకోవడం వలన మానిసిక ప్రశాంతతతో పాటు ఆర్గానిక్ కూరగాయలను కూడా తినవచ్చు. ఈమధ్యకాలంలో ఆర్గానిక్ ప్రోడక్టల డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అంతే కాకుండా గార్డెనర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇది ఒకరకంగా శుభసూచకమే!

మనం ఇప్పుడు Terrace Garden వలన కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు తెలుసుకుందాము.

Benefits of Terrace Gardening
Benefits of Terrace Gardening 

కల్తీ లేని కూరగాయలు పొందవచ్చు

మనo తినే ఆహారంలోని పదార్థాలు ఎలా కలుషితమై కల్తీ అవుతున్నాయో అనే భయానక కథలను మనం ప్రతిరోజూ వింటుంటాము. వాటి వలన వచ్చే జబ్బులు, ప్రమాదాల గురించి అనేక రిపోర్టులు మన చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ వాటిని వాడక తప్పని పరిస్థితికి లోబడిపోయి ఉన్నాము. వాటికి ఇంజెక్షన్లు వాడటం నుండి హానికరమైన పురుగుమందులను పిచికారీ చేయడం వరకు ఇది జరుగుతుంది. కూరగాయలు వంటి తాజా ఉత్పత్తులను సరైన రంగు లేదా పరిమాణంలో పొందడానికి కృత్రిమంగా పెంచినప్పుడు, అది సహజ పోషకాలను తీసివేస్తుంది. ఇటువంటి వాటిని తినడం వలన ఎంత ప్రమాదమో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఇటువంటి పరిస్తితుల నుండి బయట పడడానికి మనం తప్పనిసరిగా, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ Terrace Garden ఏర్పాటు చేసుకోవాలి.

దీని వలన కల్తీ లేని నాణ్యమైన పంటలను పొందవచ్చు. రుచికరమైన వంటకాలను పొందవచ్చు.

మానవ శరీరానికి శక్తి ఆహారం వలన కలుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. మార్కెట్లో కొనే కూరగాయలలో విషపూరిత రసాయనాలు వాడటం వలన కూరగాయలలోని ఖనిజాలు మరియు విటమిన్ల పరిమాణాన్ని తగ్గిస్తాయి. అంటే మనం కొన్ని ఆహారాలను తీసుకునేటప్పుడు మనకు అవసరమైన పోషకాలు ఏవీ అందవు. అయితే మనం ఏర్పాటు చేసుకున్న Terrace Gardenలో విటమిన్, ఐరన్, మెగ్నీషియం మరియు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. మీరు, మీ కుటుంబ సభ్యులు  పిల్లలునేరుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడం వలన అనారోగ్యం బారి నుండి తప్పించుకోవచ్చు.


శారీరక మరియు మానసిక ఆరోగ్య ప్రయోజనాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం మంచి ఆరోగ్యం పొందాలంటేదీని మనం చేసే పనులలో మనకు ఆనందం, సానుకూల భావోద్వేగాలు, సంతృప్తి కలిగించే కార్యకలాపాలలో కూడా మనం పాల్గొనాలి. WebMD ప్రకారం, తోటపని వంటి బహిరంగ కార్యకలాపాలు వాస్తవానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ అయిన మన శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి సేంద్రీయ తోటపని ఒక కారణమని ఒక డచ్ అధ్యయనం కూడా కనుగొంది.
ఎందుకంటే మనం Terrace Garden నిర్మించడం వలన ప్రతి రోజూ కొంత సమయాన్ని గార్డెన్ అభివృద్ధి కొరకు, కొంత పనిని చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు: మొక్కలకు నీళ్ళు పోయడం, మట్టిని కలపడం, మొక్కలను పరిశీలించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం, గాలి మీమనసును ఉద్దేజపర్చుతాయి. మీ దైనందిన జీవితంలో కలిగే మానసిక ఆందోళలను దూరం చేస్తాయి. ఉదయాన్ని, సాయంత్రాన్ని ఒక టీనో, కాఫీనో సిప్ చేస్తూ గార్డెన్ లో గడపడం... ఆ మానసిక తృప్తిని మనం వర్ణించలేము.

ప్రకృతిని కాపాడబడుతుంది

చక్కని పంటపొలాలను సైతం రియల్ ఎస్టేట్ పేరుతో కాంక్రీట్ జంగిలాలుగా మార్చేస్తున్న ఈరోజుల్లో Terrace Garden చాలా వరకూ ప్రకృతిని కాపాడుతుందనే చెప్పవచ్చు. మనం ప్రకృతిని సంరక్షించుకోకపోతే కొన్ని సంవత్సరాల తరువాత నీళ్ళను కొని తాగుతున్నట్టే గాలిని కూడా కొనుక్కోవల్సిందే. ఇదే పరిస్థితి వస్తే మానవ మనుగడ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోతుందో ఊహించవచ్చు.

ఇంతకీ Terrace Garden అంటే ఏమిటి?

సాధారణ నేలపై కాకుండా ఇంటి టెర్రస్‌పై పూలమొక్కలు లేదా కూరగాయల పంటలను పెంచే కళను టెర్రస్ గార్డెనింగ్ అంటారు. టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయడం చాలా సులభం ఎందుకంటే దీనికి కుండలు లేదా గ్రో బ్యాగులు, మట్టి, వర్మీ కంపోస్ట్ లేదా సేంద్రీయ ఎరువు వంటి కొన్ని వస్తువులు మాత్రమే అవసరం, మొక్కలపై ఆసక్తి ఉన్న ఎవరైనా టెర్రస్ గార్డెన్‌ను ప్రారంభించవచ్చు. 

  • ఇంట్లో పండించిన పండ్లు మరియు కూరగాయలు తెగుళ్ళు మరియు వ్యాధుల నుండి విముక్తి పొంది, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • టెర్రస్ గార్డెన్ రోజువారీ ఆహారం కోసం కూరగాయలను అందించడమే కాకుండా, భవనాన్ని చల్లగా ఉంచుతుంది.
  • Terrace Garden కృత్రిమ గాలిని శుద్ధి చేసి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన గాలిని అందిస్తుంది.  
  • పంటల సాగులో ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తుంది.
  • టెర్రస్ గార్డెన్‌లో భాగంగా ఔషధ మొక్కలు  రక్షణకు మొదటి వరుసలో ఉపయోగపడతాయి.
  • కూరగాయలు మరియు పండ్లు కొనవలసిన అవసరాన్ని తగ్గించడం ద్వారా, జీవన వ్యయం తగ్గుతుంది. 
  • Terrace Garden వలన భవనం యొక్క మొత్తం సౌందర్య విలువను పెంచుతుంది
  • చిన్న స్థాయిలో తోటపని చేయడం కూడా మానసిక ఒత్తిడికి గొప్ప నివారిణిగా ఉంటుంది.
కాబట్టి మిత్రులారా ఈపోస్టును ఆదరించినందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. Terrace Garden పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు నుండే గార్డెన్ ప్రారంభించండి.
మరిన్ని వివరాలకోసం, సమాచారం కోసం దయచేసి మన Youtube ఛానెల్ Organic Nature Garden ను సపోర్ట్ చేయండి. జైహింద్!!!

గురువారం, జనవరి 01, 2026

 kscsmartguide సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

👉మిత్రులారా ఈ నూతన సంవత్సరం 2026ని చక్కని ఆర్ధిక క్రమశిక్షణతో మొదలుపెట్టండి

👉మీ టార్గెట్ అంతా డబ్బు సంపాదనపై పెట్టండి

👉మీలో ఉన్న అనవసర ఖర్చులను తగ్గించుకోండి

👉సంపాదన ఎంత ముఖ్యమో పొదుపు కూడా అంతే ముఖ్యం

👉మీలో ఒక ప్రత్యేకతను నింపుకోండి

👉నలుగురికీ ఆదర్శంగా కనిపించండి

👉తక్కువుగా మాట్లాడండి... మానసిక అశాంతికి దూరంగా ఉండండి

👉జీవితం గురించి పూర్తిగా తెలుసుకోండి

*🙏శుభం🙏*

గురువారం, డిసెంబర్ 18, 2025

 12 Financial Rules and Formulas | 12 ఆర్థిక నియమాలు మరియు ఫార్ములాలు: సంపద సృష్టి వెనుక ఉన్న గణితాన్ని నేర్చుకోండి

గమనిక: ఈక్రింది పోస్ట్ నా స్వంత రచన కాదు. మా ఫ్రెండ్ ఒకరు Facebook షేర్ చేస్తే వచ్చింది. నలుగురికీ ఉపయోగపడితే బాగుంటుంది కదాని బ్లాగులో పోస్ట్ చేసాను. ఈ పోస్ట్ యొక్క అసలు రచయితకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

1. 72 నియమం (Rule of 72)

ఫార్ములా: 72 ÷ వడ్డీ రేటు (%) = డబ్బు రెట్టింపు కావడానికి పట్టే ఏళ్లు

ఉదాహరణ: 8% వడ్డీతో, 72 ÷ 8 = మీ డబ్బు రెట్టింపు కావడానికి 9 ఏళ్లు పడుతుంది.

వివరణ: మీ పెట్టుబడి వృద్ధిని లెక్కించడానికి ఇది అద్భుతమైన షార్ట్‌కట్ (shortcut). త్వరగా పెట్టుబడి పెట్టడం ఎందుకు ముఖ్యమో, కేవలం 1% వడ్డీ ఇచ్చే సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉంచడం వల్ల మీరు ఎంత నష్టపోతున్నారో ఇది చూపిస్తుంది.


2. 50/30/20 బడ్జెట్ నియమం

ఫార్ములా: 50% అవసరాలు, 30% కోరికలు, 20% పొదుపు/పెట్టుబడులు

ఉదాహరణ: నెలకు 5,000 ఆదాయం ఉంటే: 2,500 అవసరాలకు, 1,500 విలాసాలకు, 1,000 పొదుపుకు కేటాయించాలి.

వివరణ: ఇది చాలా సులభమైన బడ్జెట్ పద్ధతి. మీ ఆదాయంలో సగం ఇంటి అద్దె, సరుకుల వంటి నిత్యావసరాలకు పోతుంది. 30% మీ జీవనశైలికి (సినిమాలు, షికార్లు), 20% మీ భవిష్యత్తు కోసం దాచుకోవాలి.


3. నికర విలువ (Net Worth) ఫార్ములా

ఫార్ములా: ఆస్తులు (Assets) - అప్పులు (Liabilities) = నికర విలువ

ఉదాహరణ: మీకు 5 లక్షల ఆస్తులు ఉండి, 2 లక్షల అప్పు ఉంటే = 3 లక్షలు మీ నికర విలువ.

వివరణ: ఇది మీ ఆర్థిక పరిస్థితిని తెలిపే ప్రోగ్రెస్ రిపోర్ట్. మీరు నిజంగా సంపదను పెంచుతున్నారా లేదా అప్పులతో ధనవంతులుగా కనిపిస్తున్నారా అనేది ఇది చెబుతుంది. దీన్ని ప్రతి మూడు నెలలకోసారి చెక్ చేసుకోండి.


4. చక్రవడ్డీ (Compound Interest) ఫార్ములా

ఫార్ములా: A = P(1+r)^t (P=అసలు, r=వడ్డీ రేటు, t=కాలం)

ఉదాహరణ: 1,000 రూపాయలను 5% వడ్డీతో 10 ఏళ్లు ఉంచితే = 1,629 అవుతుంది.

వివరణ: ఐన్‌స్టీన్ దీనిని "ప్రపంచ ఎనిమిదవ వింత"గా అభివర్ణించారు. మీ డబ్బు డబ్బును సంపాదిస్తుంది, ఆ సంపాదన మరింత డబ్బును తెస్తుంది. మీరు పెట్టుబడి పెట్టడం ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టపోతారు.


5. అప్పు-ఆదాయ నిష్పత్తి (Debt-to-Income Ratio - DTI)

ఫార్ములా: (నెలవారీ మొత్తం అప్పులు ÷ నెలవారీ ఆదాయం) × 100%

ఉదాహరణ: నెలకు 5,000 సంపాదిస్తూ, 2,000 అప్పు కడుతుంటే = 40% DTI.

వివరణ: బ్యాంకులు మీకు లోన్ ఇవ్వాలా వద్దా అని దీని ఆధారంగానే నిర్ణయిస్తాయి. 36% కంటే తక్కువ ఉంటే మీ ఆర్థిక ఆరోగ్యం బాగున్నట్లు. 43% దాటితే మీరు ప్రమాదంలో ఉన్నట్లు లెక్క.

6. సేవింగ్స్ రేటు ఫార్ములా

ఫార్ములా: (నెలవారీ పొదుపు ÷ నెలవారీ ఆదాయం) × 100%

ఉదాహరణ: 5,000 ఆదాయంలో 1,000 పొదుపు చేస్తే = 20% సేవింగ్స్ రేటు.

వివరణ: మీరు ఎప్పుడు ఆర్థిక స్వేచ్ఛ పొందుతారో చెప్పే బెస్ట్ ఫార్ములా ఇది. కనీసం 20% లక్ష్యంగా పెట్టుకోండి. ధనవంతులు సగటున 30-40% ఆదా చేస్తారు, పేదవారు ఏమి ఆదా చేయరు.


7. 70 నియమం (ద్రవ్యోల్బణ ప్రభావం)

ఫార్ములా: 70 ÷ ద్రవ్యోల్బణ రేటు (%) = డబ్బు విలువ సగానికి పడిపోయే ఏళ్లు

ఉదాహరణ: 6% ద్రవ్యోల్బణం (inflation) ఉంటే, 70 ÷ 6 = 11.67 ఏళ్లలో మీ డబ్బు విలువ సగానికి పడిపోతుంది.

వివరణ: బ్యాంకులో డబ్బు ఖాళీగా ఉంచడం వల్ల నష్టం ఎందుకు జరుగుతుందో ఇది వివరిస్తుంది. ద్రవ్యోల్బణం వల్ల మీ డబ్బు విలువ ప్రతిరోజూ తగ్గుతూ ఉంటుంది.


8. అత్యవసర నిధి (Emergency Fund) ఫార్ములా

ఫార్ములా: నెలవారీ అత్యవసర ఖర్చులు × 6 = అత్యవసర నిధి లక్ష్యం

ఉదాహరణ: బతకడానికి నెలకు 3,000 అవసరమైతే × 6 = 18,000 మీ అత్యవసర నిధిలో ఉండాలి.

వివరణ: ఇది మీ ఆర్థిక భద్రతా వలయం (Safety net). ఉద్యోగం పోయినా, ఆసుపత్రి ఖర్చులు వచ్చినా అప్పుల పాలవ్వకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది.


9. పెట్టుబడిపై రాబడి (Return on Investment - ROI)

ఫార్ములా: ((చివరి విలువ - ప్రారంభ పెట్టుబడి) ÷ ప్రారంభ పెట్టుబడి) × 100%

ఉదాహరణ: 1,000 పెట్టుబడి పెట్టి, చివరకు 1,500 పొందితే = 50% ROI.

వివరణ: మీ పెట్టుబడి లాభదాయకమా కాదా అని ఇది చెబుతుంది. వ్యాపారం, రియల్ ఎస్టేట్ లేదా స్టాక్స్... దేనినైనా పోల్చడానికి దీన్ని వాడండి. నెగటివ్ ROI వస్తే ఆ పెట్టుబడికి దూరంగా ఉండండి.


10. 4% రిటైర్మెంట్ రూల్

ఫార్ములా: రిటైర్మెంట్ కోసం కావలసిన వార్షిక ఆదాయం ÷ 0.04 = మొత్తం కావాల్సిన పొదుపు

ఉదాహరణ: రిటైర్మెంట్లో ఏటా 60,000 కావాలంటే ÷ 0.04 = 15 లక్షలు (1.5 మిలియన్లు) దాచుకోవాలి.

వివరణ: మీ రిటైర్మెంట్ లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకోవడానికి ఇది పనికొస్తుంది. కేవలం ఆశపడటం కాకుండా, ఒక ఖచ్చితమైన టార్గెట్ మీ ముందు ఉంటుంది.


11. వ్యక్తిగత నగదు ప్రవాహం (Personal Cash Flow)

ఫార్ములా: పన్నుల తర్వాత నెలవారీ ఆదాయం - నెలవారీ ఖర్చులు = నగదు ప్రవాహం

ఉదాహరణ: 6,000 సంపాదించి, 4,500 ఖర్చు చేస్తే = 1,500 పాజిటివ్ క్యాష్ ఫ్లో.

వివరణ: మీరు ప్రతి నెలా గెలుస్తున్నారా లేదా ఓడిపోతున్నారా అని ఇది చూపిస్తుంది. పాజిటివ్ ఉంటే సంపద పెరుగుతున్నట్లు, నెగటివ్ ఉంటే మీరు అప్పుల్లో కూరుకుపోతున్నట్లు అర్థం.


12. ఆర్థిక స్వేచ్ఛా సంఖ్య (Financial Freedom Number)

ఫార్ములా: వార్షిక ఖర్చులు × 25 = ఫైనాన్షియల్ ఫ్రీడం నంబర్

ఉదాహరణ: ఏటా 50,000 ఖర్చు ఉంటే × 25 = 12.5 లక్షలు (1.25 మిలియన్లు) ఉంటే మీరు ఫ్రీ.

వివరణ: మీ సమయాన్ని మీరే కొనుక్కునేలా చేసే మొత్తం ఇది. ఈ నంబర్ సాధిస్తే మీరు మళ్ళీ డబ్బు కోసం పని చేయాల్సిన అవసరం లేదు. ఇదే అసలైన లక్ష్యం.


వాస్తవం: పాఠశాలల్లో ఈ సూత్రాలను నేర్పించరు ఎందుకంటే ప్రజలు ఆర్థికంగా గందరగోళంలో ఉంటేనే వ్యవస్థకు లాభం. ధనవంతులు గణితాన్ని, డేటాను నమ్ముతారు. పేదవారు భావోద్వేగాలను, అదృష్టాన్ని నమ్ముతారు. ఈ 12 సూత్రాలు సంపద సృష్టిలో ఉన్న అస్పష్టతను తొలగిస్తాయి.


క్విక్ స్టార్ట్ (ఇప్పుడే మొదలుపెట్టండి):

ఇప్పుడే మూడు విషయాలను లెక్కించండి: మీ నికర విలువ, సేవింగ్స్ రేటు మరియు ఫైనాన్షియల్ ఫ్రీడం నంబర్. మీరు ఆర్థికంగా ఎక్కడ ఉన్నారో, ఎంత వేగంగా కదులుతున్నారో ఇవి చెబుతాయి.


ముగింపు: ఆర్థిక స్వేచ్ఛ అనేది 100% గణితం, 0% అదృష్టం. పెట్టుబడులను ప్లాన్ చేయడానికి, మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడానికి ఈ ఫార్ములాలను వాడండి. ధనవంతులు ఫలితాలు ఎలా ఉంటాయో ముందే లెక్కించుకుంటారు.


ప్రో టిప్స్:

  • దీన్ని ప్రింట్ తీసుకుని వారానికి ఒకసారి చూడండి.
  • ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు 'రూల్ ఆఫ్ 72' వాడండి.
  • ప్రతి నెలా 1వ తేదీన మీ నికర విలువను లెక్కించండి.
  • మీ వయసు 30 ఏళ్ల లోపు ఉంటే, చక్రవడ్డీ (Compound Interest) మీ సూపర్ పవర్.
  • అప్పు-ఆదాయ నిష్పత్తి (DTI)ని ఎప్పుడూ 30% కంటే తక్కువ ఉంచుకోండి.

బుధవారం, నవంబర్ 12, 2025

 These are essential for human peace!: ఈరోజుల్లో మనిషి ప్రశాంతతగా బ్రతకాలంటే ఈక్రింది టిప్స్ తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే వీటి పట్ల ఎప్పుడూ జాగ్రత్త వహించనివాడు ఎప్పటికీ జీవితంలో పైకి ఎదగానూ లేడు, ప్రశాంతగా ఉండనూ లేడు.

What is the importance of peace in human life?

మీపట్ల అసూయ పడేవారికి, ఈర్ష్య పడేవారికి ఎప్పటికీ మీ పర్సనల్ విషయాలు షేర్ చెయ్యకండి

మీ సాయం పొంది కూడా మీపట్ల సరిగా స్పదించని వారిని అసలు పట్టించుకోకండి... రెండోసారి ఎంత అవసరమైనా సరే  సహకారం అందించకండి.

పొగడ్తలకు పొంగిపోయేవారిని మీ పనుల కోసం పొగిడి చేయించుకోవాలి.. ఇటువంటి వారిని ఒంటరిగానే పొగడండి తప్ప నలుగురిలో పొగడకండి. నలుగురిలో ఇటువంటి వారిని పొగిడితే భజనకారుల బిరుదుకి బలి అయ్యిపోతారు.

మనసును బాధపెట్టే వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడలేని వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి

మిమ్మల్ని తిట్టడానికి ఎదుటివారిని అడ్డు పెట్టుకున్నవారు కేరెక్టర్ లేనివాళ్ళే! వాళ్లకి దూరంగా ఉంటే మనకే మంచిది.

భాద్యత లేని వారికి సహాయం చేయకండి.. ఎందుకంటే మీరు చులకన అయ్యిపోతారు

సహాయం పొంది కూడా కృతజ్ఞత చూపని వారికి జీవితంలో మళ్ళీ సహకరించకండి.. వాళ్ళు సహాయం పొంది కూడా మీపట్ల తప్పుడు ప్రచారానికి, నిందలు మోపడానికి కూడా వెనుకాడరు.

తమరు మాత్రం సహాయం పొందుతూ ఎదుటివారికి సహకరించకుండా జారుకునే వారిని దూరంగా నెట్టండి. ఇటువంటి సన్నాసి వెధవలు చాలా ప్రమాదకరం!

మరికొన్ని విషయాలు కొద్ది రోజులలో...

మంగళవారం, జులై 29, 2025

 Books increase a person's knowledge! | పుస్తకాలు మనిషి యొక్క జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి!

ఈరోజు మనిషి ఫోన్ కి బానిస అయిపోయాడు. తన రోజు వారీ టైంలో అత్యధిక భాగం ఫోన్ కోసమే కేటాయిస్తున్నాడంటే అతిశయోక్తి కాదేమో! తను జ్ఞానాన్ని సంపాదించుకోవడం మానివేసి అబద్దాలతో కూడిన ప్రపంచంలోని చెత్తనంతా తన బుర్రలో నింపుకుని మూర్ఖుడిలా తయారవుతూ మానవత్వాన్ని మంటగలుపుతున్నాడు

దయచేసి మనమందరమూ ఆలోచించాల్సిన విషయం

ముదురు పోయినవారిని ఎలాగూ బాగుచేయలేము...

మన పిల్లల తరాన్ని అయినా బాగు చేయండి...

వారికి సరైన నడవడికను నేర్పాలి...

వాళ్ళకి ఫోన్లను అవసరానికి మించి ఇవ్వకూడదు...

టెక్నాలజీ పెరుగుతున్న విషయం కరెక్టే... కాని ఆ టెక్నాలజీ తన అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి గాని తన జీవితం తన వ్యక్తిత్వం నాశనమయ్యేలా ఉంటే ఎలా?

ప్రతి ఒక్కరూ ముందు తన జీవితం గురించి తెలుసుకోవాలి... నేర్చుకోవాలి దానికి కేవలం పుస్తకాలు మాత్రమే దోహదం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలి. పుస్తకాలు మనిషి మెదడును తట్టి లేపుతాయి.

పుస్తకాలు మనిషిలోని జ్ఞానాన్ని బయటికి తీస్తాయి. ఆలోచనాశక్తిని పెంచి పోషిస్తాయి. మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి.

కాబట్టి మిత్రులారా కనీసం మన పిల్లల యొక్క తరాన్ని అయినా బాగుచేద్ధాము. పిల్లలలో పటణా శక్తిని పెంచండి. మీరు కూడా పుస్తకాలు చదవడం అలవర్చుకోండి. ఏమి నేర్చుకోకుండా బ్రతకడం కంటే నేర్చుకుంటూ బ్రతకడంలో ఉన్న ఆనందం మరెంద్లోనూ ఉండదు. జైహింద్!!!


ఆదివారం, జూన్ 22, 2025

 

Are all those who wear jasmine flowers adulterers? | మల్లెపూలు పెట్టుకున్నవారందరూ వ్యభిచారులేనా?

ఈమధ్య RTVలో హిందూ, క్రిష్టియన్ల మధ్య ఒక డిబేట్ ప్రోగ్రాం జరిగింది. ఒక చర్చి కార్యక్రమంలో షాలెం రాజు అనే ఒక పాస్టర్ క్రైస్తవ స్త్రీలు ఎవరూ మల్లెపూలు పెట్టుకోరు. కేవలం బజారు స్త్రీలు మాత్రమే పెట్టుకుంటారు అని మల్లెపూలు వ్యాపారి కధ ఒకటి చెప్పాడు.

ఈ విషయంలో జరిగిన చర్చలో కొంతమంది పాస్టర్లు షాలెం రాజు మాట్లాడిన మాటలు తప్పుకాదు, 100% కరెక్టేనంటూ వాదించారు, ఇది కేవలం తన సంఘ సభ్యులకోసమే మాట్లాడారు అంటూ అడ్డంగా మాట్లాడటం విచిత్రంగా అనిపించింది. కొంతమంది పాస్టర్లు మాత్రం వ్యతిరేకత ప్రకటించారు.

షాలెంరాజును సమర్ధించిన వారు ఈక్రింది విషయాలు ఎందుకు ఆలోచించరు?

షాలెం రాజు సంఘంలో ఉన్న స్త్రీలు ఇక చర్చిలోనే ఉండిపోతారా? బయట సమాజంలో తిరగరా? ఇతర మత వర్గ స్త్రీలతో వాళ్లకి సంబంధాలు ఉండవా?

ఇటువంటి చెత్త ప్రసంగాలు చేసే వెధవలని ఏమి చెయ్యాలి?

చర్చి సభ్యులను అలా కొండ గోరెల్లా తయారు చేస్తే ఎలా?

చర్చి సభ్యులలో ఇటువంటి చెత్తను బుర్రల నిండా నింపితే బయట సమాజంలో మల్లెపూలు పెట్టుకున్న ఇతర మత స్త్రీలను వ్యభిచారుల క్రింద చూడటం మొదలు పెట్టరా? యేసు తప్ప మిగతా ప్రవక్తలను, పుణ్య పురుషులను సైతానులుగా భావించి దూషించే వీళ్ళకి ఇటువంటి ప్రసంగాలు వాళ్ళను ఏవిధంగా మార్చి వేస్తాయో ఒకసారి ఆలోచించండి!

మల్లెపూలు పెట్టుకున్న స్త్రీలు వ్యభిచారులైతే మరి చర్చి కి మల్లెపూలు పెట్టుకువెల్లె స్త్రీలు ఏమైతారు? వ్యభిచార వృత్తి చేసే వాళ్ళు చీరలు, జాకెట్లు ధరిస్తారు... మరి ఇవన్నీ ధరించే క్రైస్తవ స్త్రీలు ఏమైతారు?

ఏవో దిక్కుమాలిన ప్రసంగాలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి.. ఇది ఎంతవరకూ కరెక్ట్ అని?

"నీ కంట్లో దూలం ఉంచుకుని ఎదుటి వాడి కంట్లో నలుసును ఎంచవద్దు" అన్న యేసు వారి వార్నింగ్ ఇటువంటి చెత్త పాస్టర్లకు కరెక్ట్ గా సరిపోతుంది! జైహింద్!!!

గురువారం, మే 29, 2025

 

Will Mumbai Indians win the IPL 2025 trophy?: ఈ సీజన్లో జరుగుతున్న IPL 2025 టోర్నమెంట్ చాలా అద్భుతంగా ఉంది. 10 టీమ్స్ పోటీ పడగా నాలుగు టీంలు ఖ్వాలిఫై అయ్యాయి. అందులో ముంబాయి ఇండియన్స్ టీం ఉండటం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన హైదరాబాద్ టీం ఖ్వాలిఫై అవ్వకపోవడం చాలా బాధగా కూడా అనిపించింది.

ఏది, ఏమైనా మొత్తానికి ముంబాయి ఇండియన్స్ ఖ్యాలిఫై అయ్యింది 

రేపు గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడి ముంబాయి ఇండియన్స్ విజయం సాధిస్తే ఈరోజు RCB చేతిలో ఓడిపోయిన పంజాబ్ తో ఆడాల్సి ఉంటుంది.

మొత్తానికి మూడు మ్యాచులు నెగ్గితేనే ముంబాయ్ ఇండియన్స్ IPL 2025 ట్రోఫీ సాధిస్తుంది.

ఇది ముంబాయ్ ఇండియన్స్ కి సాధ్యమవుతుందా? అనేది త్వరలో తెలుస్తుంది.

Recent Posts