Books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, జులై 07, 2022

 2 Books You Must Read If You're Serious About Success | మనం తప్పనిసరిగా చదవాల్సిన 2 పుస్తకాలు: హాయ్ మిత్రులారా! Welcome to KSC Smartguide : మీకు ఈ పోస్టులో రెండు పుస్తకాల గురించి తెలియజేస్తాను. ఇవి రెండూ మన జీవితానికి చాలా,చాలా గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మన నిజ జీవితంలో ఎలా మలుచుకోవాలో మెళకువలను నేర్పిస్తాయి.

ఆరెండు బుక్సూ ఎవనుకుంటున్నారా?

2 Books You Must Read If You're Serious About Success
2 Books You Must Read If You're Serious About Success

అవి మన యండమూరి వ్రాసినటువంటి "తప్పు చేద్దాం రండి" ఒకటి, ఇంకా రాబర్ట్ గ్రీన్ గారు వ్రాసినటువంటి "శక్తి యొక్క 48 సూత్రాలు (48 Principles of Energy)" అనే పుస్తకమొకటి. ఇవి రెండు పుస్తకాలు మనిషికి ఎంత ప్రయోజనాన్ని చేకూర్చుతాయో మాటలలో వర్ణించలేము.

యండమూరి వ్రాసినటువంటి "తప్పు చేద్దాం రండి" పుస్తకంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. ఈ బుక్ చదవడం ప్రారంభిస్తే చాలు బుక్ ఆసాంతం పూర్తయ్యే వరకూ వదిలి పెట్టలేము. నేను అత్యధికంగా ఇష్టపడే పుస్తకాలలో ఈ బుక్ ఒకటి.

ఈ పుస్తకంలో....

మాటల విలువ గురించి..
  • చాలా మందికి తమ మాటల విలువ తెలీదు. అందుకే తెగ మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట మాట్లాడితే దానివల్ల నీకయినా ఆనందం ఉండాలి. నాకయినా లాభం ఉండాలి.
  • ఒక వ్యక్తీ తనకి అవసరమైన జ్ఞానాన్ని, మరో అనవసరమైన వ్యక్తికీ అనవసరంగా ఇవ్వడాన్నే వాగుడు అంటారు. మీరు జాగ్రత్తగా గమనించండి. జీవితంలో "నిజంగా" గెల్చినవాళ్ళు అవసరమైనప్పుడే మాట్లాడతారు.
  • ఒక వ్యక్తీ ఇతరులతో మాట్లాడే మాటల్ని గమనించండి. అందులో ఇరవై శాతం తన గురించి ఉంటుంది. పదిశాతం అవతలి వ్యక్తి గురించి ఉంటుంది.మిగతా 70% శాతం ఇద్దరికీ సంబంధించిన వ్యక్తియా గురించో, సంఘటనల గురించో అయి వుంటుంది. మొత్తంలో 90% అనవసరమైనది ఉంటుంది. ఇది పెద్ద తప్పు 
  • స్వరంలో నిజాయితీ, మాటల్లో అమాయకత్వం ఉండాలి. స్వతహాగా రాదు. ప్రాక్టీస్ చేయాలి.
  • నీ నిశబ్దం అవతలి వ్యక్తిని ఇరుకున పడేస్తుంది. ఆ అయోమయంలో అతడు ఎక్కువ మాట్లాడుతాడు.అందుకే ఎక్కువ పవర్ ఉన్నవాడు తక్కువ మాట్లాడుతాడు. అవసరం అయినప్పుడే మాట్లాడుతాడు. ముఖ్యంగా సమస్య తాలూకు తుఫాను సూచనలు కనపడుతున్నప్పుడు...
  • సమస్యకు ఒకరకంగా, విమర్శకు ఒక రకంగానూ స్పందించాలి.
  • ఎప్పుడూ సీరియాస గా, గంభీరంగా ఉండకుండా, చూసేవాళ్ళకి స్పూర్తినిచ్చేలా, ఆహ్లాదంగా కనిపిస్తే చాలా లాభం వుంటుంది.
  • అన్నిటికన్నా ముఖ్య విషయం మరొకటి ఉన్నది. అకస్మాత్తుగా ఒక కష్టం వచ్చినప్పుడూ, అనుకోకుండా అమితమైన సంతోషం కలిగినప్పుడూ ఎక్కువ మాట్లాడకు. నీ మౌనమే నిన్ను రక్షిస్తుంది. సంతోశంలోని అతివాగుడు నిన్ను కష్టంలో పడేస్తుంది. టెన్షన్ లో అతివాగుడు నిన్ను చులకన చేస్తుంది. నీ గాంభీరమే నీ స్తితప్రజ్ఞత 

జ్ఞానం గురించి....

  • నీకు జ్ఞానం కావాలంటే ప్రతిరోజూ కొంత నేర్చుకో..
  • ఒంటరిగా వెళ్ళేవాడు వెంటనే బయల్దేరవచ్చు. ఇంకొకడు తోడు కావాలనుకునే వాడు అవతలివారు వచ్చేవరకూ ఆగాలి. జ్ఞాని అందుకని ఎప్పుడూ ఒంటరే. జ్ఞానం నిరంతర అన్వేషణ.
  • తమ రంగంలో కనీస అవగాహన లేనివారు గొప్ప,గొప్ప అవకాశాలను పోగొట్టుకుంటారు.
  • ఇది సత్యమేనా? ఇది అవసరమా? ఇది వినాశనకారా? అన్న మూడు ప్రశ్నలు నీ ప్రవర్తనను మారుస్తాయి. ఉన్నతంగా ఆలోచించు. ఏ మార్పు మంచికి దారి తీస్తుందో, ఏది చెడుకు దారి తీస్తుందో తెలుసుకోవడమే జ్ఞానం.
  • తెలివైనవాడు అవకాశాల కోసం ఎదురు చూడడు. వాటిని తనే సృష్టించుకుంటాడు.
  • ఇలా ఈవిధంగా చెప్పుకుంటూ పొతే అనేక విషయాలున్నాయి. ఎటువంటి విషయంలో ఎలా ఉండాలో, సమస్య వచ్చినప్పుడూ, ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలా మాసాలు కోవాలో ఈ పుస్తకం తప్పకుండా నేర్పుతుంది.

ఇక రెండవ పుస్తకం రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించిన శక్తి యొక్క 48 సూత్రాలు | 48 Principles of Energy గురించి తెలుసుకుందాం.

కొందరు అధికారంతో,శక్తితో ఆడుకుంటారు. ఇటువంటి వారు ప్రాణాంతకమైన ఒక పొరపాటువల్ల తమ శక్తి మొత్తం పోగొట్టు కుంటారు.కొందరు అవసరమైనదానికన్నా ముందుకి వెళ్లిపోతే,మరికొందరు అవసర మైనంత మేరకి కూడాముందుకు పోలేరు. కానీ అతి తక్కువమంది సరైన పనులు చేసి,ఎంతో తెలివిగా శక్తిమంతులవుతారు.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి.మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ,ఉపయోగకరమైనదీ కావచ్చు.
ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు...

శక్తి యొక్క 48 సూత్రాలు 

  • 1.బాస్ ని మించినట్టు ప్రవర్తంచవద్దు
  • 2.మిత్రులని అతిగా నమ్మవద్దు,శత్రువులని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి
  • 3.మీ ఉద్దేశాలని దాచిపెట్టండి
  • 4.అవసరమైన దానికన్నా తక్కువే మాట్లాడండి
  • 5.పేరు ప్రతిష్ఠలు మీదే ఎంతో ఆధారపడి ఉంది-ప్రాణ సమానంగా కాపాడుకోండి
  • 6.ఏది ఏమైనా సరే అందరి దృష్టిని ఆకట్టుకోండి
  • 7.మీ పని ఇంకొకరి చేత చేయించండి,కాని పేరు ఎప్పుడూ మీకే దక్కేట్టు చూసుకోండి
  • 8.ఇతరులని మీ దగ్గరకి రప్పించుకోండి-అవసరమైతే ఎరని ఉపయోగించండి
  • 9.వాదనతో కాదు,మీ చేతలతోనే గెలవండి
  • 10.అంటువ్యాధి : దురదృష్టవంతులకి దూరంగా ఉండండి.
  • 11.ఇతరులు మీమీద ఆధారపడేలా ఎలా చేయాలో నేర్చుకోండి
  • 12.నిజాయితీని,ఉదారతను జాగ్రత్తగా ఎంచుకోండి
  • 13.సహాయం కోరేటప్పుడు,అవతలివారి దయనీ,కృతజ్ఞతనీ ఆశించవద్దు.
  • 14.స్నేహితుడిలా నటించండి,గూఢచారిలా పని కానివ్వండి.
  • 15.మీ శత్రువుని పూర్తిగా అణచివెయ్యండి
  • 16.గౌరవాన్ని సంపాదించేందుకు అంటీముట్టనట్టుగా ఉండండి
  • 17.అవతలివారిని ఉత్కంఠకు గురిచేయండి.ముందుగా ఊహించటానికి వీలులేని వాతావరణాన్ని సృష్టించండి.
  • 18.ఆత్మరక్షణకోసం కోటలు కట్టుకోకండి-ఏకాంతవాసం ప్రమాదకరమైంది.
  • 19.మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారో తెలుసుకోండి-పొరపాటున తప్పుచేయని వ్యక్తికి కోపం తెప్పించకండి.
  • 20.ఎవరికీ నిబద్ధుడై ఉండొద్దు.
  • 21.మూర్ఖుడిగా కనిపించటంకోసం,మూర్ఖుడిలా ప్రవర్తించండి-మీ ముందున్నవ్యక్తికన్నా అమాయకుడిలా నటించండి.
  • 22.లొంగిపోవడం అనే యుక్తిని ఉపయోగించండి:బలహీనతను శక్తిగా మార్చుకోండి.
  • 23.మీ శక్తులన్నీ ఒకచోట కేంద్రీకరించండి.
  • 24.పరిపూర్ణుడైన ఆస్థానికుడి పాత్ర నిర్వహించండి.
  • 25.మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి.
  • 26.మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి.
  • 27.మిమ్మల్ని ఆరాధించే అనుచరుల బృదాన్ని తయారుచేసుకునేందుకు వాళ్ల నమ్మకాన్ని సంపాదించండి.
  • 28.ధైర్యంగా పనిలో ప్రవేశించండి.
  • 29.చివరిదాకా పూర్తి ప్రణాళికని వేసుకోండి.
  • 30.మీ విజయాలు సులభంగా సాధించినవన్నట్టు కనిపించనీయకండి.
  • 31.ఇతరుల నిర్ణయాలని నియంత్రించండి. మీరు పంచే పేకముక్కలలో ఇతరులు ఆడేటట్టు చూడండి.
  • 32.అందరూ కనే పగటికలలని సమర్ధించండి.
  • 33.ప్రతి వ్యక్తిలోనూ ఉండే బలహీనమైన అన్శాన్ని గుర్తించండి.
  • 34.మీ పద్ధతిలో మీరు రారాజులా ఉండండి. రాజులాగౌరవం పొందాలనుకుంటే,రాజులా పని చెయ్యండి.
  • 35.సరైన సమయం ఎంచుకునే కళలో నిష్ణాతులు కండి.
  • 36.మీరు పొందలేని వాటిని తిరస్కరించండి. వాటిని అలక్ష్యం చెయ్యడమే అన్నిటికన్నా ఉత్తమమైన ప్రతీకారం.
  • 37.ఆకట్టుకునే అద్భుత దృశ్యాలని సృష్టించండి.
  • 38.మీకిష్టం వచ్చినట్టు ఆలోచించండి,కానీ అందరిలా ప్రవర్తించండి
  • 39.చేపల్ని పట్టేందుకు నీళ్లని కదపండి
  • 40.ఉచితంగా లభించేవాటిని తిరస్కరించండి
  • 41.గొప్ప వ్యక్తిని అనుకరించటం మానండి.
  • 42.గొర్రెల కాపరి మీద దాడి చేస్తే గొర్రెలు చెదిరిపోతాయి.
  • 43.ఇతరుల హృదయాలనీ,మనసులనీ జయించండి.
  • 44.అద్దం చూపించి సమ్మోహితులనీ,కోపోద్రక్తులనీ చెయ్యండి
  • 45.మార్పు అవసరమని ఉపదేశించండి,కాని ఒక్కసారిగా మరీ ఎక్కువ సంస్కరించకండి.
  • 46.మరీ నిర్దుష్టంగా ఉన్నట్టు కనబడకండి.
  • 47.లక్ష్యాన్ని దాటి వెళ్లకండి,గెలిచిన తరవాత ఎక్కడ ఆగాలో తెలుసుకోండి.
  • 48.నిరాకారులుగా తయారవకండి.
కాబట్టి మిత్రులారా జీవితంలో మీ విజయ సాధనకు వెన్నతో పెట్టిన ముద్దలా మిమ్మల్ని తీర్చి దిద్దుతాయి. అతి సునాయాసంగా మిమ్మల్ని దరికి చేర్చుతాయనడంలో అతిశయోక్తి లేదు.
మీకు ఈ పుస్తకాల లింక్స్ క్రింది ఇచ్చాను. ఒకసారి చూడండి.
1. తప్పు చేద్దాం రండి: https://amzn.to/3ANVUUX 2.శక్తి యొక్క 48 సూత్రాలు: https://amzn.to/3RfK37A
best books, best books for success, books successful people read, books you must read, books for more money, think and grow rich, think and grow rich by napoleon hill, unlimited power by tony robbins, unlimited power book, think and grow rich review, how to win friends and influence people, the four hour work week, Tim Ferriss books, the 7 habits of highly effective people, recommended books, successful people read, what do successful people read

శుక్రవారం, జులై 01, 2022

 Book reading importance in Telugu | నిద్రపోయే ముందు 15నిముషాలు పుస్తకం చదవండి.

Book reading importance in Telugu

ఈరోజుల్లో మనిషి జీవితం యాత్రికం అయిపొయింది. తన గురించి తను ఆలోచించుకునే సమయం కూడా మనకి లేకుండా పోయింది. ఇదేగాని జరిగితే మన జీవిత పరమదశకు వెళ్లి ఒకసారి వెనుకకు చూసుకుంటే మనకంటూ ఏమీ ఉండదు. ఒక రోబోలా జీవితాన్ని ఇలా ఈడ్చుకుంటూ గడిపామా? అనిపిస్తుంది. మన జీవితాన్ని ఎంత మిస్సయ్యామో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇంటువంటి పరిస్థితిని ఏమంటారంటే ఆదమరిచిన జీవితం అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కొని ఉండాలి.

ఈ కొద్ది జీవితాన్ని ఎలా గడపాలి? ఎంత ఆనందంగా జీవిన్చాలనేది అవగాహన, ప్రణాళిక వేసుకుంటూ ఉండాలి. ఇటువంటి విషయాలన్నిటి పట్ల పూర్తి అవగాహన, గైడెన్స్ మీకు కేవలం పుస్తకాలు మాత్రమే అందిస్తాయి.

కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలి.

అబ్బే! అంత సమయం మాకెక్కడ అనుకోకండి. ప్రతిసారి దేవుడిస్తున్న 24గంటలను మనమేమీ ఊడపోడిచేయడం లేదు. అలాగని ఉద్దరించడం లేదు. మీరు తలుచుకుంటే తప్పనిసరిగా పుస్తకాలు చదవడానికి సమయం మిగులుతుంది. నిజానికి సమయం లేదన్నవాడే సమయాన్ని ఎక్కువ వృధా చేస్తాడని మేధావులు చెప్తారు.

కనీసం రాత్రి పడుకునే ముందు అయినా 15నిముషాలు చదవడానికి కేటాయించండి. ఇది ఎంతో మంచి పధ్ధతి. మేధావులు సైతం అనుచరించే విధానం. దిక్కుమాలిన క్రైం సీరీసులు, కాపురాలు ఎలా విడగొట్టాలో తెలిపే "నీ మొగుడే నా మొదటి మొగుడు" లాంటి పనికిమాలిన టీవీ సీరియల్స్ చూడటం మానివేయండి. వీటి వలన మనస్సు ఆందోళనకు గురికావడం, బుర్ర చెడు ఆలోచనలతో నిండిపోవడం తప్ప ఏం లేదు.

మిత్రులారా ప్రపంచంలో పుస్తకాలకు మించిన గొప్ప స్నేహితుడు ఎక్కడా దొరకడు. మళ్ళీ,మళ్ళీ చెప్తున్నా! ఏరోజైతే తలాడించి పుస్తకం చదువుతావో ఆరోజు నుండీ నిన్ను తల ఎత్తుకు బ్రతికేలా చేస్తుంది పుస్తకం.

కాబట్టి మిత్రులారా పుస్తకాలు చదవడం అలవర్చుకోండి! జైహింద్!!!  

importance of reading books, the importance of books in Telugu, the importance of books in Telugu,books importance in Telugu,why we reading books in Telugu,in Telugu, book reading in Telugu,Telugu books, reading books, advantages of reading books, advantages of reading a book in Telugu, books reading uses in Telugu.., reading books Telugu, Telugu reading books, online Telugu books reading, the importance of reading, importance of reading

 


Recent Posts