Terrace gardening is one of my favorite hobbies
"Terrace gardening" is one of my favorite hobbies!: గత పోస్టులో "మనసు ప్రశాంతత కోసం ఇవి తప్పనిసరి!" అంటూ ఒక ఆర్టికల్ పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా అభిరుచులు గురించి పేర్కొనడం జరిగింది. దానిలో భాగంగా నాకిష్టమైన అభిరుచి "గార్డెనింగ్" గురించి తెలియజేయడం జరుగుతుంది
డియర్ రీడర్స్! గార్డెనింగ్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే మన పని ఒత్తిడి నుండి మనస్సు రిలాక్స్ అవ్వడానికి కాసేపు పచ్చని గార్డెన్ గడిపితే చాలు... అబ్బా ఆ ప్రశాంతత వర్ణించలేనిది
గార్డెనింగ్ చేయడం వలన కూడా మనం స్వచ్చమైన ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు, ఫలాలు పొందవచ్చు.
మరొక ముఖ్య విషయమేమిటంటే "టెర్రాస్ గార్డెనింగ్" ద్వారా ఆదాయ వనరులు కూడా సమకూర్చుకోవచ్చు. అవన్నీ మరొక పోస్టులో తెలియజేస్తాను.
కాబట్టి గార్డెనింగ్ పట్ల ఇంట్రస్ట్, అవకాశం ఉంటే తప్పనిసరిగా ప్రారంభించండి.
నా గార్డెనింగ్ photos ఒకసారి చూడండి... చూడడమే కాకుండా ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు!