శుక్రవారం, మే 02, 2025

These are essential for peace of mind

Peace of Mind: How to Find It, Keep It: మనిషికి ముఖ్యంగా కావాల్సింది ప్రశాంతతే! దీనిని ఎవరూ మార్కెట్లో కొనలేరు, అలాగే ఒకరి నుండి పొందేది కూడా కాదు, అలాగని ఆస్తులు, అంతస్థులు సంపాదించినా దొరకదు... మరి దీనిని పొందట ఎలా? అంటే...

నిజం చెప్పాలంటే మన ప్రశాంతతను మనమే తయారు చేసుకోవాలి.. అందుకనుగుణంగా మనమే మారాలి. మన అలవాట్లు, అభిరుచులు మనకనుకూలంగా మార్చుకోవాలి. ఎందుకంటే మన అలవాట్లు, అభిరుచులు మార్చుకోలేనంతకాలం మనకి ప్రశాంతత దొరకదు.

దీనికోసం ఏమి చేయాలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను... మీరు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసి అలవర్చుకుంటే ఖచ్చితంగా మీరు ప్రశాంతతను పొందుతారు

  • తక్కువుగా మాట్లాడటం నేర్చుకోండి: నలుగురూ ఉన్నప్పుడు వినటం మంచిది, లోడ,లొడా వాగేవారు నలుగురిలో చులకన, లోకువ అయిపోవడం ఖాయం. మనకి పూర్తిగా తెలియని విషయాలు తెలుసునట్టుగా మాట్లాడితే మనం తెలివి తక్కువ దద్దమ్మ గా పరిగణిస్తారు. మరొక ప్రమాదం ఏమిటంటే ఎక్కువుగా మాట్లాడేవారికి శత్రువులు పెరిగిపోతారు. గొడవులు ఏర్పడిపోతాయి. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే గౌరవం పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి తక్కువ మాట్లాడండి... అదీ కూడా అవసరమైతేనే... మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి.

ఎక్కువ మాట్లాడేవాడు బట్టలిప్పి నగ్నంగా రోడ్డు మీద కూర్చున్నవాడి మాదిరిగా అయిపోతాడు.


  • తెల్లవారు జాము నిద్ర లేవండి: ఈ పాయింట్ కష్టంగా అనిపించవచ్చు.. కానీ తప్పదు. ఇష్టమొచ్చినట్లు నిద్రలేచేవాడు..జీవితంలో దేనికి పనిచేయడు. వాడు సాధించేది కూడా ఏమీ ఉండదు. తెల్లవారు జాము నిద్ర లేచే వారికి మంచి ఆరోగ్యం, మంచి సంపాదన కలుగుతుంది. ఇవి రెండూ పొందడానికి అవసరమైన జ్ఞానం దొరుకుతుంది.. మరొకసారి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి.. తెల్లవారు జాము నిద్ర లేవని వాడికి సరైన జీవితం ఉండదు... వాళ్లకి సమయం విలువ తెలియదు... అటువంటి వారిలో సంస్కారాన్ని కూడా పూర్తిగా చూడలేము.

దీరుభాయి అంబానీ ఒకసారి "సూర్యుడు నన్ను మంచం మీద చూసి 50 సంవత్సరాలు అయ్యిందన్నాడు" 


  • పుస్తక పటనం చెయ్యండి: పుస్తకాలు చదవని వాడికి జ్ఞానం రాదు, జ్ఞానం లేని వాడికి ప్రశాంతత ఉండదు. మనం కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా పుస్తకాలు చదవాల్సిందే! మనకు, మన అభిరుచులకూ సంభంచిన గొప్ప, గొప్ప పుస్తకాలెన్నో మార్కెట్లో ఉన్నాయి. వాటిని తెచ్చుకోండి.. మరింతగా నేర్చుకోండి. నేను ఖచ్చితంగా చెప్పగలను.. పుస్తకాలు చదివేవాడు చాలా హుందాగా వ్యవరించగలడు. మూధనమ్మకాలను, అసత్యాలను నమ్మడు.. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోగలడు. 

మనం తలదించుకుని పుస్తకం చదివితే... అవే పుస్తకాలు మనం తలెత్తుకునేలా చేస్తాయి


  • మీకిష్టమైన అభిరుచిని పెంపొందించుకోండి: ఇప్పటివరకూ చెప్పిన పాయింట్స్ కంటే అతి ముఖ్యమైన పాయింట్ ఇది. మీలో ఉన్న ప్రత్యేకతను అభిరుచిగా మార్చుకోండి. ఉదాహరణకు డ్రాయింగ్ వేయడం, రచనలు చేయడం, ప్రసంగాలు, సంగీతం, ఆటలు ఆడటం... అలాగే గార్డెనింగ్ చేయడం... అలా అనేకం ఉన్నాయి. మీకు నచ్చినవి చేయండి.. వాటిని పూర్తిగా అభివృద్ధి పర్చుకోండి. ఎందుకంటే అవి మీకు కీర్తిని, డబ్బును కూడా సంపాదించి పెడతాయి. కొంతమంది తమ అభిరుచినే వృత్తిగా మార్చుకుని జీవితంలో ఎదిగినవారున్నారు.

ఇక్క మీకు మరొక ముఖ్య విషయం చెప్పాలి... చాలామంది క్రికెట్ చూడటం, సినిమాలు వీక్షించడం కూడా అభిరుచే అనుకుంటారు. నిజానికి ఇవి ఎప్పటికీ అభిరుచిలోకి రావు. రిలీఫ్ కోసం, ఆనందం కోసం క్రికెట్ చూడటం, సినిమాలు వీక్షించడం మంచిదే... ఎంటర్ టైన్మెంట్ మనిషికి ముఖ్య అవసరం కూడా, కానీ అదే అభిరుచి అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం.

అభిరుచి వలన మీరు కేటాయించే సమయం ఉపయోగపడాలి, మీకు మానసికంగా, శారీరకంగా ప్రయోజనం ఉండాలి, మీకు కీర్తిని, అవసరమైతే సంపాదనను కలిగించాలి, మీకు ఆరోగ్యాన్ని, మానసిక సంతృప్తిని కలిగించాలి.. ఇటువంటి ప్రయోజనాలున్న వాటినే అభిరుచులు అంటారు.. ఒకసారి ఆలోచించండి మిత్రులారా క్రికెట్ ఆడటం వలన పైవి కలుగుతాయా? క్రికెట్ చూడటం వలన కలుగుతాయా?... పైవన్నీ కలిగేవాటినే అభిరుచిగా మార్చుకోండి.

అభిరుచి అంటే చేసేవి, నేర్చుకునేవి తప్ప... చూసేవి ఎప్పటికీ అభిరుచులు కావు

డియర్ రీడర్స్.. పై ఆర్టికల్ మీకందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాత్రమె అందించాను, మరికొన్ని పాయింట్స్ మరొక పోస్టులో అందిస్తాను. ఈ విధంగా పై పాయింట్స్ మనం అలవాటుగా మార్చుకోవాలి. మన దైనందిన జీవితంలో ఈ అలవాట్లు తప్పనిసరి. అలాగే మన బ్రతుకు వృత్తితోపాటు ఈ పాయింట్స్ యొక్క ఆవశ్యకత కూడా అత్యవసరం. కాబట్టి మన మనస్సు ప్రశాంతత కోసం ఈ పనులను నేర్చుకోండి... అలాగే అమలులో కూడా పెట్టండి. జైహింద్!!!

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts