What's wrong with a world traveler exploring
మనందరికీ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అంటే తెలియనివారు పెద్దగా ఉండరు. ఎందుకంటే ఆయన అన్వేషణ వివిధ దేశాల అందాలను, అక్కడి జీవన విధానాలను చాలా చక్కగా తన Youtube ఛానెల్ ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు
ఆయన చూపించే కొన్ని దేశాలను చూస్తుంటే ఇవి నిజంగానే భూమి మీద ఉన్నాయా అనిపిస్తోంది. అటువంటి విచిత్రమైన, వింతైన దేశాలను, అందాలను చూపించడంలో అన్వేషణను మించినవారు ఎవరూ లేరు. అందుకే ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అయ్యాడు.
ఇక మరొక ముఖ్యమైన విషయానికొస్తే ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ఈమధ్య బెట్టింగ్ యాప్స్ పై భారీ యుద్ధం మేడలు పెట్టాడు. ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారో ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. అవన్నీ వెలుగులోకి వచ్చిన తరువాత చూస్తే ఒక్కొక్కరి కళ్ళు బార్లు గమ్ముతున్నాయి.
సంపాదించడం తప్పు కాదు.. సంపాదించే విధానం చాలా మోసపూరితమైంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు
ఇటువంటి యాప్స్ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ చేస్తున్న యుద్ధం మనమందరమూ సపోర్ట్ చేయాల్సిందే!
ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా దోచుకుంటున్న డబ్బులన్నీ టెర్రలిస్టుల చేతుల్లోకి వెళ్తున్న విషయం ఆయన బయట పెట్టాడు. ఇదంతా పాకిస్తాన్ నుండి నడుస్తున్న ఒక మాఫియా అని తెలియజేసాడు.
కొంతమంది ప్రపంచ యాత్రికుడు అన్వేషణను తప్పుబట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి? బెట్టిన్ యాప్స్ పట్ల ఆయన చేస్తున్న దానిలో తప్పేముంది?
ఈ సమాజం ఏమై పోతుందో నాకేంటి? అన్ని దేశాలు తిరుగుతూ, Youtube ఛానెల్ ద్వారా సంపాధించుకోవచ్చని ఊరుకోలేదు... మనలందరినీ ఎడ్యుకేట్ చేయాలనుకున్నాడు.
Youtube ఛానెల్ ద్వారా నెలకి 30 లక్షలు వస్తుందట... ఇటువంటి వివాదాల జోలికి వెళ్తే నా Youtube ఛానెల్ కి ఇబ్బంది కలగవచ్చు అని ఆయన బయపడలేదు.
తన కుటుంబంలో ఈ బెట్టిగ్ యాప్స్ ద్వారా జరిగిన నష్టం మరొక కుటుంబానికి జరగకూడదని కంకణం కట్టుకుని మరీ యుద్ధం చేస్తున్నాడు. దీనిని మనం సమర్దిన్చవల్సిందే!
మన ప్రపంచ యాత్రికుడు అన్వేషణ చేస్తున్న యుద్దాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి ఈ బెట్టింగ్ యాప్స్ ను నిరోధించాలి. వీటి ప్రమోషన్స్ చేస్తున్న అందరి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి