"Vijayaniki Aaro Mettu" is a must-read book!: ప్రముఖ రచయిత "యండమూరి వీరేంద్రనాథ్" రచించిన అద్భుతమైన పుస్తకాలలో "విజయానికి ఆరో మెట్టు" ఒకటి. విజయం సాధించాలంటే మనిషికి ఉండాల్సిన ముఖ్యమైన 6 లక్షణాలు గురించి ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది.
- ధైర్యము
- ధనము
- తేజస్సు
- కీర్తి
- జ్ఞానము
- శాంతి
వీటిని సాధించడానికి భగవద్గీత ఏవిధంగా తోడ్పడుతుందో ఈ "విజయానికి ఆరో మెట్టు" ద్వారా చాలా చక్కగా వివరించారు. ఈ పుస్తకంలో కూడా "యండమూరి వీరేంద్రనాథ్" గారి రచనాశైలి అద్భుతంగా ఉంది. రకరకాల ఉదాహరణలతో చక్కగా విదశీకరించే విధానం బాగుంది.
పై ఆరు షడ్విధ ఐశ్వర్యాలు పొందాలంటే కృషి, పట్టుదల అవసరం... ఎందుకంటే కృషి లేకపోతే ఈ పై ఆరు షడ్విధ ఐశ్వర్యాలు సున్నాలు మాత్రమే... ఎప్పుడైతే కృషి అనే "ఒకటి: 1" జతకల్సిందో అప్పటినుండీ పై ఆరు షడ్విధ ఐశ్వర్యాలకూ విలువ ఉంటుంది.
ఈ విషయాలను యండమూరిగారు వివరించిన విధానం సూపర్ గా ఉంది. కాబట్టి మిత్రులారా "విజయానికి ఆరో మెట్టు" అనే పుస్తకాన్ని తప్పనిసరిగా చదవండి!
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి