శుక్రవారం, జులై 01, 2022

 Book reading importance in Telugu | నిద్రపోయే ముందు 15నిముషాలు పుస్తకం చదవండి.

Book reading importance in Telugu

ఈరోజుల్లో మనిషి జీవితం యాత్రికం అయిపొయింది. తన గురించి తను ఆలోచించుకునే సమయం కూడా మనకి లేకుండా పోయింది. ఇదేగాని జరిగితే మన జీవిత పరమదశకు వెళ్లి ఒకసారి వెనుకకు చూసుకుంటే మనకంటూ ఏమీ ఉండదు. ఒక రోబోలా జీవితాన్ని ఇలా ఈడ్చుకుంటూ గడిపామా? అనిపిస్తుంది. మన జీవితాన్ని ఎంత మిస్సయ్యామో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇంటువంటి పరిస్థితిని ఏమంటారంటే ఆదమరిచిన జీవితం అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కొని ఉండాలి.

ఈ కొద్ది జీవితాన్ని ఎలా గడపాలి? ఎంత ఆనందంగా జీవిన్చాలనేది అవగాహన, ప్రణాళిక వేసుకుంటూ ఉండాలి. ఇటువంటి విషయాలన్నిటి పట్ల పూర్తి అవగాహన, గైడెన్స్ మీకు కేవలం పుస్తకాలు మాత్రమే అందిస్తాయి.

కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలి.

అబ్బే! అంత సమయం మాకెక్కడ అనుకోకండి. ప్రతిసారి దేవుడిస్తున్న 24గంటలను మనమేమీ ఊడపోడిచేయడం లేదు. అలాగని ఉద్దరించడం లేదు. మీరు తలుచుకుంటే తప్పనిసరిగా పుస్తకాలు చదవడానికి సమయం మిగులుతుంది. నిజానికి సమయం లేదన్నవాడే సమయాన్ని ఎక్కువ వృధా చేస్తాడని మేధావులు చెప్తారు.

కనీసం రాత్రి పడుకునే ముందు అయినా 15నిముషాలు చదవడానికి కేటాయించండి. ఇది ఎంతో మంచి పధ్ధతి. మేధావులు సైతం అనుచరించే విధానం. దిక్కుమాలిన క్రైం సీరీసులు, కాపురాలు ఎలా విడగొట్టాలో తెలిపే "నీ మొగుడే నా మొదటి మొగుడు" లాంటి పనికిమాలిన టీవీ సీరియల్స్ చూడటం మానివేయండి. వీటి వలన మనస్సు ఆందోళనకు గురికావడం, బుర్ర చెడు ఆలోచనలతో నిండిపోవడం తప్ప ఏం లేదు.

మిత్రులారా ప్రపంచంలో పుస్తకాలకు మించిన గొప్ప స్నేహితుడు ఎక్కడా దొరకడు. మళ్ళీ,మళ్ళీ చెప్తున్నా! ఏరోజైతే తలాడించి పుస్తకం చదువుతావో ఆరోజు నుండీ నిన్ను తల ఎత్తుకు బ్రతికేలా చేస్తుంది పుస్తకం.

కాబట్టి మిత్రులారా పుస్తకాలు చదవడం అలవర్చుకోండి! జైహింద్!!!  

importance of reading books, the importance of books in Telugu, the importance of books in Telugu,books importance in Telugu,why we reading books in Telugu,in Telugu, book reading in Telugu,Telugu books, reading books, advantages of reading books, advantages of reading a book in Telugu, books reading uses in Telugu.., reading books Telugu, Telugu reading books, online Telugu books reading, the importance of reading, importance of reading

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts