గురువారం, నవంబర్ 04, 2021

 దీపావళి శోభ క్షీణించడానికి క్రైస్తవమత వ్యాప్తే ప్రధాన కారణమా?

Is the spread of Christianity the main reason for the decline of Diwali charm?

దీపావళికి నెలరోజుల ముందునుండే ఎంతో హడావుడి ఉండేది. ఒక్క దీపావళి ఏమిటి? హిందూ పండుగలు ఎవొచ్చ్చినా సరే ఆ కొలాహలం, హాడావుడి, సందడి, సంతోషాలు, ఆనందాలు ఒకటేమిటి..ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో విషయాలలో ప్రజలు తేలియాడుతూ ఉండేవారు. పండుగలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉండేవారు.

అయితే ఈమధ్య కాలంలో ఇది క్రమేపీ క్షీణిస్తూ వస్తోంది. హిందూ పండుగలన్నీ తమతమ కళను కోల్పోతున్నాయి. పండుగ వాతావరణం పూర్తిగా మటుమాయంయ్యిపోతుంది.

దీనికి కారణం ఏమిటి?

భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న క్రైస్తావమతమా? పెరిగిపోతున్న అధిక ధరలా? 

నిజానికి ధరలు ఎంత పెరిగినా కొద్దో,గొప్పో పండుగలు జరుపుకునే పరిస్థితి హిందూ సమాజంలో ఉంది. తప్ప ధరలు కోసం పండుగలను మానుకునే నైజం హిందువులు కలిగిలేరు. అయినా పండుగలు క్షీణిస్తున్నాయంటే ప్రజలలో మాట విశ్వాసాలు మారిపోతున్నాయి. 

క్రైస్తవ మత స్వీకరణకు గురై  హిందూ విశ్వాసాల పట్ల, హిందూ పండుగల పట్ల ఆసక్తి ప్రజలలో సన్నగిల్లిపోతుంది. ఎంతో ప్రఖ్యాతిగాంచిన పూర్వపు పండుగలన్నీ ఆదరణకు నోచుకోకుండా పోతున్నాయి. దీనికి మరొక కారణం కూడా లేకపోలేదు. మూధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు క్రమేపీ స్వచ్చమైన పండుగలలో కలసిపోయి ఆచరించే ప్రజలలో అయిష్టత కూడా పెరిగింది. ఇవ్వన్నీ పెరిగి హిందూ పండుగలన్నీ అంతరించిపోతున్నాయి.

క్రైస్తవ మతం స్వీకరిస్తే ఆవ్యక్తి ఇక హిందూ మహనీయులను కొనియాడటం గాని, హిందూ ఆచారాలను పాటించటం మానివేయాలని క్రైస్తవ గురువులు బోధిస్తారు. ఇది ఎంతవరకూ వేల్లిపోయిందంటే హిందూ శాస్త్రాలను తాకినా, చదివినా పాపమే.. ఇదే జబ్బు ముస్లిం ప్రచారకులలో కూడా ఎక్కువుగానే ఉంది.

వీరి దొంగ బోధనల ప్రభావానికి సామాన్య జనం అదే మత్తులో ఉంటూ అన్నీ పవిత్ర గ్రంధాలనే భావనకు దూరం జరిగిపోతున్నారు. దీనికి మరొక ముఖ్య కారణం ఏమిటంటే సనాతనమైన హిందూ శాస్త్రాలు అంటే ప్రజలకు తెలియక పోవడం, వాటి పట్ల అవగాహన కల్పించాల్చిన హిందూ పండితులు ఒక్కొక్కరూ ఒక్కో మార్గం నిర్మించుకుని కొట్టుకు చావడం... ఇవ్వన్నీ వెరసి దీపావళి వంటి పండుగలు సైతం అంతరించిపోతున్నాయి.

Spoken English Whatsapp Group Links

Join English WhatsApp Groups invite links

English Speaking WhatsApp Group Links

English Learning WhatsApp Group Links

Spoken English WhatsApp Groups Link

Latest English WhatsApp Group Links

1 కామెంట్‌:

 


Popular Posts

Recent Posts