శనివారం, అక్టోబర్ 14, 2017

శోధిని బ్లాగులో వచ్చిన టపా పట్టుకుని బ్లాగిల్లు శ్రీనివాస్, హరిబాబుగార్లు పెడుతున్న కామెంట్లు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు.

శ్రీనివాస్ గారు.
మీరు నాకిచ్చిన రెండు ఫోన్ నంబర్లు స్విచ్చ్ ఆప్ చేసుకుని ఉన్నారు గనుక ఈ పోస్ట్ రూపంలో తెలియజేస్తున్నాను.
మీకూ,నాకూ స్నేహమా? అది కలుషితమయిపోయిందా? ఏo కామెంట్లు పెడుతున్నారో అర్ధం కావడం లేదా?

మీ దగ్గర కొన్ని బ్లాగులు బహుశా రెండు బ్లాగులు ఒకటి సాక్ష్యం మేగజైన్, రెండు ఈ బ్లాగునూ! అయితే ఈ బ్లాగు డిజైన్ పెద్దగా నచ్చక మళ్ళీ నేనే బ్లాగర్లోకి మార్చుకుని డిజైన్ చేసుకున్నా! వీటికి నేను మీకు డబ్బులిచ్చే చేయించుకున్నాను. ఇలా మీ నంబర్, నా నంబర్ తీసుకోవడం, అప్పుడప్పుడూ మాటలాడుకోవడం జరిగేది. అంతవరకే. అంతకు మించి మన విషయంలో ఇంకేముంది? నాకు నా ప్రాణమిత్రులతో కలవడమే సరిగా కుదరడం లేదు. మీతో కలుషితమయ్యి పోయేంత స్నేహ బంధాలే నడిచాయా? చాలా హాస్యాస్పదంగా ఉంది మీ వ్యవహారం. మీది రాజమండ్రి, మాది కాకినాడ. వేట్లపాలెంలోని మా మావయ్య గారి బoక్ లో ఎక్కువుగా ఉంటాను కూడా. మీకు చాలా దగ్గరలో అయినా ఏనాడు మిమ్మల్ని కలవనే లేదు. మీరు చెపుతున్నంత స్నేహం మన మధ్య ఉంటే మనం కలవకుండా ఉంటామా? మీరు కల్సే ప్రయత్నం చేసానని చెప్పవచ్చు. అయితే మీతో ప్రత్యేకంగా కలిచేoత అవసరం, స్నేహభావం మనమధ్య లేవు. మీరు గతంలో కొంతమంది బ్లాగర్ల విషయంలో మీరు రికార్డ్ చేసిన ఫోన్స్ నాకు మెయిల్ ద్వారా వినిపించినప్పుడే మీకు ఫోన్స్ రికార్డ్ చేసే భయకరమైన గుణం ఉందని గుర్తించి ఉంటే ఆరోజు నుండే అప్పుడప్పుడూ మీరు కాల్ చేస్తూ నాతో మాట్లాడే విధానానికి స్వస్తి చెప్పేసే వాడిని.మీరు ఆదుకునేoత  దౌర్భాగ్యపు స్థితిలో నేను లేను.ఇటువంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు కలిపించకండి.

గతంలో మీరు వివిధ ఐడిలతోనూ, బ్లాగులతోనూ పల్లా కొండల రావుగారి అగ్రిగేటర్ విషయంలో చేసిన దాడి నాకింకా గుర్తుంది. గతంలో నా బ్లాగులలో కూడా మీరు వివిధ ఐడిలతో కామెంట్ చేసేవారు కదా? ఆ విషయాలు నాతో కూడా పంచుకునేవారు కదా? మీరు అప్పుడప్పుడూ కావాలని చేసే వైరల్ దృష్టిలో పెట్టుకుని మీకు ఫోన్ కూడా చేసాను. కాని మీరు మాట్లాడిన తీరు చూస్తే మీరేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. అయితే ఫోన్స్ రికార్డ్ చేసే నికృష్టపు అలవాటు నాకు లేదు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు.

ఏమో నా అభిప్రాయం నిజం కావచ్చు. పొరపాటు కావచ్చు.నిజానికి వేరే బ్లాగులో వచ్చిన ఆ అజ్ఞాత కామెంట్ గురించి పట్టించుకోవడం అనవసరమనిపించిoది.

కాబట్టి నాగురించి మీరు చేస్తున్నది ఇక్కడితో ఆపు చేసేయండి. బాగుండదు. మీరు శోధినిలో టపా వేసినప్పుడే ఈ క్రింది కామెంట్ పెట్టాను. ఎవరివలన జరిగిందో ఎందుకు జరిగిందో, కావాలని జరిగిందో, తెలియదు గాని ఈ విషయాన్ని అనవసరం అన్న ఉద్దేశ్యంతో ఈ కామెంట్ పెట్టాను.
దానికి మీరు క్రింది విధంగా స్పందించి సరే సార్ అన్నారు.
మీకు కామెంట్ పెట్టి తీసేయడం అలవాటు కాబట్టి యధాప్రకారం ఆ కామెంట్ మీ బ్లాగునుండి తొలగించి వేసారు.అయితే మాలికలో స్టోరేజ్ అయ్యే ఉంది.

మీ సమాధానంలో సరే సార్..ఈ పోస్ట్ఉద్దేశ్యం వేరని చెప్పిన మీరు నాపై వ్యక్తిగత దూషణలకు ఎందుకు తీసుకు వెళ్తున్నారు? ఇక ఆపేయండి.మీకే మంచిది. మీకు నావలన ఇబ్బంది కలిగితే ఫోన్ చేయండి.మీరు రెండు రోజులనుండి ఫోన్ స్విచ్చ్ ఆప్ చేసుకుని ఉండాల్సిన పని లేదు. ఆన్ చేసుకోండి. నాకు ఫోన్ చేయండి.

ఇక హరిబాబు గారూ!
ఏమిటి మీ వ్యక్తిగత దూషణలు. ఎవడి అభిప్రాయాలు వాడు వ్రాసుకుంటాడు. నచ్చితే మా బ్లాగ్ చదవండి, లేకపోతే మానేయండి. వెధవ్వ , సన్నాసి, పిచ్చి పుల్లయ్య, సైకో, అక్కడ కలిపేస్తా, ఇక్కడ కలిపేస్తా? ఏమిటి సర్ ఈ వాగుడు? మా కీబోర్డులో బటన్స్ లేవనుకుంటున్నారా? మీ వయస్సుకు గౌరవాన్ని ఇవ్వకుండా ఉండలేకపోతున్నాము. అలాగే మా సంస్కారాన్ని వదిలి పెట్టలేము. నా పట్ల మా మేగజైన్ కంటెంట్ రచయితల పట్ల వ్యక్తిగత దూషణలు, సభ్యత దిగజారి మాట్లాడటం మానుకోండి. మా మేగజైన్ రచయితలు మీకంటే కూడా వయస్సులో పెద్దవారు ఉన్నారు. గౌరవంగా ప్రవర్తించడం నేర్చుకోండి. మీకంటే వయస్సులో చిన్న వాడినైన నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటాను. మీ అభిప్రాయాలు నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చలేదని మీతో ఏనాడైనా దూషణలు చేస్తూ కామెంట్ పెట్టానా? లేదే.

మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?

ఇక ఉంటాను. నాకు మీ ఇద్దరి ప్రవర్తన పట్లా కలిగిన బాధతో వ్రాసాను. ఇంకా ముఖ్యమైన, ప్రధానమైన విషయాలు ఉన్నప్పటికీ కొద్దివరకే వ్రాసాను. ఇలా  వ్రాయడమే నాకు చిరాక్ కలిగిస్తోంది. శుభం.

14 కామెంట్‌లు:

 1. @K.S.Chowdary
  మీ వర్షన్ చాలా బాగా చెప్పారు.
  విషయానికి వస్తే మీ కాల్స్ కావాలనే బ్లాక్ చేసాను. మీరు పర్సనల్ మెయిల్ చేస్తారు అనుకున్నాను. అంటే కానీ మరోసారి రచ్చకెక్కుతారు అనుకోలేదు. అయినా నాకున్న పనులన్నీ ఆపుకొని మీతో వాదనకు దిగదలచుకోలేదు.

  నాగురించి మీరు ఎలా అనుకున్నా ... ఏమి వ్రాసినా కూడా ..

  పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు ... చూస్తాడు అని నమ్ముతాను నేను. మళ్ళీ మళ్ళీ కొండలరావు గారి గొడవ ఎందుకు వ్రాస్తున్నారు మీరు? ఆయన అనుమతి తీసుకున్నారా ?

  మీరు మనుసులు కలిస్తేనే స్నేహం అని నమ్ముతారు .. నేను "మనసులు" కలసినా స్నేహం అనుకుంటాను.

  ఇక చెప్పాలంటే చాలా ఉన్నా ఇక్కడ చెప్పడం సభ్యత కాదు ... పర్సనల్ మెయిల్ చేయండి చెప్తా

  రిప్లయితొలగించండి

 2. >> ఏమో నా అభిప్రాయం నిజం కావచ్చు. పొరపాటు కావచ్చు.నిజానికి వేరే బ్లాగులో వచ్చిన ఆ అజ్ఞాత కామెంట్ గురించి పట్టించుకోవడం అనవసరమనిపించిoది. <<

  మీకు అజ్ఞాత కామెంట్లు పెట్టె అలవాటు లేకపోతె మొట్టమొదటిగా నన్ను దూషిస్తూ ఎందుకు పెట్టారు?

  రిప్లయితొలగించండి
 3. మీరు ఇంతకు ముందు కామెంట్స్ ప్రచురించకపోతే వాటినే పోస్టుగా పెట్టాల్సి వస్తుంది .. నా వాదనగా

  రిప్లయితొలగించండి
 4. మీరు నిర్భయగా ఇంతగా అబద్దాలు ప్రతీ వాక్యంలోనూ వ్రాస్తే మీకే నష్టం

  రిప్లయితొలగించండి
 5. @K.S.Chowdary
  మీ వర్షన్ చాలా బాగా చెప్పారు.
  విషయానికి వస్తే మీ కాల్స్ కావాలనే బ్లాక్ చేసాను. మీరు పర్సనల్ మెయిల్ చేస్తారు అనుకున్నాను. అంటే కానీ మరోసారి రచ్చకెక్కుతారు అనుకోలేదు. అయినా నాకున్న పనులన్నీ ఆపుకొని మీతో వాదనకు దిగదలచుకోలేదు.

  నాగురించి మీరు ఎలా అనుకున్నా ... ఏమి వ్రాసినా కూడా ..

  పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు ... చూస్తాడు అని నమ్ముతాను నేను. మళ్ళీ మళ్ళీ కొండలరావు గారి గొడవ ఎందుకు వ్రాస్తున్నారు మీరు? ఆయన అనుమతి తీసుకున్నారా ?

  మీరు మనుసులు కలిస్తేనే స్నేహం అని నమ్ముతారు .. నేను "మనసులు" కలసినా స్నేహం అనుకుంటాను.

  ఇక చెప్పాలంటే చాలా ఉన్నా ఇక్కడ చెప్పడం సభ్యత కాదు ... పర్సనల్ మెయిల్ చేయండి చెప్తా

  మీరు ఆపనేదో మీ శోధినిలో టపా పెట్టకుండా చేయాల్సింది.మీరు వ్రాసినవి యధార్ధాలు.మేము వ్రాసినవి అబద్ధాలా? చాలా విడ్డూరంగా ఉంది.పోస్టుగా పెట్టాల్సి వస్తుంది అనే బెదిరింపు ఒకటి.సర్లెండి.మెయిల్ చేస్తాను చెప్పండి ఏమున్నాయో.

  పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు ... చూస్తాడు అని మీకంటే ఎక్కువుగా నమ్ముతాను నేను.ఇక నుండి ఈ వ్యవహారాన్ని భగవంతుణికే వదిలిపెడుతున్నా!శుభం.

  రిప్లయితొలగించండి
 6. అన్ని వ్రాసిన మీరు ఇది ఎందుకు మర్చిపోయారు ?

  ఒకేఒక్క అజ్ఞాత కామెంట్ తో స్నేహం (ఓహో ఇది స్నేహమని మీరు నమ్మలేదు కదా) పాడుచేసారంటే ఇక మీతో మాట్లాడడం వెస్ట్ అని ఫోన్స్ బ్లాక్ చేశా ! నా టపా క్రింది కామెంట్లలో మిమ్మల్ని తిట్టలేదే

  నేను చెప్పినట్లు టపా పెట్టిన కారణం వేరు ... అజ్ఞాత కామెంట్ల తిట్లకు బాధ్యులు ఎవరు అనేది

  దీనికి ఆయా బ్లాగు యజమానులు బాధ్యత తీసుకోడానికి ఒప్పందం కుదిరింది ...

  ఇక నుండి ఈ వ్యవహారాన్ని భగవంతుణికే వదిలిపెడుతున్నా!శుభం.

  - సర్వే జనా సుఖినోభవంతు!

  రిప్లయితొలగించండి
 7. మీరు ఆపనేదో మీ శోధినిలో టపా పెట్టకుండా చేయాల్సింది.

  -----------------------------------------------

  శోధినిలో టపా పెట్టకముందు మీకు ఫోన్ చెయ్యలేదా ? అప్పుడు మీరు ఏం అన్నారు (నిజం చెప్పండి ఫోన్లకు స్టోరేజ్ లు ఉంటాయ్)

  రిప్లయితొలగించండి
 8. అన్నీ తెలిసినవాడు కేవలం భగవంతుడే! - సర్వే జనా సుఖినోభవంతు!

  రిప్లయితొలగించండి
 9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 10. నా వ్యాఖ్యలు ప్రచురించకుండా, నా వాదన వినిపించుకోకుండా నా బ్లాగుని మాలికలోనుండి తీసివేసాం కదా అని కోతుల్లా కిచ కిచ, బెక బెక మని తిక్క తిక్క వేషాలేస్తే ఒక్కొక్కడి(రి) మక్కెలిరగతంతా !

  @నీహారిక గారు మీ బ్లాగును మాలిక నుండి తొలగించారా? చాలా ఆశ్చర్యంగా ఉందండీ. మాలిక నుండి తొలగించవలసిన ఎన్నో బ్లాగులను వదిలివేసి మీ బ్లాగును తొలగించడం చాలా విడ్డూరం సుమండీ!

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరు హరిబాబుగారిని అడిగిన ప్రశ్నలన్నీ సమంజసంగానే ఉన్నాయి నీహారిక గారు. చూద్దాం ఆయనగారు ఏమని సమాధానం చెప్తారో?

   తొలగించండి
 12. @YOU
  ఇక హరిబాబు గారూ!
  ఏమిటి మీ వ్యక్తిగత దూషణలు. ఎవడి అభిప్రాయాలు వాడు వ్రాసుకుంటాడు. నచ్చితే మా బ్లాగ్ చదవండి, లేకపోతే మానేయండి. వెధవ్వ , సన్నాసి, పిచ్చి పుల్లయ్య, సైకో, అక్కడ కలిపేస్తా, ఇక్కడ కలిపేస్తా? ఏమిటి సర్ ఈ వాగుడు? మా కీబోర్డులో బటన్స్ లేవనుకుంటున్నారా? మీ వయస్సుకు గౌరవాన్ని ఇవ్వకుండా ఉండలేకపోతున్నాము. అలాగే మా సంస్కారాన్ని వదిలి పెట్టలేము. నా పట్ల మా మేగజైన్ కంటెంట్ రచయితల పట్ల వ్యక్తిగత దూషణలు, సభ్యత దిగజారి మాట్లాడటం మానుకోండి. మా మేగజైన్ రచయితలు మీకంటే కూడా వయస్సులో పెద్దవారు ఉన్నారు. గౌరవంగా ప్రవర్తించడం నేర్చుకోండి. మీకంటే వయస్సులో చిన్న వాడినైన నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటాను. మీ అభిప్రాయాలు నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చలేదని మీతో ఏనాడైనా దూషణలు చేస్తూ కామెంట్ పెట్టానా? లేదే.

  మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?

  hari.S.babu
  >>మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?

  మీ బ్లాగులో కామెంటు పెట్టదం ఇష్టంలేకనే సాక్ష్యం అన్యాపదేసపు పోష్టుకి నా బ్లాగులోనే కామెంటు వేశాను!ఇక్కడ ఇంత సూటిగా నా పేరు ప్రస్తావించి సలహాలు ఇచ్చినప్పుడు అక్కడ అన్యాపదేశం ఎందుకు వాడినట్టో?నీతి,సభ్యత గురించి మీ దగ్గిర పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితిలో నేను లేను.మీ బ్లాగు రచయితల్లో నాకన్నా వయస్సు ఎక్కువ ఉన్నవాళు ఉన్నారని అంటున్నారు.కేవలం వయస్సుతోనే పెద్దరికం వస్తుందా?అలా ప్రతివాడికీ వయసును బట్టి మంచి బుద్ధులు,సంస్కారం,అనుభవం,జ్ఞానం వస్తే ఇంక నేరాలు ఎందుకు జరుగుతున్నాయి?వారి వయస్సుకీ,చదువుకీ,అనుభవానికీ ఆయన చేస్తున్నది తప్పని ఆయనకు తెలియదు అంతే నమ్మడం కష్తం!నేను ఆయన బ్లాగు గురించి చెప్పిన అభిప్రాయానికి నూటికి నూరుపాళ్ళు కట్టుబడి ఉంటాను. అని నేను అన్నమాతకి అనుగుణంగ అలా తమకి ఆదాయం పెంచుకోవటానికి ఈతర మతాలని దుమ్మెత్తిపొయ్యదం వయస్సూ,చదువూ,లోకజ్ఞానం ఉన్నవాళ్ళు చెయ్యాల్సిన పనేనా?నేను కిమల్ని వెధవ అంతే "మాఎమూ అనగలం?" అనేటంత తేంజిలో కోపం వచ్చినప్పుడు హిందువులకి తమ మతాన్ని మీరు విమర్శిస్తుంటే కోపం రాదని యెందుకు అనుకుంటూనారు?ప్రపంచంలో అవమానానికి బదులు చెప్పే హక్కు మీకు మాత్రమే ఉందా?హిందువులకి ఉండకూడదా?కావాలని రెచ్చగొట్టే రాతలు రాసి నేను తిట్టానని యేడవకపొతే ఆ రాతలు రాయకుండా ఉండొచ్చు గదా!మీరు తప్పు చెయాలి,కానీ ఏవరూ తిట్టకూడదు - మీరేం లార్డు రీడింగు బామ్మర్దా?

  పిచ్చిపులయ్య అన్నాను నిజమే!ఎందుకు అన్నాను?ఒక ప్రశ్నకి ఎన్నిసార్లు జవాబు చెప్పినా అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేస్తుంటే ఎంత వరకు సహించాలి?ఒక ముస్లిం తన మతంలో ఉన్న మంచిని చెప్పుకోవడం మానేసి నా మతాన్ని తప్పులు పడుతూ ఉంటే వ్యతిరేకించడం తప్పా?

  ఈ మొత్తం వ్యవహారంలో మీరు ఇన్నేసి బ్లాగుల్ని నడపటం యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం కోసమేనని మీకు మీరే బయటపెట్టుకున్నారు - అవునా కాదా?మీరు హిందూమతాన్ని కెలుకుతున్నది కూడా ఎక్కువ హిట్స్ కోసమేనని కూడా సాక్ష్యాధారాలతో రుజువయ్యాక మీరు నాకు నీతులు చెప్పదం కాదు చెయ్యాల్సింది సిగ్గుపడి తల యెక్కడ పెట్టుకోవాలో తగిన చోటు కోసం వెదుక్కోవడం!


  P.S:మీ కీబోర్డుల్ని ఎట్లా వాడితే మీ బ్లాగులకి ఎక్కువ హిట్లు వస్తాయో అట్లా వాడుతూనే ఉన్నారుగా - లేవని ఎట్లా అనుకుంటాను.రీసెంట్ అఫైరులో మొదటి అనామకం కామెంటూ మరియూ బ్లాగిల్లు శ్రీనివాసుతో ఆ పోష్టు దగిర మీ వాదనలూ మిమ్మల్నే అభాసుపాలు చేస్తున్నాయని తెలిసి కూడా ఈ పోష్టు వేసి నాకు సలహాలు ఇవ్వదం చూస్తుంటే మీ తెలివితేటల మీద జాలిగా ఉంది!ఏయే బ్లాగులు ఏఏ ఉదేశంతో మీరు నిర్వహిస్ద్తున్నారో ఇదివరకు తెలియని పిల్లా జెల్ల గొడ్డూ గోదా యావన్మందికీ మరింత విశదం అయిపోయింది.ఈమొతం గొడవలో మీరు ప్రవర్తించిన తీరులో మీకు గౌరవప్రదమయైనది యేదీ లేదు.నా ఉచ్చులో చిక్కుకుని మీ చేతుల్తో మీరే పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి ఎలా పొందాలో దాని గురించి ఆలోచించుకోండి!

  హరిబాబు అంటే అల్లాటప్పాగోంగూరకట్ట అనుకున్నారు కాబోలు - చాణక్యుడికి కూడా పాఠాలు నేర్పగైలిగిన వ్యూహకర్త!చదరంగంలో ఉన్న అన్ని యెత్తుగదల్నీ - ఆఖరికి నన్ను నేను బలిపెట్టుకోవడం లాంటి యెత్తులతో ఒక్కొక్క మెట్టూ నేను మిమల్ని నడిపించుకుంటూ వస్తే ఇవ్వాళ మీరున్న దిక్కుమాలిన పరిస్థితి దాపరించింది మీకు - తెలుసుకుని బుద్ధిగా మసులుకోండి!

  శ్రీనివాస్ గారితో ఫోనులో కచ్చగా అన్నట్టు ఆయనకి తప్ప యెవరికీ తెలియకుండా చైనా వేసిన గార్లాండ్ ప్లాన్ లాంటి మీ ప్లాన్ గురించి అవునని ఒప్పేసుకుని వూరందరికీ టాం టాం వేసుకోవడం తప్ప మీరు సాధించింది ఏమిటి?దీన్ని ఇంకా పొడిగించకండని ఇతర్లకి సలహాలు ఇస్తున్నారు - పొడిగిస్తే నష్టం ఎవరికి?మాకా మీకా!

  రిప్లయితొలగించండి
 13. అందరి అభిప్రాయాలూ చదివాను. అందరి అభిప్రాయాలూ గౌరవిస్తాను.నీహారికకి శిక్ష పడింది అని సంబరపడేవాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాను.శిక్ష నేను కోరుకున్నది...మీరు క్షమ చాలన్నారు. కారణం లేకుండా ఏదీ జరుగదు అని నా విశ్వాసం. నేను కోరుకున్నదే జరిగేలా చేసి నా మనసు గెలిచిన హితులకు వీడ్కోలు చెపుతూ, వేరేవారి బ్లాగ్ స్పేస్ యూస్ చేయడం భావ్యం కాదని భావిస్తూ తిరిగి నా బ్లాగులో కలుసుకుందాం....యుద్ధకళలో గెలుపెవరిదో తేల్చుకుందాం.
  శెలవు
  నీహారిక.

  రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts