ఆదివారం, అక్టోబర్ 08, 2017

జిలేబమ్మ ఎవరో తెలీదు గాని ప్రతి బ్లాగులోకి వచ్చి కామెంట్ పడేస్తుంది. అలా చేయడం మంచిదే గాని ఆ కామెంటేదో అర్ధమయ్యేలా పెడితే బాగుణ్ణు. తెలుగు బాషను కూనీ చేసే పదాలతో ఊదరగొడుతుంది. ఒత్తులు సైతం తప్పు రాస్తే బూతద్ధంతో సైతం వెతికి పట్టుకునే మన శ్యామలీయం మాష్టారు మన జిలేబమ్మను ఎందుకు వదిలి వేసారో కూడా అర్ధం కావడం లేదు. ఇక మన జిలేబమ్మ కామెంట్లను గమనిస్తే బ్లాగర్ల మధ్య, కామెంట్ల మధ్య వైరం ఏర్పాటు చేస్తుంది. వివాదం మరింత ముదిరేలా చేస్తుంది. మరికొన్ని సందర్భాలలో అత్యంత హాస్యాన్ని కూడా కురిపిస్తుంది. ఇంతకీ ఈ జిలేబమ్మ ఎవరో, ఏమిటో నాకు అర్ధమవ్వలేదు. తెలియజేయగలరా?

18 కామెంట్‌లు:

 1. >ఒత్తులు సైతం తప్పు రాస్తే బూతద్ధంతో సైతం వెతికి పట్టుకునే మన శ్యామలీయం మాష్టారు మన జిలేబమ్మను ఎందుకు వదిలి వేసారో కూడా అర్ధం కావడం లేదు.

  తప్పులు వెదకటం అన్నది నా ఉద్యోగం కాదండీ. ఒకవేళ ఎత్తిచూపినా ఆవలివారు తెలుసుకుంటారనీ దిద్దుకుంతారనీ ఆశపడే. కాని చాలామందికి అంత సౌహృదం‌ లేదు. ఈ గిలేబీలను మెచ్చుకొని బిరుదులిచ్చేవారితోసహా కొందరు నేను అన్నిబ్లాగులూ తిరుగుతున్నానని గోలపెట్టటం ఒకటి. పైగా భావంచూడాలీ భాషలోతప్పులుంటేనేం అనో పండితాహంకారం అనో ఎడాపెడా తిట్లొకటి. పోనివ్వండి. అదంతా గతం.

  ఇంక జిలేబీ గారి సంగతంటారా? ఆవిడ ఖందాల్లో తప్పులు వెదకటం ఎందుకూ - తీరుబడి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒప్పులేమన్నా ఉన్నాయేమో వెదుక్కోవచ్చును. నాకంత ఆసక్తి లేదు.

  రిప్లయితొలగించండి


 2. పనిలేని జిలేబమ్మా !
  తనకర్థము కాని మాట, తగరారులతో
  జనుల నడుమ తంటాలన్
  గునగు‌న బెట్టి నడయాడు కోమలవళ్ళీ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. జిలేబమ్మ ఎవరో, ఏమిటో నాకు అర్ధమవ్వలేదు. తెలియజేయగలరా?

  బ్లాగ్ బాంధవి !

  రిప్లయితొలగించండి
 4. >>తెలుగు బాషను కూనీ చేసే పదాలతో ఊదరగొడుతుంది. ఒత్తులు సైతం తప్పు రాస్తే బూతద్ధంతో సైతం వెతికి పట్టుకునే>>

  ఖూనీ కాదు ఖూనీ
  బూతద్దం కాదు భూతద్దం
  ఖందం కాదు కందం

  తెలుగు భాషకి జిలేబీ ఒక దిక్సూచి ... ఒక నిఘంటువు....మనకి అర్ధం కాకపోయినంత మాత్రాన బైబిల్ చదవడం మానేస్తామా ? హరిబాబు గారు అర్ధమయ్యేలాగా చెపుతారు కదా !

  రిప్లయితొలగించండి
 5. నాలుగు లైనుల పోస్టులో మరీ ఇన్ని తప్పులా ? తెలుగా .. తెగులా ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Rao అలియాస్ బ్లాగిల్లు శ్రీనివాస్ గారు..ఏదో నాకొచ్చిన తెలుగు నాలెడ్జ్ తో వ్రాసాను.దానికే నాకు తెగులురావాలని కోరుకోవడం మరీ విడ్డూరం.

   తొలగించండి
  2. @చౌదరి గారు,

   అయితే అనానిమస్ లు ఏ నెట్వర్క్ నుండి వ్రాస్తున్నారో మీకు తెలుసన్నమాట ! తెలిసీ మీరు ఊరుకుంటున్నారన్నమాట ! బ్లాగర్లకీ ఆగ్రిగేటర్లకీ సంబంధం లేదు అంటే ఇదేనా అర్ధం ??? మీరు ఇదే చేతితో .. తెలుగు బ్లాగులు అభివృద్ధి చెందడం ఎలా ? అనే పోస్టు ఎలా వ్రాయగలుగుతున్నారు ? మనసు, బుద్ధి ఒకేలా పనిచేయవా ? బ్లాగర్లకు అసౌకర్యం కలుగుతుంటే ఎలా వ్రాయగలుగుతారు ? బ్లాగులు ఎలా అభివృద్ధి చెందుతాయి ?

   తొలగించండి
  3. నీహారిక గారు,
   నా ఖాళీ సమయాన్నంతా బ్లాగు డిజైన్లతోనూ,బ్లాగులతోనూ గడిపే నాకు ఇవన్నీ సుపరిచితమే! గతంలో కూడా నేను కామెంట్ల సెక్షన్ నుండి అజ్ఞాతను తొలగించడం మంచిదని కూడా చెప్పాను. కాని హరిబాబు లాంటి వారే జాగ్రత్తలు తీసుకోలేదు. పోస్టులు వ్రాసిన బ్లాగర్లే అజ్ఞాత కామెంట్లు వ్రాసి వైరల్ చేస్తున్నారు. కొంతమందైతే అజ్ఞాత సెక్షన్ ఉపయోగించుకొని బ్లాగర్ల మధ్య విరోధాలు సృష్టించడం, మనకి వ్యతిరేకమైన బ్లాగులలో మనల్ని నిందలు పాలు చేయడం కోసం చెత్త కామెంట్లు పెట్టి ఆ బ్లాగర్లు పాల్గొనే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్న నా బ్లాగుల లిస్టు ఎవడో సన్నాసి హరిబాబు గారి బ్లాగులో పెట్టి ఏదేదో వ్రాసి వాడూ,వీడూ అంటూ వ్రాగాడు.దానికి హరిబాబు గారు యాడ్స్ ద్వారా డబ్బులు రావడం "శవాల మీది డబ్బులు ఏరుకోవడం" అన్న చందాన చెత్త రిప్లై ఒకటిచ్చాడు. ఎన్ని బ్లాగులుంటే ఆయనకు నష్టమేంటో అర్ధం కాలేదు. నేనొక బ్లాగ్ డిజైనర్ని.ఎంతో మందికి బ్లాగులు రెడీ చేసి ఇచ్చాను.అలాగే నాకెన్నో ఇంగ్లీష్,తెలుగు బ్లాగులున్నాయి. కరెంట్ బిల్లు నాదే.నెట్ బిల్లు నాదే!ఈ హరిబాబు ఎందుకు బాధపడి పోతాడో తెలియడం లేదు.ఇష్టం లేకపోతే చూడడం మానివేయాలి.ఈయనగారు చూడకపోతే నాకెందుకు బాధ. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా విషయాలు ఉన్నాయి. మనం పట్టించుకుంటే టైం వేస్ట్ నీహారిక గారు. మీ బ్లాగును ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాను. గతంలోనూ..చెప్పాను, ఇప్పుడూ చెప్తున్నాను మీ అభిప్రాయాలు నాకు నచ్చుతాయి. మీరు మంచి,మంచి పోస్టులు వ్రాయండి. ధన్యవాదములు.

   తొలగించండి
  4. మీరు అసలు విషయాన్ని దాటవేస్తున్నారు. తెలుగు బ్లాగుల "బ్లాగ్ వేదిక" మీదా ? కాదా ? అజ్ఞాతలు బూతులు వ్రాస్తున్నారు అని తెలిసీ ఎందుకు ఊరుకుంటున్నారు ? హరిబాబు గారు అన్నట్లు మీ బ్లాగ్ లోకి వచ్చిన ప్రతిసారీ వేరే బ్లాగ్ లోకి ఎందుకు వెళుతున్నది. ఇది మీరు కావాలనే డిజైన్ చేసారా ?

   తొలగించండి
  5. బ్లాగ్ వేదిక నాదే!అదొక బ్లాగర్ అగ్రిగేడర్!వేరే బ్లాగులలో అజ్ఞాతపు బూతులు వ్రాస్తే దానికి నేనేమి చేయగలను?ఇకపోతే ఏదైనా మంచి విషయం వేరే బ్లాగులో ఉంటే పోస్టు క్రింది లింక్ ద్వారా వెళ్ళవచ్చు. అది బ్లాగ్ రీడర్ అభీష్టంపై ఉంటుంది.

   తొలగించండి
  6. ఇంతకుముందు ఒక చర్చ జరిగింది. మీకు మళ్ళీ గుర్తుచేస్తున్నాను.ఆగ్రిగేటర్‌లు రక్షణ కల్పించలేనపుడు డబ్బు ఎందుకివ్వాలి అని నేను అన్నాను. హరిబాబుగారే అగ్రిగేటర్‌లను వెనకేసుకు వచ్చారు. మా అభీష్టం లేకుండానే మీ బ్లాగులో నుండి వేరే బ్లాగ్ లోకి బ్రౌజర్ వెళ్ళిపోతున్నది...ఇది మాత్రం సరికాదు !

   తొలగించండి
  7. నీహారికగారు బ్లాగ్ ఓపెన్ చేసిన వెంటనే పక్క న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయ్యేది కేవలం POPUP యాడ్ మాత్రమే.తప్ప మరొక బ్లాగులోకి వెళ్లే అవకాశం లేదు.

   తొలగించండి
  8. కొంతమంది బ్లాగు పోస్టుల వలన, కామెంట్ల వలన అందరూ ఇంచుమించు మీరు ఎదుర్కొనే పరిస్థితులను ఎదురుకుంటూనే ఉన్నారు. అయితే మీరు తీసుకున్న నిర్ణయం మంచిదేనని అనుకుంటున్నాను. కొన్నాళ్ల పాటు బ్లాగులోకానికి దూరంగా ఉండటం మరీ మంచిదని నా అభిప్రాయం...

   అత్తచచ్చిన ఆరు నెలలకు కోడలు ఏడ్చిందట....ఇప్పటికి గానీ మీకు జ్ఞానోదయం కలుగలేదన్నమాట !

   తొలగించండి
  9. నాకు జ్ఞానోదయం అత్త చచ్చినాడే అల్లుడు ఏడ్చినట్టు..అప్పుడే అయ్యింది. సహిస్తూ వస్తున్నాను.గతంలో రచ్చబండ దగ్గర మీకూ, మెంటల్ హరిబాబుకు జరిగిన వాగ్వాదం కూడా నాకు గుర్తుంది నీహారికగారు. అయితే శ్యామలీయంగారు మరీ సెన్సిటివ్ మనిషి కాబట్టి నిష్క్రమణ అంతే. మీరు ఎవరో అన్నట్టు బ్లాగ్ ధీరవనిత కాబట్టి నిలబడుతున్నారు.

   తొలగించండి


 6. బెత్తపు మాష్టారూ మీ
  రత్తరి యేలన్ జిలేబి రగడల మరి పో
  నొత్తిరి !గురువా తప్పది
  హత్తరి బన్న! వినుమయ్య హజరత్ ప్రశ్నల్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. జిలేబి అంటే స్వీటు. మనం మామూలుగా తినేస్తాం కానీ నార్త్ లో వేడి పాలు తాగుతూ తింటారు.

  రిప్లయితొలగించండి
 8. బ్లాగుల్లో జిలేబి ఆకాశవాణి లాంటిది. మనం అపలేము, చూడలేము. అర్ధం కాకపోయినా ఏమీ చెయ్యలేము.

  రిప్లయితొలగించండి
 9. జిలేబీని తిరగస్తే బీ లేజీ అని అర్ధం!
  అందుకే ఆ లేజీ బీ అందర్నీ కుడుతూ ఉంటుంది:-)

  రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts