మంగళవారం, అక్టోబర్ 10, 2017

Why is the fires on Kancha Ilaiah?
"సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్ళు" పుస్తక రచయిత కంచె ఐలయ్యపై ఇటీవల మన ఆర్య వైశ్యులు విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన బొమ్మలను తగుల బెట్టడం, పుస్తకాలను కాల్చడం, విపరీత పదజాలంతో దుర్భాషాలడటం జరగడంతో పాటు రాష్ట్ర మంత్రి అయ్యుండి టి.జి.వెంకటేష్ గారు "కంచె ఐలయ్యను నడిరోడ్డుపై ఉరి తీయాలి, కొట్టి చంపాలి " లాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు.

ఇంతకీ కంచె ఐలయ్య చేసిన తప్పేమిటి? ఆయనపై అంతగా విరుచుకు పడడానికి గల కారణం ఏమిటి? అని ఆలోచిస్తే మా కులాన్ని ఆయన విమర్శించాడు. మమ్మలను స్మగ్లర్లు అన్నాడన్నదే! అసలు కంచె ఐలయ్య ఆ పుస్తకం వ్రాయాల్సిన అవసరం ఉందా?

నిజానికి ఈ కాలంలో వ్యాపారాలు కోమటోళ్ళు మాత్రమే చేయడం లేదు. అన్ని కులాలవారు చేస్తున్నారు. చిన్నా, పెద్దా వ్యాపారస్తులు అన్ని కులాలలోనూ ఉన్నారు. కేవలం కోమటోళ్ళును మాత్రమే టార్గెట్ చేయడమన్నది అన్యాయమే అవుతుంది. నిజానికి నేటి రాజకీయ నాయకులను మించిన సామాజిక స్మగ్లర్లు ఎవరుంటారు..చెప్పండి?

కంచె ఐలయ్య వ్రాసిన "సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్ళు" అనే పుస్తకం ఈకాలానికి ఏమాత్రం సంబంధించింది కాదు. ఎందుకంటే కోమటోళ్ళు మాత్రమే వ్యాపారరంగంలో లేరుగా? అలా కాకుండా "సామాజిక స్మగ్లర్లు - వ్యాపారస్తులు" అని టైటిల్ పెడితే కరెక్ట్ గా ఈకాలానికి సరిపోతుంది.

అయితే ఇంతకీ "సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్ళు" అనే ఈ పుస్తకం ఏ కాలానికి సరిపోతుంది?

నా దృష్టిలో ఈ పుస్తకం 20సంవత్సరాలనుండి ౩౦సంవత్సరాల క్రితం కాలానికైతే కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఆయా కాలాలలో అత్యధిక వ్యాపారం కోమటోళ్ళ చేతుల్లోనే ఉండేది. గ్రామాలలో,పల్లెలలో పేద ప్రజలను అన్యాయంగానే దోచుకుతినేవారు. చిన్న కిరాణా దుకాణం పెట్టి వేలకు వేలు సంపాదించేవారు. నాసిరకం వస్తువులను అంటగట్టడంలోనూ, తూనికల్లో మోసాలు చేయడంలోనూ వీరిని మించినవారు ఎవరూ ఉండేవారు కాదు. ఇప్పటికీ గ్రామాలలోనూ, పల్లెలలోనూ ఈ విధానం ఏమాత్రం సమసి పోలేదు. కొనసాగుతూనే ఉంది. గ్రామాల,పల్లెల అవగాహన, నివాసన చేసినవారు కాదనలేని పచ్చి నిజం ఇది.

ఇక కంచె ఐలయ్య విషయానికి వస్తే ఈయనగారు లక్షకోట్లు ఇస్తే అందరిచేత బైబిల్ పట్టిస్తాను. క్రైస్తవ మతాన్ని స్థాపిస్తాను అనే ఉద్దేశ్యం గనుక నిజమైతే కంచె ఐలయ్యను తీవ్రంగా పరిగణించవల్సిందే. ఎందుకంటే భారత దేశంలో నేటి క్రైస్తవ్యం ఎప్పుడైతే వ్యాపించబడుతుందో అప్పడే నైతికత నాశనమవ్వడం ఖాయం. ఎందుకంటే యేసు యొక్క ఒరిజినల్ బోధనలు గాని, విశ్వాసాలు గాని నేటి క్రైస్తవంలో ఏకోశానా లేవు.

ఇకపోతే కంచె ఐలయ్యకు సంబంధించిన కులాల వివాద వ్యవహారంలో మత స్వామీజీలు దూరటం విడ్డూరంగానే ఉంది.

8 కామెంట్‌లు:

 1. కంచె ఐలయ్య వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు.ఒక ప్రక్క పరిపూర్ణానంద,మరో ప్రక్క ఆర్యవైశ్యులు ఈ వ్యవహారాన్ని రెచ్చగొడుతూనే ఉన్నారు.

  రిప్లయితొలగించండి
 2. కంచె ఐలయ్య ఒక జబరదస్తీ ప్రశ్న వేశాడు. వైశ్యులు ఆర్యవైశ్యులు ఎలా అవుతారు? ఆర్యులంటే ఆర్యనిస్తాన్ (ప్రస్తుత ఇరాన్)నుండి వలస వచ్చినవారు.ఈ వైశ్యులు ఇరాన్ నుండి వలసవచ్చినవారు కాబట్టే ఆర్యవైశ్యులు అయ్యారా? అన్నది.ఎవరూ ఇప్పటివరకూ సమాధానమే చెప్పలేదు.ఇదే నిజమైతే ఈ ఆర్యవైశ్యులు కూడా భారతీయులు అవుతారా?
  కంచె ఐలయ్యపై అంత విరుచుకుపాటు ఎందుకు?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ ఆర్య-ద్రవిడ సిద్ధాంతానికి ఎప్పుడో కాలం చెల్లిపోయింది!కంచె ఐలయ్యకీ మీకూ ఎప్పటికి తెలుస్తుందో?అసలు సిద్ధాంతం మట్టిలో కలిశాక ఇప్పుడు ఆర్యుల గురించి ప్రశ్న వేస్తే ఎవడు జవాబు చెప్పగలడు?తలకి మాసిన తెలివి అంటే ఇదే:-)

   పిచ్చి పుస్తకాలు రాసెటోళ్ళతో చర్చ ఏముంటుంది?పిచ్చి వదిలే వైద్యం చెయ్యడమే!ఇప్పుడు జరుగుతునది అదే.

   వైజాగులో గొల్లలు దూడలకి పాలు మానిపించి అవి చచ్చాక గడ్డి కూరి ఇంటి దగ్గురకే తీసుకొచ్చి ఆ గడ్డి కూరిన చచ్చిన దూడని పొదుగుల దగ్గిర పెట్టి చేపేటట్టు దూడల తల్లుల్ని మోసం చేసి పాలు పిండి అమ్ముతారు!నేను వైజాగులో చదువుకునేటప్పుడు అంటే 90వ దశాబ్దంలో అన్నమాట!ఇప్పటికీ అక్కడ ఈ తంతు నడుస్తూనే ఉండొచ్చు.అప్పటికే కోమట్లు చేసే వ్యాపారాల్ని కమ్మోళూ శెట్టిబలిజలనే పేరు తెచ్చుకున్న కాపులూ చెయ్యడం మొదలుపెట్టారు,ఇప్పటికీ చచ్చిన దూడలతో పాలు పితికే తన కులంవాళ్ళ సంగతి కూడా చెపాలి - అప్పుడే అతను నిజాయితీగా కులవిమర్శ చేసినట్టు అయ్యేది.స్మగ్లింగు కన్న నోరు లేని మూగజీవాల్ని చంపటం ఇంకా ఘోరం కదా!

   లక్ష కోట్ల డాలర్లు ఇస్తే భారత్ మొత్తాని క్రైస్తవానికి మారుస్తాననడంలో అర్ధం ఏమిటో తెలుసా!ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నవాళ్ళంతా డబ్బుల కోసమే మతం మారినది నిజమేనని తనే ఒప్పుకుంటున్నట్టు - అది హిందువులని అవమానించడం కాదు,తన మతంలోకి వచ్చినవాళ్లని అవమానించడమే అవుతుంది,ఆ విషయంలో కోపం తెచ్చుకోవాల్సింది క్రైస్తవులే!మీరు బైబిలుతో పాటూ డబ్బు కూడా తీసుకురండి అని విదేశీ క్రైస్తవ మత ప్రచారకులకి సూచాన్ ఇస్తూ రాతలో కూడా దొరికిపోయాడు - దాని గురించి అడిగితే జవాబు చెప్పలేక స్వామి తలిదండ్రుల గురించి అడిగి చర్చని పక్కదారి పట్టించాడు.

   చర్చలో నిలబడలేక వ్యక్తిగతమైన విషయాలతో చర్చని పక్కదారి పట్టించే ప్రస్త్రావన ఐలయ్య వైపునుంచే వచ్చింది,అవునా కాదా?,గెలవలేనని తెలెసినప్పుడు పక్కదారి పటించే చావు తెలివి కూడా ఉన్నవాడితో వాదనలు అనవసరం!ఐలయ్య పాల్గొన్న ముఖ్యమైన చర్చల వీడియోలన్నీ చూశాను నేను! అతను చేసిన ఏ సూత్రీకరణకీ శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయాడు.ఇతరులు ఇతను వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పారు.ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ప్రతి చర్చలోన్మొ అతను వోడిపోయాడు,అయినా అతనూ అతని అభిమానులూ దాని కవరప్ చేసుకుంటొ కొత్త హడావిడి మొదలుపెడతారు.ఆవె ప్రశ్నలు మరోరకంగా అదగటం, ప్రశ్నలూ కొత్తవి కావు - ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలూ ఇదివరకు అదివరకు జవాబులు చెప్పినవే!ఒక ప్రశ్నకి ఎచ్వరయినా ఓకె జవాబుని అన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అవే మార్చి మార్చి అడగటం దేనికి?

   ఇదివరకు బ్రాహ్మలు చేశారని తిట్టిపోసే కడుపులో చల్ల కదలకుండా కూర్చుని పాఠాలు చెప్పే ఉత్పత్తి శ్రమ కాని సోమరిపని చేస్తూ ఉత్పత్తి కులంపేరు అయిన షెపర్డ్ తను ఎందుకు పెట్టుకున్నాడు?ఆ పేరు పెట్తుకుని తను యూనివర్సిటీలోనూ బయటా ఎన్ని గొర్రెల్ని కాస్తున్నాడు ఇప్పుడు?

   ఇతరుల్ని నాతో చర్చకి రండి అని పిలిచే ఐలయ్కికి అసలు చర్చ అంటే ఏమిటో తెలుసా?

   తొలగించండి
 3. మరి కంచె ఐలయ్యకి ఇతర కులాల మీద అంత విరుచుకుపాటు ఎందుకో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ ఆర్య-ద్రవిడ సిద్ధాంతానికి ఎప్పుడో కాలం చెల్లిపోయింది!కంచె ఐలయ్యకీ మీకూ ఎప్పటికి తెలుస్తుందో?అసలు సిద్ధాంతం మట్టిలో కలిశాక ఇప్పుడు ఆర్యుల గురించి ప్రశ్న వేస్తే ఎవడు జవాబు చెప్పగలడు?తలకి మాసిన తెలివి అంటే ఇదే:-)

   ఈ ఆర్య-ద్రవిడ సిద్ధాంతానికి ఎప్పుడో కాలం చెల్లిపోతే ఇక ఆర్య అని పెట్టుకు తిరగడం దేనికంటారు?

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. ఈ ఆర్య-ద్రవిడ సిద్ధాంతానికి ఎప్పుడో కాలం చెల్లిపోతే ఇక ఆర్య అని పెట్టుకు తిరగడం దేనికంటారు?

   hari.S.babu
   నాలాంటివాడు ఎవడన్నా ఏదన్నా చెబితే అర్ధం చేసుకోవటానికి కూడా విన్నవాడికి కొంత తెలిసి ఉండాలి!మీ అంతట మీరు అసలు ఆర్య-ద్రావిడ పదాలు ఎప్పుడు ఎవరు ప్రస్తావించారో తెలుసుకోవడానికి ప్రయత్నించారా?ప్రయత్నించి ఉండరు!ఒళ్ళు బద్ధకం లాగే బుద్ధి బద్ధకం కూడా ఉంటుంది గాబట్టి ఇకముందు కూడా మీరు ఇలాంటి విషయాలను సొంతంగా తెలుసుకోవాలని ప్రయత్నించరు - నాకు తెలుసు!

   మొదట ఈ పదాల్ని పరిచయం చేసినవాడు మాక్స్ ముల్లర్.అతనికి సంస్కృతం కూడా అప్పుడే కొత్తగా నేర్చుకున్నాడు.వైదిక సాహిత్యం గురించి అంతగా తెలియని మొదటి రోజుల్లో ఈ దేశంలో ఆర్యజాతి,ద్రవిడజాతి అని రెండు విభిన్న సంస్కృతులు గల జనసమూహాలు ఉండేవని పొరపాటు పడ్డాడు.అయితే మీలాంటివాళ్ళలా అతను దాంతోనే సంతృప్తి పడి ఆగిపోలేదు,మరికొంత పరిశోధన చేశాక తన పొరపాటు అర్ధం అయింది."ఆర్య" అనే పదానికి గౌరవనీయుడు అని అర్ధం,గురువుకీ,తండ్రికీ.రాజుకీ,పండితుడికీ,ఒకరని లేకుండా వ్యక్తుల్ని పిలిచేటప్పుడూ ప్రస్తావించేటప్పుడూ వాడే పదం అది - ఇప్పటికీ జరుగుతున్నది అదే!

   అయితే, అతను నిజాయితీగా తప్పుని ఒపుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది.ఈలోపు కమ్యునిష్టులకి భారతీయుల్ని చీచి చిద్రుపలు చహెసి ఒకళ్లని ఒకళ్ళ మీదకి ఎగదొయ్యటానికి పనికొస్తుంది గదాని వాడతం కంటిన్యూ చేశారు - అసలు మాక్స్ ముల్లరుకే "నువు తప్పని ఒప్పుకున్నా మేము ఒప్పుకోం,మాకు పనికొస్తున్నది గాబట్టి మేం వాడుతూనే ఉంటాం,మూసుకుపో!" అని చెప్పేసి యధాప్రకారం చీల్చివేత పనుల్లో కంటిన్యూ అయ్యారు గాబట్టి ఐలయ్యా మరియూ మీలాంటివాళ్ళకి పనికొస్తున్నది!

   కొన్ని దశాబ్దాల క్రితమే ఆధునిక పరిశోధనలు మొత్తం ఆర్య-ద్రవిడ సిద్ధానతం అబద్ధమని రుజువు చేసేశాయి.కమ్యునిష్టుల్లో ఈ సిద్ధాంతాన్ని బాగా పేనిన మేడం రొమిల్లా ధాపర్ కురాళ్ళు దాని గురించి అడిగితే సుత్తి జవాబు చెప్పి తప్పుకుంది.ఇది జరిగే అయిదారేళ్ల పైన - ఎప్పుడో వల్లకాట్లో కలిసిన సిద్ధాంతం ఇంకా బతికుందనే అజ్ఞానంలో మీరుండి దాన్ని గురించి ప్రశ్న అడిగితే జవాబు చెప్పలేదని మమ్మల్ని బ్లేం చేసి ప్రయోజనం ఏమిటి?

   మీలో ఉన్న అజ్ఞానానికి కూడా మేమే కారణమా?ఏదీ తెలుసుకోకుండా అన్నీ నేనే చెప్పాలంటే నాకు చిరాకు - ఒకసారి కాదు,రెండుసార్లు కాదు ఏళ్ళ తరబడి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా బుర్రకి ఎక్కించుకోవదం లేదు మీలాంటివాళ్ళు!

   తొలగించండి

 


Popular Posts

Recent Posts