గురువారం, మే 09, 2019

is-there-benefit-from-cinema-biopic
 Is there a benefit from cinema biopic?
ఈమధ్య కాలంలో సినిమా బయోపిక్ లు ఎక్కువయిపోయాయి. మహానటి సావిత్రి బయోపిక్ నుండి ప్రతి ఒక్కరి జీవితం మీద బయోపిక్ లు తీయడం ఎక్కువయ్యిపోయింది. కధానాయకుడు, మహానాయకుడు అంటూ ఎన్టీఆర్ పై సినిమాలు తీస్తే "లక్ష్మీస్ ఎన్టీఆర్ " పేరుతొ రాం గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితం మీద మరో బయోపిక్ చేసాడు.

ఇవ్వన్నీ సినీ జనాలపై రుద్దటం తప్ప మరేమీ లేదు. వీటిని ధియేటర్ కెళ్ళి చూసేవారికి సమయం,డబ్బూ వృధా తప్ప మరేమీ ఉపయోగం ఉండదని నా అభిప్రాయం.

నిజానికి ఒక వ్యక్తీ బయోపిక్ తీయాలంటే అతని జీవితంలో జరిగిన అన్ని కోణాలూ పరిశీలించాలి. అదెలా సాధ్యం?  దగ్గరి వారి దగ్గర సమాచారం సేకరిస్తే అభిమానం ఉన్నవారు అన్నీ మంచి విషయాలే చెప్తాడు. పెద్ద,పెద్ద తప్పులను సైతం కప్పిపుచ్చడం, అవసరమైతే దారి మళ్ళించే ప్రయత్నం కూడా చేస్తాడు. అదే సేకరణ అభిమానం లేనివాడి దగ్గర చేస్తే అన్నీ తప్పుడు పనుల గురించే చెప్తాడు, బయోపిక్ కి సంబంధించిన వ్యక్తీ యొక్క త్యాగాలను కూడా స్వార్దాలుగా చిత్రీకరిస్తాడు. ఏవిధంగా చూసినా సదరు బయోపిక్ తీయాల్సిన వ్యక్తీ గూర్చి ఏమాత్రం వాస్తవాలు పెద్దగా తెలియజేయలేము. బయోపిక్ ల పేరుతొ వారికి సంబంధించిన అభిమానుల నుండి డబ్భులు గుంజుకోవడం తప్ప మరేమీ లేదు.అంతెందుకు? ఎన్టీఆర్ గూర్చి అనుకూలురు, వ్యతిరేకుల నుండి...అదీ అతని యొక్క సమీప వ్యక్తుల ద్వారానే వచ్చిన వారి మాటలు, అనుభవాల పేరుతో వారు చెప్పే విషయాలు ఏమాత్రం పొంతన ఉన్నాయా? ఇందులో ఏది నిజమని జనాలను నమ్మించగలం? బయోపిక్ లు ఎంత గొప్పగా తీసినా అవి నిజమయ్యిపోతాయా?
వరల్డ్ క్రికెట్ ను IPL, ICL లాంటి సంకర జట్టు సమీకరణలతో దిగజార్చినట్టు, సినీ రంగాలను కూడా ఈ బయోపిక్ లు సర్వనాశనం చేస్తాయి. ప్రతి ఒక్కడూ చరిత్రలో తనకంటూ ఒకపేజీ ఉండాలని కోరుకున్న చందాన, సినీ రంగంలోని ప్రతీ ఒక్కడూ తనకంటూ ఒక బయోపిక్ ను తీసుకు పెట్టుకుంటాడు. పాపం సినీ పేక్షకులు ఎలా భరిస్తారో...???

2 వ్యాఖ్యలు:

  1. ఇందులో భరించడానికేముంది. నచ్చకపోతే చూడటం మానేస్తే సరి. తీసేవాళ్ళ తిక్క కుదురుతుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మీరు చెప్పింది నిజమే... కానీ వారి అభిమానులు పడి చస్తూనే ఉన్నారు. నిజానికి ఎన్ టి ఆర్ బయోపిక్ లన్ని ఆయన అభిమానుల శాతమే ఎక్కువ చూసింది. రుద్దడం భరించడం అంటే ఇదే సార్.

      తొలగించు

Follow by Email

Popular Posts

Recent Posts