శనివారం, మే 28, 2016

మా అత్తగారికి, నా సతీమణికి టి‌వి సీరియల్స్ అంటే పిచ్చి. 7pm నుండి ప్రారంభమయ్యే చిన్నారి పెళ్లి కూతురి నుండి 9:30 వరకూ ప్రసారమయ్యే శశిరేఖా పరిణయం వరకూ దేనిని వదలరు. ఆసమయంలో ఇంట్లో దొంగలు పడినా సరే వీరు గమనించే స్థితిలో ఉండరు. కేవలం మా ఇళ్లే కాదండోయ్! మా కాలనీలోని స్త్రీ సమాజం మొత్తం అదే పనిలో ఉంటుంది.
        మా మగ సమాజం ఏదైనా ప్రోగ్రామ్ వీక్షించాలంటే ఈ సీరియళ్ళన్నీ అయిపోయిన తరవాతనే! అంతవరకూ రిమోట్ ముట్టుకుంటే అంతే సంగతులు!
        ఈ బాధ చూడలేక, చూడలేక అత్యధిక మగ సమాజం కూడా క్రమేపీ సీరియల్ చూడడానికే అలవాటు పడిపోయారు...మా మామయ్య గారిలా!!
       ఈ విధంగా రోజులు నడుస్తున్న సమయంలో సర్లే అని నేను కూడా ఒకరోజు రాత్రి అంటే నిన్న రాత్రి "శశిరేఖా పరిణయం" సీరియల్ ముందు కూర్చున్నాను. దానమ్మ..అదేం సీరియల్లో ఒక చిన్న డైలాగ్ చెప్తే చాలు 5 నిమిషాలు అందరి ముఖ కవళికలు జూమ్,జూమ్ అనే మూజిక్ తో చూపిస్తూ ఫ్లాష్ లైట్లు కొడుతూ... ఒక్కసారిగా నాకళ్లు ఆ మెరుపులకు బైర్లు కమ్మాయంటే నమ్మండి. మైండ్ మొత్తం మొద్దుబారిపోయింది. అదేంటో అరగంట సమయంలో ఆసీరియల్ లో 20నిమిషాలు పాటు అడ్వరటైజ్ మెంట్లు! మొత్తానికి రెండు డైలాగులు 20నుండి 30 ఫేస్ క్లోజప్ లతో సీరియల్ ముగిసిపోయింది. ఒక్క క్షణం ఏమి చూశానో, ఏమి జరుగుతుందో కూడా నాకు అర్ధం కాలేదు. ఈ ఆడజాతికి బుర్ర లేదన్న ఎవరో కవి మాటలు నిజమే అనిపించాయి. ఎందుకంటే వారు ప్రతిరోజూ సీరియల్స్ చూసి,చూసి వాటిలో ఏం జరుగుందో... ఆ కధా కమామీషు ఏమిటో కూడా అర్ధం చేసుకునే పరిస్థితిలో లేరు. అంతెందుకు నాకు తెల్సి ఆ సీరియల్ డైరెక్టర్లకు కూడా ఈ సీరియల్స్ క్లైమాక్స్ ఎక్కడ ముగించాలో తెలియదనుకుంటా!!

5 కామెంట్‌లు:

  1. ఈ లైన్లు చదువుతుంటే నాకు నవ్వువచ్చింది.......

    దానమ్మ..అదేం సీరియల్లో ఒక చిన్న డైలాగ్ చెప్తే చాలు 5 నిమిషాలు అందరి ముఖ కవళికలు జూమ్,జూమ్ అనే మూజిక్ తో చూపిస్తూ ఫ్లాష్ లైట్లు కొడుతూ... ఒక్కసారిగా నాకళ్లు ఆ మెరుపులకు బైర్లు కమ్మాయంటే నమ్మండి. -----------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thank u వెంకట రమణగారు. మీ స్పందనకు ప్రత్యేక కృతజ్ఞతలు.

      తొలగించండి
  2. అడుసు తొక్క నేల ! ....

    జిలేబి

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts