శనివారం, జులై 08, 2023

 

సరదాగానే తెలుగు బ్లాగులను చూద్దామని నెట్లో వెతుకుతూ ఉంటే మన "మాలిక" కనిపించింది. తెలుగు బ్లాగులు అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాం. అయినా కొంతమంది మా పాత బ్లాగు మిత్రులు శ్యామలీయం గారు, sarma గారు, Zilebi గారు, MANOHAR CHIMMANIగారు, విన్నకోట నరసింహా రావు గారు, bonagiriగారు... ఇలా అనేకులు ఇంకా బ్లాగు పోస్టులు వ్రాయడం, కామెంట్లు వ్రాయడం చాలా సంతోషంగానే ఉంది.

   ఏది , ఏమైనా తెలుగును బ్రతికించడంలో మన తెలుగు బ్లాగర్ల పాత్ర కూడా ఉంది.

ఇంతకుముందు ఉండే బ్లాగర్ల మధ్య కామెంట్ల యుద్ధాలు ఇప్పుడు పెద్దగా లేవనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళి నాకు బ్లాగు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని బ్లాగు పోస్టులను వ్రాయాలని అనిపిస్తోంది.

నాతోటి బ్లాగు మిత్రులందరికీ నమస్కారాలతో... మీ బ్లాగు మిత్రుడు KS చౌదరి

2 కామెంట్‌లు:

 


Popular Posts

Recent Posts