ఈమధ్య Youtubeలో వచ్చే రాజకీయ ఫేక్ వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుంది.
రాజకీయాలకు బానిసయ్యి పోయేవాళ్ళు.. కొంతమందయితే... తమ కెడిబిలిటీని గాలికొదిలేసి కేవలం డబ్బులకు ఆశపడి దిగజారిన జర్నలిస్టులు, స్వయంప్రకటిత మేధావులు మరికొంతమంది
వీళ్ళు ఎంతగా సోషల్ మీడియాలో దిగజారిపోతున్నారంటే పందిని సైతం నందిగా చూపెట్టడానికి పడే ప్రయాస చూస్తుంటే ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది. నరనరాలలో రక్తం మరిగిపోతుంది.
నోరు విప్పితే చాలు అన్నీ అసత్యాలే... ఆరోపణలే!.. వీళ్ళకసలు మనశ్శాక్షి అనేదే ఉండదా అనిపిస్తుంది?
వీళ్ళకు అర్ధమవుతుందో.. లేదో.. గాని ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడవడమే కాదు... సామాన్య ప్రజల భవిష్యత్ ను భస్మం చేసేస్తున్నారు.
నాయకుడిని ఎన్నుకోవడమంటే అతని యొక్క వ్యక్తిత్వం... గత జీవితం... మాటతీరు... నిస్వార్ధత... నైపుణ్యం చూడాలి. ఎందుకంటే మన ఐదేళ్ల జీవితం.. దేశ, రాష్ట్ర భవిష్యత్ అతని చేతుల్లో పెడుతున్నాము కాబట్టి.
ఈవిషయంలో సామాన్య ప్రజలకంటే పైన చెప్పుకున్న సోకాల్డ్ మేధావులకే ఎక్కువ భాద్యత ఉంది.. వీళ్ళే సామాన్యులను ఎడ్యుకేట్ చెయ్యాలి... కాని వీళ్ళకంటే రోత తిని పెరిగే పంది నయం అనిపిస్తోంది... (పంది క్షమించాలి... వీళ్ళను దానితో పోల్చినందుకు... ఎందుకంటే వీళ్ళు అంతకంటే దిగజారిపోయారు)
దుర్మార్గులను గెలిపించడానికి... సామర్ధ్యం కలిగిన వ్యక్తులను ఎంతకైనా దిగజార్చుతున్నారు
నిజం చెప్పాలంటే ప్రజలను మాయ చేసి ఓట్లు వేయించుకోవడమంటే ద్రోహం కాదా? వారి యొక్క జీవితాలను నాశనం చేయడం కాదా? ప్రజాస్వామ్యాన్ని పగలగొట్టడం కాదా? అభివృద్ధిని అంతమొందించడం కాదా? ఒక్కసారి ఆలోచించండి
ఆంధ్రాలో అబద్ధాన్ని మాటి,మాటికి చెపితే నిజం అయ్యిపోతుందన్న నానుడి నడుస్తోంది.. ఈ ప్రయోగమే అమలవుతోంది.
కాబట్టి ప్రజలారా! ఇప్పటికైనా కళ్ళు తెరవండి... మనకి కావాల్సింది పార్టీలు కాదు... రాజకీయ నాయకులు అంతకంటే కాదు.
మన భవిష్యత్ బాగుండాలి, ప్రజాస్వామ్యం బ్రతకాలి, అభివృద్ధి పెరగాలి.
ఎవడైతే పై వాటికి వ్యతిరేకమో వాడంత ప్రమాదకారి మరొకడుండడు... బయటి నుండి వచ్చే ఉగ్రవాదుల కంటే ఈ ముసుగుల్లో ఉన్న సామాజిక ఉగ్రవాదులు చాలా భయానకం. వీళ్ళను తరిమి కొట్టండి... వీళ్ళను దూరం పెట్టేయండి.
వీళ్ళను మనం వదిలినపెట్టినా, కాలం...ప్రకృతి మాత్రం ఎప్పటికీ వదలవు... ఇటువంటి వాళ్ళందరూ "పిచ్చి ముదిరితే పతనమే"నన్న సామెతకు నిదర్శనంగా మిలిగిపోతారు
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి