మంగళవారం, ఏప్రిల్ 23, 2019

_**ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటున్నాడు. ఇంతలో దగ్గరలో ఏవో అరుపులు వినిపించాయి, వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి రక్షించండి, కాపాడండి అని అరుస్తూ ఉన్నాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపించాడు..*_

         _**తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగింది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వచ్చాడు, ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? అని అడిగాడు రైతు."నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి " అంటూ ఒక ఇనప్పెట్టె ఇచ్చాడు.*



          _**అప్పుడు ఆ రైతు "క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి అలా చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం" అంటూ సున్నితంగా తిరస్కరించాడు. ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరించి తన తండ్రి పక్కన నిలబడ్డాడు. ఈ అబ్బాయి నీ కొడుకా? ఏం చదువుతున్నాడు? అని అడిగాడు పెద్దమనిషి."అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత నాకు లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పొలం పనుల్లో నాకు సాయపడుతూ ఉంటాడు" అన్నాడు ఆ రైతు.*_

         _**అవునా "అలాగైతే  నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు " అన్నాడు. ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.*_

        _**అలా ఆ పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివించాడు, వాళ్ళిద్దరూ బాగా చదివి చాలా గొప్ప వాళ్ళు అయ్యారు, కొంతకాలానికి ఆ పెద్దమనిషి కొడుక్కి ఒక అంతు బట్టని వ్యాధి వచ్చింది, డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి తమ చేతకాదంటూ చేతులెత్తేసారు.*_

        _**అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ పెద్దాయన కొడుకుకు వైద్యం చేసి వ్యాధిని నయం చేసాడు. అలా వైద్యం చేసిన ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా ? పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచానికి అందించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త అయిన "Alexander Fleming".ఇంతకు వైద్యం పొందిన ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా? అప్పటి బ్రిటీష్ ప్రధాన మంత్రి "Winston Churchil". అందుకే అంటారు మనం చేసే మంచి పనివల్ల వచ్చే "పుణ్యం వూరికే పోదు, కలకాలం మనకు తోడొస్తుంది " అని.!!*_

       _**ఒక సాధారణ రైతు చేసిన ఒక చిన్న సాయం వలన, ఆ రైతు కొడుకును ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప సైంటిస్ట్ ను అందించగలిగింది. అలాగే ఆ పెద్దాయన రైతు కొడుకును చదివించిన ఆ పుణ్యం ఆ పెద్దాయన కొడుకును ప్రాణాపాయం నుండి కాపాడగలిగింది. అందుకే అందరూ కూడా మీకు చేతనైన సహాయం ఇతరులకు చేస్తూండండి. పుణ్యాన్ని మీ వెంట తెచ్చుకోండి.*_

     _**సర్వే జనా సుఖినోభవంతు.**_

1 కామెంట్‌:

  1. ఇప్పుడు వ్రేలు ఇస్తే హస్తం మింగే రకం తయారు అయినారు ప్రజలు
    ప్రజలను మార్చేది ప్రభుత్వాలు కాదు నాయకులు మంచిగా ఉండి ధర్మ పాలన చేస్తే ప్రజలలో మార్పు వస్తుంది ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అంది పుచ్చు కుంటారు..

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts