ఆదివారం, ఏప్రిల్ 14, 2019

Andhra people vs KCR
Andhra people vs KCR
చంద్రబాబే మళ్ళీ సియంగా రావాలని అత్యధికులు భావిస్తుంటే "జగనే" సియం అవ్వాలని కాదు,కాదు చెయ్యాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్, ప్రధాని మోడీగారు తెగ కుట్రలు పన్నుతున్నారు.

ఆంధ్రాప్రజలు కుక్కలు,నక్కలు,రాక్షసులు అంటూ ఆంధ్రా వెధవలతో సంబంధాలు తెగ్గోట్టేసు కోవాలని కారుకూతలు కోసిన కెసియార్ ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో ఇన్ని కుట్రలు ఎందుకు చేస్తున్నాడు?

జగన్ సియం చేయండి...మీకు (ఆంధ్రాకు) ప్రత్యేక హోదా నేనిప్పిస్తా అంటూ కెసియార్ చేసిన ప్రసంగం ఇప్పటికీ మర్చిపోలేము. కెసియార్ ఇప్పిస్తే గాని మనం తెచ్చుకోలేని దిక్కుమాలిన పరిస్థితికి దిగజారిపోయామా?

ఏది,ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు..జగన్ సియం చేస్తే కేసియార్ను సియం చేసినట్టేనని. అంటే ఆంధ్రాపై కెసియార్ ఆధిపత్యం చేయడానికే జగన్ కు సపోర్ట్ చేయడం. ఎందుకంటే చంద్రబాబు సియం అయితే కెసియార్ ఆటలు అసలు సాగవు. ఎందుకంటే YSRCP నాయకుడు విజయసాయి అన్నట్లు చంద్రబాబు ఎవరికీ లొంగడు. అయితే జగన్ కేసియార్కు, మోడీకి చేతులు ఎత్తి పూర్తిగా లొంగిపోవడానికి ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రాలో జగన్ పై ఉన్న కేసులే. అవ్వన్నీ పట్టుకుంటే ఎక్కువ కేసులు కెసియార్ (తెలంగాణ) పరిధిలోకే పోతాయి. ఇవి గాని పట్టుకుని కెసియార్ లాగాడంటే జగన్ గారు పరిస్థితి ఊహించడానికి కూడా దారుణంగా ఉంటుంది. దీని కారణంగానే జగన్ కేసియార్కు, మోడీకి కీలుబొమ్మ మాదిరిగా మారిపోయేడు.నిన్న ఆంధ్రాలో ఎన్నికలు జరిగిన తీరు చూస్తుంటే ఏదో తెర వెనుక జరుగుతందనే అనిపిస్తోంది. మే 23 నాడు జరిగే ఓట్ల లెక్కింపుకు ముందే ఎదో గోల్మాల్ జరిగే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో కెసియార్ తెచ్చుకున్న దొంగ గెలుపు మాదిరిగా ఇక్కడ ఆంధ్రాలో జగనే సియం అయితే....అన్నీ సందేహాలే! ఎందుకంటే అత్యధిక గాలి TDP వైపే మొగ్గి చూపింది. సర్వేలన్నీ TDP నే చూపించాయి.

పార్లమెంట్ లో ప్రత్యెక హోదా కోసం పోరాడేటప్పుడు ఏమాత్రం సహకరించని కెసియార్ ఇప్పుడు ఆంధ్రాకు మేలు చేస్తానంటే ఎవ్వడూ నమ్మే స్థితిలో లేడు. తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ లో కలిపేస్తానని సోనియాను నమ్మించి నట్టేట ముంచిన కెసియార్... తన పార్టీకి ఓటేస్తే ఒక దళితుడిని సియం చేస్తానని మాయమాటలతో SC,ST ఓట్లన్నీ లాక్కుని వాళ్లకు మొండి చేయి చూపిన కెసియార్ ఇప్పుడు ఆంధ్రాకు మేలు చేస్తానంటే ఎవ్వడు నమ్మగలడు? అటువంటి వాడిని నమ్ముకుని జగన్ వేలాడటం ఒకరకంగా ఇది ఆంధ్రా ప్రజలకు అన్యాయం చేయడమే అవుతుంది.

ఏది,ఏమైనా ఆంధ్రా ప్రజలకు ఏమాత్రం విలువ ఇవ్వని మోడీని, ఆంధ్రా వాళ్ళంటేనే పచ్చిబూతులాడే కేసియార్ను జగన్ కలుపుకోవడం ఆంధ్రా ప్రజలు జీర్ణించుకోలేని వ్యవహారం. ఈ పెద్ద తప్పిదమే జగన్ చేయకపోయి ఉంటే సియం రేసులో తప్పకుండా జగన్ ఉండేవాడే! ఎన్ని రాతలు రాసుకున్నా, ఎన్ని కామెంట్లు చేసుకున్నా చివరికి ఆంధ్రా భవిష్యత్ మే 23 తరువాతే తేలనుంది..చూద్దాం!!!

3 కామెంట్‌లు:

  1. ఒకప్పుడు ఆంధ్రా తో తెగతెంపులు చేసుకున్న గులాం(చనిపోయినపుడు చల్లుతారే ఆ కలర్ అన్నమాట) గ్యాంగ్ ఇపుడు లోక్ సభ సీట్లకోసం ఆంధ్రావారి కాళ్ళమీద పడుతున్నారు. సీ ఎం అవడం కోసం ఎవరెవరు ఏం చేస్తారో వెండితెర మీదే చూడాలి.

    రిప్లయితొలగించండి
  2. సర్వేలన్నీ TDP నే చూపించాయి. .. is it true?

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts