సోమవారం, ఏప్రిల్ 23, 2018

Ramakrishna Veeramachaneni after Mantena Satyanarayana Raju
వీరమాచనేని రామకృష్ణ గారి షుగర్ ఇతరత్ర వ్యాధుల యొక్క వైద్యం గురించి ఈమధ్య మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. కొందరు సూపరంటే కొందరు డేంజర్ అంటున్నారు. ఇలా ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వారు ప్రయోజనం కలిగిందని అంటుంటే.. అస్సలు ఆ సలహాలే తీసుకోనివారు వీరమాచనేని వైద్య సలహాలు చాలా ప్రమాదకరమని గట్టిగా వాదిస్తున్నారు. ఆఖరికి వీరమాచనేనిని సమర్ధించిన వారిపై కూడా కొంతమంది తమతమ బ్లాగుల్లో తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

నిజానికి ఎందులో ప్రమాదం లేదు. మనం తినే పుడ్ లోనే ఎన్నో కల్తీలు జరిగిపోతున్నాయి. దాని కారణంగా మనలో ప్రతి ఒక్కరూ ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకోవడంతోటే సరిపోతుంది. ఈ మందు కాకపొతే మరో మందు. దాని వలన నయం కాకపొతే మరో కొత్త మందు. ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదం మందులు, అల్లోపతి,హోమియోపతి, యునాని ఇలా మనిషి వాడుతూనే ఉన్నాడు. దేని వలన తనకి ఉపయోగం కలిగిందో అదే నిజమని నమ్ముతున్నాడు. వీరమాచినేని ఆరోగ్య సూత్రాలు కూడా ఇటువంటివే. నమ్మకం ఉన్న వాడు నమ్ముతూనే ఉంటాడు. దీని మాత్రం చేత భవిష్యత్ లో ఇలా అయ్యిపోతుంది, అలా అయ్యిపోతుందని వాపోడం అనవసరం. నిజానికి మనం తినే తిండి, మనం మింగే మందులూ అన్నీ హానికరమే.

కొన్నాళ్ళ క్రితం మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా ఆహార నియమాలు చెప్పేవారు. ఆయనగారి మాటలకు ఎంతోమంది ప్రభావితం అవడమే కాదు, ఆయన చెప్పిన ఆహార నియమాలు కూడా తు.చ. తప్పకుండా పాటించేవారు కూడా. అప్పట్లో కూడా ఆయన ఆహార నియమాలు గిట్టని వారు మంతెన సత్యనారాయణ రాజు  మనుషులను పశువుల మాదిరిగా మార్చేస్తున్నాడని అతి తీవ్రంగా విమర్శించే వారు కూడా. తరువాత కాలంలో ఆయన మాయమయ్యిపోయారు. ఆయనకు ఏం జరిగిందో నాకర్ధం కాలేదు.

అయినా వీధి,వీధికి ఒకొక్క మద్యం దుకాణం వెలసి ఏదో కోణంలో అందరి ఆరోగ్యాన్ని అంతమొందిస్తున్న ఈరోజుల్లో "మంతెన సత్యనారాయణ రాజు, వీరమాచనేని రామకృష్ణగారి లాంటివాళ్లు ఎంతమంది వస్తే ఉపయోగమేముంటుంది చెప్పండి?

4 కామెంట్‌లు:

  1. post బాగుంది. వీరమాచనేని డైట్ లో ఎటువంటి ప్రమాదమూ లేదు. కొన్ని దేశాలు కీటో డైట్ ని అధికారికంగా గుర్తించాయి. మనదేశంలోనూ అది జరగాలి. ఈ లోగా ఇలాంటి మూర్ఖులు వాదనలు చేస్తూనే ఉంటారు. మంతెన సత్యనారాయణ గారు ఇప్పటికీ ఆయన ఆరోగ్యాలయం నడుపుతూనే ఉన్నారు. ఆయనపై కూడా మీరన్న మిడి మిడి జ్ఞానులు లేనిపోనివి కల్పించి చెప్పారు. ఆయనను నేను 2 నెలల క్రితమే ఆయన ఆశ్రమం లోనే కలిసాను. విజయవాడ కరకట్ట పక్కన ఆయన ఆశ్రమం ఉంది. మంచిగానే రన్ అవుతున్నది.

    రిప్లయితొలగించండి
  2. మంతెన గారు విజయవాడ దగ్గర ఒక ప్రకృతి ఆశ్రమం నడుపుతున్నారు. ఆయనిపుడు ఉచిత సలహాలు ఇవ్వడం మానేసారు. ఆయన ఆశ్రమంలో చేరడం అంటే చాలా ఖరీదయిన వ్యవహారం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉచిత సలహాలు రోజూ ఫోన్ ద్వారా ఇప్పటికీ చెప్తున్నారు నీహారిక గారు. మా జనవిజయం పాతకులకు కూడా సలహాలు ఇస్తామన్నారు. రచనలు చేస్తామన్నారు. మేమే ప్రారంభించాల్సి ఉన్నది.

      తొలగించండి
    2. మంచి విషయం కొండలరావుగారు. వెంటనే ప్రారంభించండి. నా సహకారం మీకు తప్పనిసరిగా ఉంటుంది.
      నీహారికగారి ఆర్టికల్స్ ఆలోచనాత్మకంగా ఉంటాయి.

      తొలగించండి

 


Popular Posts

Recent Posts