బుధవారం, ఏప్రిల్ 25, 2018

రాత్రి సరదాగా Youtube చూద్దామని ఓపెన్ చేస్తే క్రింది వీడియో కనిపించింది. మనస్సంతా ఆవేదనతో నిండిపోయింది.

ఏమిటీ దారుణాలు? ఇక ఆడపిల్లలను బ్రతకనియ్యరా? అసలు ఇటువంటివారిని ఏమి చేయాలి?
నిర్భయ,ఆసిఫా... ఇలా ఎంతోమంది అమ్మాలు బలి కావాల్సిందేనా? మన చట్టాలు ఎందుకూ పనికిరావా? ఒకవేళ నేరస్తులు దొరికినా ఎందుకంత కాలయాపన? ఒక ఆడపిల్ల ధైర్యం చేసి తనపై అత్యాచారం జరిగిందని కేసు పెడితే శిక్ష విధించడానికి రెండు,మూడు సంవత్సరాల సమయమా? అప్పటివరకూ భాధితులు తనకు న్యాయం జరుగుతుందా, లేదా అని ఎదురుచూడాల్సిందేనా? తీర్పు వెలివడే వరకూ నేరస్తులకు బయపడి బిక్కు,బిక్కుమంటూ బ్రతకాల్సిందేనా? ఇలా అయితే మనకీ చట్టాలూ,కోర్టులూ ఎందుకు?

మనపై ఏదైనా జంతువు దాడి చేస్తే మనం రక్షించుకోవడానికి దానిని చంపుతాం. ఒకవేళ వీలు కాకపొతే మనచుట్టూ నలుగురు సమయానికి వస్తే ఆ మృగాన్ని చంపుతారు.

ఈ రేపిస్టు వెధవలు అడవి మృగాలకంటే క్రూరమైన వాళ్ళు. వీళ్ళనసలు ఉపేక్షించకూడదు. వీళ్ళు ఒకవేళ అటువంటి దారుణాలు ఒడిగట్టి ప్రజల చేతికి చిక్కితే చావగొట్టి పోలీసులకి అప్పగించే బదులు చంపేసి అప్పగిస్తే బాగుంటుంది. ఈవిధంగానైనా భారతమాత సంతోషిస్తుంది. ఈవిధంగా చట్టాలను రూపొందించాలి. ఎందుకంటే వీళ్లలో కొంతమందికి చీమూ,నెత్తురు,సిగ్గూ,శరం లేని కొంతమంది సన్నాసి వెధవలు పెద్దమనుషుల ముసుగులో కూర్చుని భక్షిస్తూ ఉన్నారు. ఈ రేపిస్ట్ మృగాలను కాపాడుతూ ఉంటారు. నిజానికి అత్యాచారం కేసులు ఎక్కువుగానే ఏమీ తేలకుండా కాలగర్భంలో కల్సిపోతూనే ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు ఈ మృగాలకు అడ్డుకట్ట ఎలా వేయగలం?
నిజానికి చట్టాలంటే భయం లేకుండా చేసేది కూడా రాజకీయ నాయకులే. ఇక ఈ చట్టాలు ప్రజాప్రతినిధులకే లెక్క లేనప్పుడు ఇక ఈ రేపిస్ట్ మృగాలు ఎలా భయపడతాయి?

ఎక్కడి దొరికిన మృగాన్ని అక్కడ చంపేయడమే సమాజానికి మేలు.మన ఆడపిల్లలకు బ్రతుకు. దీనికి మీరేమంటారు?

1 వ్యాఖ్య:

  1. వీళ్ళు మృగాలకంటే హీనం. మృగాలు, మృగాళ్ళు అనకూడదు. నాకు తెలిసి మృగాలు ప్రకృతి సహజంగా కోరికలు తీర్చుకుంటాయి కాని, అత్యాచారాలు చెయ్యవు. (ఇక్కడ ఎవరైనా జువాలజిస్టులు ఉంటే చెప్పండి) వీళ్ళని రాక్షసులతో పోల్చాలి. ఆడవాళ్ళని ఆస్తులుగానే చూసే బూర్జువా సమాజం ఇంకా పోలేదు మన దేశంలో.

    ప్రత్యుత్తరంతొలగించు

Follow by Email

Popular Posts

Recent Posts