బుధవారం, మార్చి 02, 2016

రాత్రి మనువు గారి బ్లాగు చదువుతున్నప్పుడు ఆయన గారు వ్రాసిన టపా ఒకటి చాలా ఆశ్చర్యం కలిగించింది. పూర్తి వివరాలు ఆయనగారి బ్లాగు చూడండి. ఇంతకీ విషయమేమిటంటే ఒకామె తనపై అత్యాచారం చేయబోయిన వాడి మర్మాంగాన్ని కోసేసిందట. వాడు లబోదిబో మని హాస్పటల్ కి పరుగుతీస్తే ఎవరూ పోలీస్ కేసు లేకుండా జాయిన్ అవ్వడానికి వీలు లేదనేటప్పటికి తప్పనిసరి పరిస్థితిల్లో పోలీసు స్టేషన్ వెళ్ళి ఏదో కహానీ అల్లి పోలీసుల ద్వారా హాస్పటల్లో జాయిన్ అయ్యాడు. తీరా పోలీసులు కూపీ లాగేటప్పటికి అసలు వ్యవహారం బయటికొచ్చి అందరూ అవాక్కయ్యారు. ఆ ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి లోపల వేయడానికి సన్నాహాలు చేశారు.
        నా ఉద్దేశ్యం ప్రకారం స్త్రీలందరూ ఈ పద్ధతిని అవలంబిస్తే బాగుంటుంది అనిపిస్తోంది. బలయ్యి కోర్టుల కెళ్లినా, పోలీసు స్టేషన్ల కెళ్లినా సరైన న్యాయం జరగడం లేదు. కాబట్టి ఇటువంటి మృగాల మర్మాంగాలను కోసి పారేస్తే దరిద్రం వదిలిపోతుంది. సమాజంలో విలువ లేకుండా పోతుంది. శీలం లేని ఆడదానికి ఎలా విలువ లేదో మగతనం కోయించుకున్న దరిద్రులకు అటువంటి పరిస్థితే ఉంటుంది.
      మహాప్రవక్త ముహమ్మద్(స)వారు ఇటువంటి వారిని రాళ్ళతో కొట్టి చంపేయమన్నారు. కనీసం అది అమలు చేసే అవకాశం మన దేశంలో ఎలాగూ లేదు కాబట్టి, పోలీసు కేసు పెట్టి,కోర్టుల చుట్టూరా తిరిగి సరైన న్యాయం దొరక్క కుమిలిపోవడం కంటే ఈ రాక్షస మృగాల మర్మాంగాలను కోసేసి వేలాడ దీయడం చేస్తే కొన్నాళ్ళకు స్టీల వంక చూడడానికే భయపడతారు. తనపై అత్యాచారం చేయబోయిన వారిని చంపినా చట్టం శిక్షించే అవకాశం కూడా లేదు.

0 Comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Follow by Email

Popular Posts

Recent Posts