మంగళవారం, మార్చి 01, 2016

చంద్రబాబు గారూ!...ఇసుక ఫ్రీ. అన్నారు కదా? ఎవరికి?

నేను ఆలోచించనే లేను. ఇసుక ఫ్రీ అన్నారని ఆనందపడిపోయాను. ఇంతకీ ఇసుక ఎవరికి ఫ్రీ అండీ? దళారులకా? ప్రజలకా?...బహుశా దళారులకే ఫ్రీ అవుతుంది లెండి. ఎందుకంటే ప్రజలేమీ ఇసుకను తవ్వి తెచ్చుకునే పరిస్తితి లేదుకదా? ఒకవేళ తెచ్చుకోవాలనుకున్నా ట్రావెలింగ్ సర్వీసు ఖర్చులు షరా మామాలే! మధ్యస్థ కుటుంబాలు కట్టుకునే చిన్న,చిన్న గుడిసెలకు అంతగా ఇసుక ఫ్రీ వార్త విని ఆనందపడడు లెండి. పెద్ద,పెద్ద బిల్డింగ్స్ కట్టుకునే మహానుభావులకి మాత్రం భలే వరమంటే నమ్మండి. వై‌ఎస్‌ఆర్ కూడా రైతు రుణమాఫీలు పెట్టి లక్షలకు లక్షలు  అప్పులు లేకుండా చేసినప్పుడు ఎకరాలకు ఎకరాలు పొలాలున్న రైతుల అప్పులన్నీ ఉష్ కాకి అయ్యిపోయాయి. వారికి చక్కగా కౌలు రైతునుండి కౌలు డబ్బులు,రుణమాఫీ డబ్బులు భలే వస్తుండేవి. కౌలు రైతులు మాత్రం అప్పులు ఉష్ కాకి అవ్వడానికి సొంత పొలాలు లేక పాపం నెమ్మదిగా తీర్చుకోవాల్సి వచ్చింది. ఆలోచిస్తూ ఉంటే ఇసుక ఫ్రీ పధకం అటువంటిదే కాబోలు అనిపిస్తోంది. దీనిని బట్టి అర్ధమయ్యేదేమిటంటే బడా బాబులను తప్ప పూరీ గుడిసె ప్రజలను ఏ ప్రభుత్వమూ రక్షించలేదని అర్ధమవుతుంది.

2 వ్యాఖ్యలు:

Related Posts Plugin for WordPress, Blogger...