సోమవారం, ఫిబ్రవరి 29, 2016

ప్రజల హృదయాలలో మకుటం లేని మహారాజు చంద్రబాబే!

ఈమధ్య న్యూస్ పేపర్లలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఒక పది సంవత్సరాలలో మన ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలోనే కాదు, ప్రపంచానికే ఆదర్శంగా, ఉన్నతంగా నిలబడేలా వుంది. రకరకాల ప్రాజెక్ట్స్ , వివిధ దేశాల మంత్రులు, నాయకులు మన ఆంధ్రాను చూస్తూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం శుభసూచకం. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్థానంలో చద్రబాబు కాకుండా జగన్ వచ్చి ఉంటే ఆంధ్ర పరిస్తితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. వివిధ దేశాల మంత్రులు, నాయకులతో జగన్కు  సంబంధాలెక్కడివి? సాక్షి పేపర్లో ఒక ప్రాజెక్ట్ విషయం కానీ, ఆంధ్ర అభివృద్ధి గూర్చి గాని ఒక్క ముక్క రావడం లేదు. జగన్ కాస్త కుల,మత గొడవలు రెచ్చగొట్టడం ప్రక్కన పెట్టి ఆంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబుకు సహకరిస్తే తెలుగు ప్రజలు చక్కగా జగన్ ను కూడా ఆదరిస్తారు. ఇసుకను నిత్యావసర వస్తువుగా పరిగణించి ఉచితంగా ప్రకటించడం, 100రూపాయలకే ఇంటర్ నెట్ కనెక్షన్ ప్రకటించడం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడుగారు ఇలా చేసుకుంటూ పోతే ఇక ఆయనకు ఎదురే ఉండదు. ప్రస్తుతం ఆంధ్రాలో సరైన పార్టీ లేదు. జగన్ పార్టీ ఉన్నా అదంతా మాయలమరాఠీ పార్టీ లా కన్పిస్తోంది ప్రజలకు. గొడవలకు మాత్రమే నిలయంలా ఉంది. ఆపార్టీ నాయకులే ఆయన(జగన్)ను దుయ్యపట్టడం కడు శోచనీయం. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు ప్రజల అభిమానాన్ని చక్కగా నిలబెట్టుకోగలిగితే ప్రజల హృదయాలలో మకుటం లేని మహారాజులా వెలిగిపోవడం ఖాయం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...