మంగళవారం, సెప్టెంబర్ 13, 2016

ఉత్తమ పెంపకం అంటే, కన్నవారికి వారి బిడ్డలకూ మద్య ఒక గొప్ప అనుబంధం ఉండడం. ఈ కింద పేర్కొన్న కొన్ని చిట్కాలు మీకు మీ పిల్లలతో ఒక చక్కని అనుబందం ఏర్పడటానికి తోడ్పడతాయి.

* బేషరతు ప్రేమ పంచండి.
     మీ పిల్లలు పసి పిల్లల్లా, ప్రీ-స్కూలర్లలాగా ఎప్పటికీ ఇలాగే ఉండిపోరు. కాలం చాలా వేగం వెళుతూనే ఉంటుంది. ఈ రోజున ఉన్న ఈ పిల్లలు రేపటికి పెరిగి పెద్దవాళ్లవుతారు. అయితే, స్వతహాగా మీరు కూడా మీ పిల్లలు మరింతగా ఎదగడానికి మీ వంతు ప్రోత్సాహం, అందిoచాలి. తల్లిదండ్రులు ఉన్నంతలో పిల్లలతో అత్యధిక సమయం గడిపేది బాల్యంలోనే బాగా సన్నిహితంగా గడిపేది కూడా ఈ కాలంలోనే. అయితే వారు కాస్త పెద్ద వారై, టీనేజర్ వయసుకు వచ్చేస్తే, వారి జీవిత కార్యకలాపాల్లో వారు తలమునకలైపోతాయి. అందుకే ఆ పసి వయసులో వారితో కలిసి సాద్యమైనంత ఎక్కవ సమయం ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలి. అప్పుటి ఆ తీయని జ్ణాపకాలను ఎప్పటికీ గుండెలో భద్రంగా ఉంచుకోవాలి. మీ పిల్లలన్నీ మీరు నిరంతరం ప్రేమిస్తూనే ఉంటారు. కానీ, మీరు మీ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి తెలిసోచ్చేలా వ్యవహరించండి.

* పిల్లల మనసుల్లోంచి 
    మీ పిల్లలు ఎప్పుడైనా మీమ్మల్ని అసహనానికి గురి చేసే సందర్బాలు ఉండవచ్చు. అయితే వాళ్ల స్థానంలో కూర్చుని ఆలోచిస్తే, ఆ అసహనమేమీ రాదు. అలా అనుకోవడానికి మీ బాల్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండీ. ఆ బాల్యంలో మీరు కూడా దాదాపు ఇలాగే ప్రవర్తించి ఉంటారు. మీ బాబు కొద్ది రోజులు తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటానంటే ఇప్పుడు మీరు అభ్యంతరం చెప్పవచ్చు. కానీ, మీ బాల్యంలో మీలో కూడా అలాంటి కొరికలే ఉండవచ్చు. అందుకే పిల్లల కోణంలోంచి ఆలోచించినప్పుడే పిల్లల్ని బాగా అర్ధం చేసుకోగలుగుతాం. వాళ్ల మనసును నొప్పించకుండా వ్యవహరించగలుగుతాం.

* ఎవరి మీదా ఆధారపడకుండా 
     పిల్లలకు తల్లిదండ్రులే అన్నీ చేసిపెట్టే విధానం ఎక్కువ హానికరమైనది. దీనివల్ల పిల్లలు ప్రతి దానికీ తల్లిదండ్రుల మీదే ఆధారపడే స్థితికి చేరుకుంటారు. ఆ పరిస్థితి రాకుండా, కొన్ని చిన్న చిన్న పనులు వారికి అప్పగించి ఎవరి సహకారమూ తీసుకోకుండా ఆ పని పూర్తి చేయమని చెప్పాలి. వాళ్ల పనులు వాళ్లే చేసుకోగలిగే ఈ వైఖరి వల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తన కాళ్ల మీద తాను నిలబడే తత్వం పెరుగుతుంది.     

1 కామెంట్‌:

 


Popular Posts

Recent Posts