శుక్రవారం, సెప్టెంబర్ 16, 2016

కాకినాడ వివేకానంద పార్క్ లో కూర్చుని ఉన్నాను. టైం 7PM అవుతూంది.
ఇంతలో బైక్ మీద వేగంగా వచ్చిన కానిస్టేబుల్ నాకు దగ్గరలో బెంచీ పై కూర్చుని ఆ చీకట్లో కబుర్లు చెప్పుకుంటున్న ఒక జంట దగ్గరికి వెళ్లాడు. వాళ్ళు లవర్స్ అనుకుంటా కానిస్టేబుల్ ను చూడగానే భయపడిపోయారు. లేచి నిలబడిపోయారు.
కానిస్టేబుల్ ఏదో అడుగుతున్నాడు. వాళ్ళు ఏదో బ్రతిమిలాడుతూ చెపుతున్నారు.
ఆ పోలీసాయన వినిపించుకోవడం లేదు. అక్కడి నుండి నడవండి అన్నట్టు కంగారు పెడుతున్నాడు.
ఆ అమ్మాయి బిక్క చచ్చి పోయి చూస్తోంది. అబ్బాయి కానిస్టేబుల్ ను బ్రతిమిలాడుతూనే ఉన్నాడు.
చివరికి ఆ అబ్బాయి పర్సులోంచి కొంత డబ్బు కానిస్టేబుల్ కి ఇచ్చేసాడు.
కానిస్టేబుల్ ఆ డబ్బులు తీసుకుని మరొక జంటను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు.
నేను లేచి అటు వెళుతూ ఆ అబ్బాయిని ఆపోలీసోడు ఎంత గుంజాడు నీ దగ్గర అని అడిగాను.
దానికి ఆ అబ్బాయి తెగ బాధపడిపోతూ "1000రూ// సర్! ఎంత బ్రతిమిలాడినా తగ్గించలేదు. స్టేషన్ కొస్తే 5000 అవుతుంది. ఇక్కడ అయితే 1000 రూ అవుతుంది. తరువాత నీ ఇష్టం అన్నాడు. ఎందుకొచ్చిన గొడవని ఇచ్చేసాను. అనవసరంగా ఈ రోజు వెయ్యి రూపాయలు బొక్క, ఎవరి ముఖం ప్రొద్దుటే చూసానో అంటూ తెగ వాపోయేడు.
ఆ అమ్మాయి సిగ్గుతో తల దించుకుని బెంచీకి అటు తిరిగి కూర్చుని ఉంది.
నేను ఆ అమ్మాయిని పిలిచి ' అమ్మా నీ లవర్ వెయ్యి రూపాయలు పోయాయని తెగబాధ పడిపోతున్నాడు. నీవు ఇంటికెళ్ళాక మీ నాన్నగారిని నీ లవర్ 1000రూ ఇచ్చేయమని చెప్పు ,అతని నష్టంలో ప్రధాన భాగాస్వామివి నీవే కదా?" అంటూ అక్కడ నుండి వచ్చేసాను.
ఆ మాట అన్నందుకు వాళ్ళు నా మీద కోపపడి తిట్టుకున్నారో,లేదో నాకు తెలియదు గాని ఆ అమ్మాయి సిగ్గుతో బిగిసుకుపోవడం మాత్రం గమనించాను.

0 Comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Follow by Email

Popular Posts

Recent Posts