శుక్రవారం, సెప్టెంబర్ 09, 2016

తిరుపతి పబ్లిక్ మీటింగ్ లో ఊదరగొట్టిన పవన్ ఈరోజు కాకినాడలో ఊదరగోట్టడానికి వస్తున్నాడు. రాజకీయ పార్టీలన్నీ లబో,దిబో మంటున్న లభించని ప్రత్యేక హోదా కేవలం అక్కడా,ఇక్కడా పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రసంగాలు పెట్టడం వలన లభిస్తుందా? పవన్ తీరు చూస్తుంటే పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్టు ఉంది. ఈమధ్య పవన్ జరుగున్న ప్రతి చిన్న సంఘటనకు మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నాడు.
       నిజానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పట్ల, ఆంద్ర భవిష్యత్ పట్ల ఆందోళన,చిత్తశుద్ది ఉంటే "ఆమరణ నిరాహార దీక్ష" చేయాలి. అప్పుడు పవన్ చేపట్టిన ఉద్యమంలో చలనం వస్తుంది. దేశంలో కదలిక వస్తుంది. అంటే గాని అక్కడక్కడ మీటింగులు పెట్టి ఏవేవో మాట్లాడి వెళ్ళిపోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు.
      రేపొద్దున్న జగన్ అండ్ మిగతా పార్టీ వాళ్లు చేసే బంద్ వలన కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు.

4 వ్యాఖ్యలు:

 1. పవన్ వల్ల ప్రత్యేక హోదా రాదు. పవన్‌ని ముద్రగడకి కౌంటర్‌గా, ముద్రగడ సొంత ప్రాంతంలో వాడుకుంటున్నారు.
  కాని పాజిటివ్‌గా చెప్పాలంటే, పవన్ యాంటివైరస్‌గా పని చేస్తున్నాడు. ఎన్నికల్లో జగన్‌కి వ్యతిరేఖంగా, ఇప్పుడు ముద్రగడకి వ్యతిరేఖంగా.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అవును .. అందరికీ తెలిసిందే .. ప్రస్తుతం పవన్ కాకినాడ టిడిపి ఆపీస్ లో ఉన్నాడు .. ఎలా మాట్లాడాలో వ్యూహరచన చేస్తున్నాడు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్నదేంటీ?? ఏం చేసినా ఏమీ కాదు కాబట్టి అందరినీ మూసుకోని కూర్చోమనా??

  చిన్నపిల్లల్ని ఏమైనా అంటే "మా టీచార్ ఇంతే చెప్పింది" అంటారు. నీ పోష్టులుకూడా వాళ్ళకేమీ ఎక్కువ కాదు. ఫిక్స్డ్ గా కొన్ని అనుకోని, కొండకచో ఊహించేసుకోని.. నవ్వుకోండి నాకేంటి సిగ్గు, ప్రపంచమంటే నేను ఈదుతున్న ఈ బావే అనిసంతోష/గర్వ పడిపోతుంటావ్

  ప్రత్యుత్తరంతొలగించు

Follow by Email

Popular Posts

Recent Posts