బుధవారం, డిసెంబర్ 30, 2015

అత్యధిక క్రైస్తవులు యేసును దేవునిగానే కొలుస్తారు. ఇంతకీ పైనున్న యెహోవా ఎవరు అంటే ఆయన తండ్రి,యేసు ఆయన కుమారుడు అంటారు. ఇంతకీ దేవుడు తండ్రా? కుమారుడా? అని అడిగితే ఇద్దరూ ఒకటే దేవుడు ఒక్కడే అంటారు.  ఇదెలా సాధ్యమో ...Next
5am to 6am మధ్యం ఇంకా మంచంపై దొర్లుతూనే ఉన్నాను. నిద్రపోలేదుగాని ఈరోజు ఏమి చేయాలా? నూతన సంవత్సరంలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ప్లాన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే ప్రక్కనే ఉన్న ఫోన్ మ్రోగింది. ఇంత ప్రొద్దుటే నాతో ఎవరికి అవసరం పడిందా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తే అవతలి నుండి NTV రిపోర్టర్ గారట. నాతో చాలా సేపు సంభాషించారు. మన "సాక్ష్యం మేగజైన్" చాలా బాగా నచ్చిందట. అందులోని కొన్ని బుక్స్ ఆయన Download చేసుకుని చదవడమే కాకుండా రెగ్యులర్ గా దానిలోని ఆర్టికల్స్ ఆయన ఫాలో అవుతున్నానని త్వరలో మీ సాక్ష్యం బ్లాగును NTV లో ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎందుకో మనసుకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఎందుకంటే "సాక్ష్యం మేగజైన్" వల్ల కొంతమంది మత వర్గాల పండితులకు గుండె దడ పట్టుకుంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో భక్తి స్థానంలో చెలామణీ అవుతున్న థర్మానికి శాస్త్రాలలో ఉన్న థర్మానికి ఎక్కడా సంబంధం లేదు. భక్తి పేరు చెప్పి సామాన్య జనులను దోచుకోవడానికి ఈరోజు పెద్ద వ్యాపారమే జరుగుతోంది. ప్రజలెవరూ తమను పూర్తిగా నమ్మరు కాబట్టి ఇవ్వన్నీ శాస్తాలను అడ్డు పెట్టుకుని, పుణ్య పురుషులను అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారు. ఇదంతా పెద్ద,పెద్ద నాయకులనుండి, స్వార్ధ పరులైన కొంతమంది పండితుల వరకూ రహస్యంగా సాగుతున్న వ్యాపారం. ఇటువంటి ఎన్నో విషయాలను ఎండగడుతూ, శాస్త్రీయమైన విషయాలను ప్రజలకు అందిస్తూ ఎంతో ధైర్యంగా ఈ "సాక్ష్యం మేగజైన్" ముందుకు సాగుతోంది. ఒకసారి మీరు "సాక్ష్యం మేగజైన్" ని విజిట్ చేయండి...Next

ఆదివారం, డిసెంబర్ 27, 2015

రాత్రి ఈ‌టి‌వి 20వ వసంతం ప్రోగ్రామ్ Youtube లో చూస్తుంటే మన గాన గాంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం గారు రామోజీరావు గారి గురించి కొన్ని విషయాలు చెప్పి కళ్ళనీళ్ళ పర్యంతమయి ఆయన కాళ్లపై పడి నమష్కరించే సన్నివేశం చూసి నా మనసు చలించిపోయింది. ఒకసారి బాల సుబ్రమణ్యం గారు ఎయిర్ పోర్ట్ లో దిగి కారు కోసం ఈనాడు ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ ఎట్టలేదట! సరే అనుకుని రామోజీ రావుగారింటికి ధైర్యం చేసి ఫోన్ చేస్తే రామోజీ రావుగారు ఫోన్ ఎత్తారట. చెప్పండి బాల సుబ్రమణ్యం గారు అని అడిగితే ఏమి చెప్పాలో బాలుగారికి అర్ధకాలేదట! గుండెల్లో దడ పట్టుకుందట. రామోజీరావుగారు రెట్టించి అడిగేటప్పటికి బాలు గారు నానించుతూ కారు కోసం ఫోన్ చేశాను సర్. ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయక పోతే మీ ఇంటికి చేశానని ధైర్యం చేసి చెప్పేసారట! దానికి రామోజీరావుగారు అర్రెరే ఈరోజు సెలవు కారణంగా డ్రైవర్లందరూ వెళ్లిపోయారే! అయినా పర్లేదండి ఒక డ్రైవర్ ఉన్నాడు. అయితే కారు డ్రైవ్ చేసి చాలా రోజులయ్యింది. వస్తాడు లెండి అంటే "ఎవరండీ ఆ డ్రైవర్?" అని బాలు గారు అడిగారట. నేనేనండీ అన్నారట రామోజీ రావుగారు. దానికి అవాక్కయ్యారట బాలుగారు. రామోజీరావుగారు కారు తీసుకు వచ్చారట. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. ఆయనకు గర్వం కానీ, ఆడంబరం గానీ ఏ కోశానా కనిపించవు. మేధావులు తక్కువుగా మాట్లాడతారనడానికి రామోజీ రావు గారే ఒక ఉదాహరణ. ఆయన ఎప్పుడూ చిర్నవ్వుతోనే కనిపిస్తారు గాని పెద్దగా మాట్లాడరు. ఆయన నిరంతర తపస్వి.
      ఏది ఏమైనా రామోజీ రావు గారు ఒక చారిత్రక మనిషి. ఆయన ఆ స్థితికి రావడమంటే మామూలు విషయం కాదు. తెలుగు బాష అభివృద్ధి కోసం ఎంతో తపించే రామోజీరావు గారు మన తెలుగు జాతి గర్వించదగ్గ ఒక మహానుభావుడు.

గురువారం, డిసెంబర్ 24, 2015

అవును నేను ముమ్మాటికి హంతకుడినే...ఒకటా రెండా? ఎన్నో హత్యలు చేసి మోసాలకు, కుట్రలకు దొరకకుండా తిరుగుతున్నాను. ఏ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నన్ను వేలెత్తి చూపించలేదు. ఏ ప్రభుత్వమూ నన్ను సన్మానించకుండా ఉండలేదు. ఎందుకంటే నేను చేసిన హత్యల వలన నేను బాగుపడుతున్నాను. సమాజమూ బాగుపడుతుంది. అందుకనే మీరు కూడా హత్యలు చేయండి. మీరు బాగుంటారు.
నీ స్వార్ధం నీవు చూసుకో, ఎవరు ఎలా పోతే నీకేమిటి? అని నిత్యం శాసించే మనసును నిర్ధాక్షిణ్యంగా చంపేశాను.
నిన్ను తమ స్వార్ధాలకు ఉపయోగించుకుని వాడుకునే వ్యక్తులతో కల్సే అవసరాన్ని కలిగిస్తున్న కాలాన్ని చంపేశాను.
కంటి మీద నిద్ర, గుండెల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్న ఆశలను చంపేశాను.
నన్ను నాశనం చేయాలనుకుంటున్న అహంకారాలునూ, మమకారాలనూ నిర్ధాక్షిణ్యంగా చంపేసి పూడ్చి వేశాను.
అదేమిటో నేను హత్యలు చేస్తున్నా నాలో శత్రువులు కొత్తగా పుట్టుకొస్తూనే వున్నారు. ఎన్నని చంపను? అయినప్పటికీ నేను చంపుతూనే ఉన్నాను. నేను దేనిని వదలను. ప్రతిదాన్ని చంపేస్తూనే ఉంటాను.ఎందుకంటే నేనొక హంతకుడిని!

మంగళవారం, డిసెంబర్ 22, 2015

ఒక ఆడపిల్లను రాత్రంతా బస్సులో ఢిల్లీ నడి వీధుల్లో తిప్పుతూ అతి కిరాతకంగా ఒకరి వెంట ఒకరు హత్యాచారమ్ చేస్తూ, మానంలో ఇనుపరాడ్లు, బీరు బాటిల్లు చొప్పించి ప్రేగులను సైతం మానంలో నుండే బయటికి లాగి అతికిరాతకంగా అనుభవించిన పైశాచిక రాక్షసులలో ఒకడ్ని మన దేశం వదిలి పెట్టి, వాడికి జీవనభృతి కలిపిస్తూ, రక్షణ వ్యవహారాలను నిర్వహిస్తున్న మన దేశ చట్టాలపై గౌరవం పోయింది. వాడి కోసం వాదిస్తున్న న్యాయ వ్యవస్థను చూసి వాళ్ళకు సిగ్గు లేకపోయినా ఇలాంటి దేశంలోనా నేనున్నది అని సిగ్గుతో కుమిలిపోతున్నాను. కోర్టులో న్యాయ దేవత కళ్ళకు గంతతో పాటు హృదయం కూడా లేదు అనే విధంగా చూపిస్తే ఎంత బాగున్ణు. వయస్సు కొంత తక్కువైతే అమ్మాయిలను ఎలాగైనా చీల్చి చెందాడవచ్చన్న మాట. పెద్దగా శిక్షలు లేని చట్టాలు మనవి. విపరీతమైన బొక్కలతో నిందియున్న చట్టాలు మనవి. ఈ పనికి రాని చట్టాలు చూసి సిగ్గు వేస్తుంది. ఒక ఆడపిల్లకు సరైన న్యాయం చేయలేని చట్టాలు ఉన్నా ఒకటే! తగల బెట్టినా ఒకటే.. నేను సిగ్గుపడుతున్నాను...దేవుడా ఇటువంటి దేశమా? నా భారతదేశం అని!!!

ఆదివారం, డిసెంబర్ 20, 2015

తెలుసుకోవాలనుకుంటున్నారా? వినుకోండి మరి... జంతువులూ,పక్షులూ తెల్లవారు జాము నిద్ర లేచిపోతాయి. మనిషి నిద్ర లేవడు. మార్నింగ్ 8గంటలైనా నిద్రలేవడానికి బద్దకిస్తాడు. లేచిన తరువాత .హడావుడి పనులతో హైరానా పడిపోయి హార్ట్ కు చిల్లులు కూడా పెట్టుకుంటాడు. జంతువులు, పక్షులు బాడీకి సరిపడా నీళ్ళు త్రాగుతాయి. మనిషి త్రాగడు. టీలు,కాపీలు త్రాగి,త్రాగి కడుపు నిండా కఫం పెంచుకుని మాయదారి రోగాలతో సతమతమవుతుంటాడు. జంతువులు,పక్షులు ప్రతిరోజూ పెండలకాడనే బొచ్చుంటాయి. మనిషికి తీరిక ఉండదు. అర్ధ రాత్రులు ఎప్పుడో మంచం పై అటు,ఇటూ సరిగా నిద్రపట్టక దొర్లుతాడు. కాదంటారా? మొన్న నేషనల్ జియోగ్రఫిక్ చానెల్లో అడవి రాజు పులి ఇంటర్వూ వచ్చింది. అవ్వన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలని చూస్తున్నాయట? అత్తారింటికి దారేది? సినిమాలో హీరో మాతో పోల్చుకోవడం చాలా అవమానంగా ఉందని భావిస్తున్నామని చెప్పుకొచ్చింది. క్రమ శిక్షణ లేని బ్రతుకులతో.ఒంటి నిండా రోగాలతో నిండి యున్న మనుషులకు మాతో పొలికేమిటి? మాకు ఆరోజు కడుపు నిండితే చాలు, ఇక ఆశపడం. కానీ మనిషి 1000 సంవత్సరాలు తినినంతా కూడబెట్టుకున్నా ఆశ చావదు. ఆ ఆశతోనే జీవితమంతా దుర్భరం చేసుకు బ్రతుకుతాడు. సుఖం ఉండదు, శాంతి ఉండదు. దానితో ఒళ్ళంతా బిపి,షుగర్లతో ఏడుస్తాడు. అటువంటి అత్యాశ కలిగిన మనుషులతో మాకు పొలికేమిటి? ఇది మా జాతికే అవమానం! దీనిపై సరైన చర్య తీసుకోనంత వరకూ మేము ఊరుకుండే ప్రశ్నే లేదని ఖరాఖండిగా చెప్పేసింది. ఏమి జరుగుతుందో, ఏమో ఎదురు చూడాలి.

శనివారం, డిసెంబర్ 19, 2015

అవును. జాగ్రత్త లేకపోతే అందమైన ఆడపిల్ల,అగ్గిపుల్ల ఇవి రెండూ ప్రమాదమే. మనుషులను నిలువునా తగలబెట్టేస్తాయి. నిజం కాదంటారా?

శుక్రవారం, డిసెంబర్ 18, 2015

నీహారికా గారు..మీరు ఎంతో చక్కని పోస్టులు పెడుతుండేవారు. అటువంటిది ఈ "తొక్క" లో గొడవెంటమ్మా? ప్రతి బ్లాగును పట్టుకుని "తొక్కా...తొక్కా" అని విమర్శిస్తుంటే అసలు నీహారికా మేడమ్ గారు చెప్పేది ఏ "తొక్క" గురించి అనే సందేహం వచ్చింది. దానిని నివృత్తి చేసి నా "తొక్క"లో బాధ తీర్చగలరు. మరొక విషయమేమిటంటే ప్రస్తుత తెలుగు బ్లాగుల ప్రపంచంలో ధైర్యంగా పోరాడుతున్న వీరామణి మీరు మాత్రమే. మీ తపాలను నిశితంగా పరిశీలనగా చదివితే ఏదో ఒక మంచి విషయం బోధపడుతుంది. ముందు మీరు ఈ "తొక్క"ను వదిలిపెట్టి దయచేసి మీదైన శైలిలో మంచి,మంచి చైతన్యపరిచే పోస్టులు పెట్టండి. మాలాంటి వాళ్ళ అభిమానాన్ని నిలబెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ పోస్ట్ చదివిన తరువాత ఈ "తొక్క"లో సలహా నాకెందుకులే అనుకుంటే ఏం చేయలేను. శుభం!

సోమవారం, డిసెంబర్ 14, 2015

ఆకాశమంతా నిర్మానుష్యంగా ఉంది. నల్లని త్రాచులాంటి తార్రోడుపై  నా కారు పరుగెడుతుంది. నేను ఇండియా వచ్చి రెండురోజులయ్యింది. ఆరెండు రోజులూ కాకినాడలోనే ఉండిపోయాను. ఈరోజు ఎలాగైనా నేను పుట్టిన పల్లెటూరు చూసి రావాలనిపించి బయలుదేరాను. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. అప్పటికే చిరుజల్లులు ప్రారంభమయ్యి చలి పుడుతూంది.
   "అమెరికా నుండి వచ్చి కాకినాడలోనే ఉండిపోతావా? నన్ను చూడాలని అనిపించడం లేదా? " నేను ఇండియా వచ్చిన దగ్గరనుండి మా బామ్మ నన్ను తిడుతూనే ఉంది. నాకు మా బామ్మ కంటే ఎవరున్నారు? ఆమెను చూడకుండా ఉండగలనా? నేను వచ్చిన రోజే కాకినాడ వచ్చేయమన్నాను..నేను అంతదూరం రాలేను. నీవు ఇక్కడికి రా? అంది.
   నేను వూరు వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంది. కారణం పేరే సబీరా!
   మా పల్లెలో మాఇంటి ఎదురుగానే వాళ్లిల్లు ఉంది. తనను నేను మొదటిసారి చూసినప్పుడే నేను తను లేకపోతే బ్రతకలేను అనిపించింది. నయాగరా జలపాతంలాంటి నడుముతో, చంద్రబింబంలాంటి కళ్ళతో తెల్లని పాల నూరుగులా ఉండేది. ఆమెను ఎంత చూసినా చూస్తూనే ఉండిపోవాలనిపించేది.

ఆదివారం, డిసెంబర్ 13, 2015

పార్క్ కు వెళ్ళినా,  బీచ్ కు వెళ్ళినా లవర్సే దర్శనమిస్తున్నారు. ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరూ నాకుతున్నారు. సినిమా హాల్లో ప్రక్క,ప్రక్కనే కూర్చుని సోల్లు కబుర్లు చెబుకుంటున్నారు. వాళ్ళిద్దర్నీ చూస్తుంటే సముద్రంలో నది మిళితమైనట్టుగా కల్సిపోతున్నారు. మా వెధవ ప్రసాద్ గాడు సముద్రం ఎవరనుకుంటున్నావు? అమ్మాయే! దానికి ఎన్ని నదులు కల్సినా తనివితీరదు అని ఒక పెద్ద వేదాంతి లెవెల్లో చెప్పాడు. వీడికి వీటి అనుభవం ఎక్కువలెండి. మొన్న రాజమండ్రి దెబ్బకు అదోలా తయారయ్యిపోయాడు. నా దృష్టిలో అమ్మాయిలు టూ టైప్స్ ఉంటారు. అబ్బాయిలకు సర్వమూ దోచి పెట్టేవారు ఒకరైతే, అబ్బాయిల నుండి సర్వమూ లాగేసుకునేవారు రెండో టైప్. ఇప్పుడు ఎక్కువుగా రెండో టైపు అమ్మాయిలే ఎక్కువ.
      ఇక అబ్బాయిల విషయానికొస్తే వీరు కూడా టూ టైప్సే. దోచి పెట్టేవారు, దోచుకునేవారు. అదేం విచిత్రమో కానీ ఈరెండో రకం అబ్బాయిలకే ఆ మొదటి రకం అమ్మాయిలు పడతారు. తరువాత లబోదిబో మంటారు.
      ఈ అమ్మాయిలున్నారు చూశారు వీళ్ళెప్పుడూ  మంచివాళ్ళను నమ్మరు. ప్రేమించరు. ఎప్పుడూ బిల్డప్ ఇస్తూ రేష్ గా తిరిగే అబ్బాయిలకే పడతారు. తీరా పడ్డాక చూసుకునెట్టప్పకీ అది గొయ్యని తెల్సి నెత్తినోరూ బాదుకుంటారు. ఈ మహారాణులను మాత్రం గోతిలో నుండి తీయడానికి అమాయకమైన అబ్బాయిలు కావాలి. పెళ్లి పేరిట ఇటువంటి అబ్బాయిల గొంతు కోస్తారు. అప్పటివరకూ ఈ అమ్మాయిలకు ఫ్యాషన్లు,బిల్డప్ లు నెత్తికెక్కిన కారణంగా కళ్ళు సరిగా కనిపించక తిరుగుతారు. ఇలాంటి అమ్మాయిలలో అవేర్ నెస్ తీసుకు రావాలి. తమ జీవితం,శీలం .(కేరెక్టర్) యొక్క ప్రాముఖ్యాన్ని అర్ధమయ్యేలా తెలియజెప్పాలి.దీనికి మీరేమంటారు?

శనివారం, డిసెంబర్ 12, 2015

అవును. మీ అందరికోసం నేను ఒక హర్రర్ సీరియల్ వ్రాద్దామని అనుకున్నా! కానీ రాయడానికి నాకు చాలా భయమేస్తుంది. రాత్రి 12 గంటలకు పెన్ను,పుస్తకం తీసుకుని మా పెరటులో ఉన్న చింతచెట్టు దగ్గర కూర్చుని మెదలు పెట్టానో లేదో ఒక్కసారిగా మా చింతచెట్టు కొమ్మలు తమిళనాడు వరద గాలికి ఊగినట్టు తెగ ఊగిపోయాయి. కొంపదీసి నాకధలోని దెయ్యం ముందే చెట్టు మీదకొచ్చి కూర్చుందా? ఏమిటి?  అనిపించి అక్కడ నుండి లగెత్తుకొచ్చి దుప్పటి ముసుగులోకి దూరాను. దయచేసి మీరైనా హర్రర్ సీరియల్ ఎలా ధైర్యంగా రాయాలో చెప్తారా? ఫ్లీజ్...?

గురువారం, డిసెంబర్ 10, 2015

"అమ్మాయి కాదు అబ్బాయని..అదీ ఆ టైపు అబ్బాయని ఎలా తెలిసిందో మా ప్రసాద్ గాడు చెప్పడం ప్రారంభించాడు.
"వాడు నిన్న ఎర్లీ మార్నింగ్ 7am కల్లా ఇంటికొచ్చేయమని ఫోన్ చేశాడు. నేను పుల్ మేకప్ మీద తయారయ్యి రాజమండ్రి సందులూ,గొందులూ అన్నీ తడుముకుని మొత్తానికి ఆ అమ్మాయి, ఛ... ఆ అబ్బాయి ఇంటికెల్లాను. డోర్ దగ్గర నిలబడి పిలిస్తే లోపలికొచ్చి సోఫాలో కూర్చోండి అనే వాయిస్ వినబడింది. నాకు ఎక్కడ లేని టెన్షన్ అనుకో. తను డ్రెస్ మార్చుకుంటున్నానని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పింది. సరే అనుకుని రిలీఫ్ దొరికింది కదా అని సోఫాలో కూలబడ్డాను. కొద్ది సేపటికి వాడు కాఫీ గ్లాసుతో వచ్చి నాదగ్గర నిలబడి నీవు నాకు ట్రైన్ లో పరిచయమయిన వాడివి కాదే" అని అడిగింది.
   "ట్రైన్లో పరిచయమేమిటి?" ఏమీ తెలియనట్టు అడిగాను నేను.
  "అదా! ఆ అమ్మాయి చ..వాడు ఫస్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు "బాగున్నారా" అని అడిగాడు. మీరెవరు అని నేను అడిగితే విజయవాడ టైన్ లో కలిసాము కదండీ" అని చెప్పాడు. వాయిస్ చాలా నైస్ గా ఉంది కదాని నేనేనని చిన్న ఆబద్ధంతో కమిట్ అయ్యిపోయాను. ఇప్పుడు నా కొంప మునిగింది." లబో దిబో మన్నాడు.
  సర్లే... తరువాత ఏమైంది నవ్వు ఆపుకుంటూ అడిగాను.
  "వాడిచ్చిన టీ త్రాగే వరకూ నేను టెన్షన్ తో తల పైకి ఎత్తనే లేదు.
  "ఆమె (వాడు) అడిగిన ప్రశ్నకు నాకు టైన్ లో పరిచయమయ్యినది మీరు కాదా? సారీ అన్నాను. బహుశా ఇద్దరమూ రాంగ్ నంబర్ వలన కలిసి ఉంటాం. నేను వెళ్లిపోతాను.ఆయామ్ సారీ..! అని లేవబోయాను. టెన్షన్ ని ఆపుకోవడం నావల్ల కావడం లేదు. ఆ టెన్షన్ వలన వాడిని అప్పటికీ చూడలేదు.
   "ఏదో విధంగా మనిద్దరమూ పరిచయమ్మాము కదండీ... వెళ్లిపోవడం ఎందుకు? కల్సే ఉందాం!" అని నా వెనుక నుండి వచ్చి నా భుజాలపై చేతులేసి గట్టిగా ఒత్తింది.కాదు..కాదు ఒత్తాడు. నాకు ఆ సమయంలో స్వర్గలోకాలన్నీ తిరిగి వచ్చి హ్యాపీ గా కూర్చున్నట్టుగా అనిపించింది.
  వాడు కొట్టుకున్న సెంట్ బహుశా భూమి మీదది కాదేమో అనిపించింది.నాకు మాత్రం నవ్వు ఆగడం లేదు.
 "బెడ్ రూమ్ లోకి వెళ్లిపోదాం పద" అన్నాడు.
 "ముందు మీరు వెళ్ళండి"సిగ్గుతో మెలికలు తిరుగుతూ చెప్పాను.
  "వాడు బెడ్ రూమ్ కి వెళ్లిపోయేడు. విచిత్రం ఏమిటంటే వాడు పాత సినిమాలోని సావిత్రిలా చీర చెంగు తలపై నుండి కప్పుకునే ఉన్నాడు. వాడు సూచన మేరకు ఒంటి మీద కట్ట డ్రాయర్ తప్ప మరేమీ లేకుండా ఫ్యాంట్,షర్ట్ విప్పేసాను. తరువాత వాడు తన బట్టలు మొత్తం విప్పేస్తానని అన్నప్పుడు ఆనందంతో పొంగిపోయాను.
  "వాడు చీర చెంగు ముఖం మీద నుండి తీసిన తరువాత అప్పుడు...అప్పుడు చూశాను. ఒక్కసారిగా నా నరాలన్నీ తెగిపోయినట్టుగా అనిపించాయి. భూమి లోపలికి నేను కూరుకుపోతున్నట్టు అనిపించి౦ది. వాడు నవ్వుతూ మీదకు రాబోతుంటే ఒక్కసారిగా వెనుకకు నెట్టేసి ఫ్యాంట్, షర్ట్ పట్టుకుని ఒక్క  ఉదుటున అక్కడ నుండి జంప్ చేసి వీధిలోకొచ్చి పడ్డాను. నన్ను ఆ వీధి మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోయాననుకో" 
 ఈ విషయాలన్నీ వాడు చెప్తుంటే నాకు విపరీతమైన నవ్వు ముంచుకొచ్చింది.
    "ఇక జన్మలో ముక్కూ,ముఖం తెలియని వాళ్ళతో అసలు మాట్లాడకూడదు... టైమ్ వేస్ట్..బోల్డు రిచార్జ్ బిల్లు వేస్ట్" అంటూ పని ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంటే వాడి వంక నవ్వుతూ చూస్తూ ఉండిపోయాను.
ఇంతకీ ముఖ్య విషయమేమిటంటే ఆ రాజమండ్రి అమ్మాయికి...చ..చ...కాదు..కాదు అబ్బాయికి నంబర్ నేనే ఇచ్చానని ఈ పోస్టులు చదివే వరకూ మా ప్రసాద్ గాడికి ఎప్పటికీ తెలియదు. ఉంటాను.బై!!!
  
    

బుధవారం, డిసెంబర్ 09, 2015

మా ప్రసాద్ గాడికి ఏమి జరిగిందో చెప్పేముందు మీకు వాడి గురించి తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే వాడిని బుక్ చేసింది నేనే కాబట్టి మీరందరూ నన్ను తిట్టుకునే అవకాశం ఉంది. సరే...మా ప్రసాద్ గాడు డైలీ చేసే పెద్ద పని ఏమిటంటే ఎప్పుడూ మొబైల్ లో సొల్లు కబుర్లు చెప్పడమే! ఏదో ఒక రాంగ్ నంబర్ కి డయల్ చేయడం అవతలి వాళ్ళు మగవారైతే రాంగ్ నంబర్ సర్ అని చెప్పి పెట్టేయడం, ఆడ వారైతే ఏదో విధంగా మాటలు కలుపుకుని మాటలాడటం వీడి ప్రధాన పని, ఈ విషయంలో ఎన్నో తిట్ల పురాణాలు వీడు స్వతహాగా అనుభవించిన  బుద్ది రాలేదు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ గారు పనీపాటా లేకుండా వీడు జులాయిగా తిరుగుతున్నాడని నా దగ్గర ఎన్నోసార్లు వాపోయింది.
    అందుకనే వీడి తిక్క ఎలాగైనా కుదిరించాలని అతనికి వీడి నంబర్ ఇవ్వడం జరిగింది.
    మా ప్రసాద్ గాడికి ఒకరోజు అనుకున్నట్టే రాజమండ్రి నుండి కాల్ వచ్చింది.
   వాడికిక తీరిక లేకుండా పోయింది. బెడ్ రూమ్ లోనూ, బాత్రూమ్ లోనూ, ఇంటా,బయటా ఎక్కడ చూసినా ఫోన్ తోనే కాలక్షేపణ .వాడికి ప్రతి రోజూ బిజీ,బిజీ. వాడి వాలకం చూసి నాకర్ధమయ్యిపోయింది.
  ఒకరోజు నేనే అడిగాను. ఎక్కడ నుండి ఫోన్?
 "రాజమండ్రి నుండి" వాడి సమాధానం. నవ్వి హూరుకున్నాను.
  "నేను ఎంతో మంది అమ్మాయిలతో మాట్లాడాను. కానీ ఈ అమ్మాయెవరో చాలా బాగా మాటలాడుతుంది. వాయిస్ గానకోకిలనుకో! ఎలాగైనా ఈ అమ్మాయిని నా భార్య గా చేసుకోవాలి, నాకసలు నిద్రపట్టడం లేదు. తిన్నా, పడుకున్నా ఆమె గురించే ఆలోచనలు" వాడు ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతుంటే నాకొచ్చే నవ్వును ఆపుకోవడానికి చాలా కష్టమయ్యింది.
  ఎప్పుడు కలుస్తున్నావ్?
త్వరలో ... ఇదీ వాడితో జరిగింది. ఇంతకీ వాడు వారం తరువాత నా దగ్గరికి పరుగున వచ్చి ఆయాసంతో ప్రక్కన కూలబడ్డాడు " ఏమైంది? ఆదుర్దాగా అడిగాను.
 "రాజమండ్రి నుండి నాకొచ్చే కాల్ అమ్మాయిది కాదు. అబ్బాయిది." ఆ సమయంలో వాడి ముఖకవళికలు చూస్తుంటే...నేను నవ్వును ఆపుకోలేకపోయాను.
ఇంతకీ మా ప్రసాదిగాడికి అమ్మాయి కాదు..అబ్బాయని ఎలా తెల్సింది?

 


Recent Posts