బుధవారం, డిసెంబర్ 09, 2015

మా ప్రసాద్ గాడికి ఏమి జరిగిందో చెప్పేముందు మీకు వాడి గురించి తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే వాడిని బుక్ చేసింది నేనే కాబట్టి మీరందరూ నన్ను తిట్టుకునే అవకాశం ఉంది. సరే...మా ప్రసాద్ గాడు డైలీ చేసే పెద్ద పని ఏమిటంటే ఎప్పుడూ మొబైల్ లో సొల్లు కబుర్లు చెప్పడమే! ఏదో ఒక రాంగ్ నంబర్ కి డయల్ చేయడం అవతలి వాళ్ళు మగవారైతే రాంగ్ నంబర్ సర్ అని చెప్పి పెట్టేయడం, ఆడ వారైతే ఏదో విధంగా మాటలు కలుపుకుని మాటలాడటం వీడి ప్రధాన పని, ఈ విషయంలో ఎన్నో తిట్ల పురాణాలు వీడు స్వతహాగా అనుభవించిన  బుద్ది రాలేదు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ గారు పనీపాటా లేకుండా వీడు జులాయిగా తిరుగుతున్నాడని నా దగ్గర ఎన్నోసార్లు వాపోయింది.
    అందుకనే వీడి తిక్క ఎలాగైనా కుదిరించాలని అతనికి వీడి నంబర్ ఇవ్వడం జరిగింది.
    మా ప్రసాద్ గాడికి ఒకరోజు అనుకున్నట్టే రాజమండ్రి నుండి కాల్ వచ్చింది.
   వాడికిక తీరిక లేకుండా పోయింది. బెడ్ రూమ్ లోనూ, బాత్రూమ్ లోనూ, ఇంటా,బయటా ఎక్కడ చూసినా ఫోన్ తోనే కాలక్షేపణ .వాడికి ప్రతి రోజూ బిజీ,బిజీ. వాడి వాలకం చూసి నాకర్ధమయ్యిపోయింది.
  ఒకరోజు నేనే అడిగాను. ఎక్కడ నుండి ఫోన్?
 "రాజమండ్రి నుండి" వాడి సమాధానం. నవ్వి హూరుకున్నాను.
  "నేను ఎంతో మంది అమ్మాయిలతో మాట్లాడాను. కానీ ఈ అమ్మాయెవరో చాలా బాగా మాటలాడుతుంది. వాయిస్ గానకోకిలనుకో! ఎలాగైనా ఈ అమ్మాయిని నా భార్య గా చేసుకోవాలి, నాకసలు నిద్రపట్టడం లేదు. తిన్నా, పడుకున్నా ఆమె గురించే ఆలోచనలు" వాడు ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతుంటే నాకొచ్చే నవ్వును ఆపుకోవడానికి చాలా కష్టమయ్యింది.
  ఎప్పుడు కలుస్తున్నావ్?
త్వరలో ... ఇదీ వాడితో జరిగింది. ఇంతకీ వాడు వారం తరువాత నా దగ్గరికి పరుగున వచ్చి ఆయాసంతో ప్రక్కన కూలబడ్డాడు " ఏమైంది? ఆదుర్దాగా అడిగాను.
 "రాజమండ్రి నుండి నాకొచ్చే కాల్ అమ్మాయిది కాదు. అబ్బాయిది." ఆ సమయంలో వాడి ముఖకవళికలు చూస్తుంటే...నేను నవ్వును ఆపుకోలేకపోయాను.
ఇంతకీ మా ప్రసాదిగాడికి అమ్మాయి కాదు..అబ్బాయని ఎలా తెల్సింది?

0 Comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Follow by Email

Popular Posts

Recent Posts