గురువారం, డిసెంబర్ 24, 2015

అవును నేను ముమ్మాటికి హంతకుడినే...ఒకటా రెండా? ఎన్నో హత్యలు చేసి మోసాలకు, కుట్రలకు దొరకకుండా తిరుగుతున్నాను. ఏ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నన్ను వేలెత్తి చూపించలేదు. ఏ ప్రభుత్వమూ నన్ను సన్మానించకుండా ఉండలేదు. ఎందుకంటే నేను చేసిన హత్యల వలన నేను బాగుపడుతున్నాను. సమాజమూ బాగుపడుతుంది. అందుకనే మీరు కూడా హత్యలు చేయండి. మీరు బాగుంటారు.
నీ స్వార్ధం నీవు చూసుకో, ఎవరు ఎలా పోతే నీకేమిటి? అని నిత్యం శాసించే మనసును నిర్ధాక్షిణ్యంగా చంపేశాను.
నిన్ను తమ స్వార్ధాలకు ఉపయోగించుకుని వాడుకునే వ్యక్తులతో కల్సే అవసరాన్ని కలిగిస్తున్న కాలాన్ని చంపేశాను.
కంటి మీద నిద్ర, గుండెల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్న ఆశలను చంపేశాను.
నన్ను నాశనం చేయాలనుకుంటున్న అహంకారాలునూ, మమకారాలనూ నిర్ధాక్షిణ్యంగా చంపేసి పూడ్చి వేశాను.
అదేమిటో నేను హత్యలు చేస్తున్నా నాలో శత్రువులు కొత్తగా పుట్టుకొస్తూనే వున్నారు. ఎన్నని చంపను? అయినప్పటికీ నేను చంపుతూనే ఉన్నాను. నేను దేనిని వదలను. ప్రతిదాన్ని చంపేస్తూనే ఉంటాను.ఎందుకంటే నేనొక హంతకుడిని!

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts