శుక్రవారం, సెప్టెంబర్ 09, 2022

నిన్ను నీవే గౌరవించుకోలేకపోతే ఇతరులెలా గౌరవిస్తారు | We must be like ourselves

నిన్ను నీవే గౌరవించుకోలేకపోతే ఇతరులెలా గౌరవిస్తారు | We must be like ourselves

నిన్ను నీవే గౌరవించుకోలేకపోతే ఇతరులెలా గౌరవిస్తారు?

మనలో చాలా మందికి ఆత్మ నూన్యత భావం ఎక్కువుగా ఉంటుంది. ఇటువంటి భావన చాలా ప్రమాదకరమైనది. నేను పొట్టిగా ఉన్నాననో, నల్లగా ఉన్నాననో, లేక అసలు అందముగా లేననో..ఇలా రకరకాల ఫీలింగ్స్ మనసు నిండా పెట్టుకుని ఉంటే మనం అభివృద్ధికి దూరమయిపోయినట్టే!
నీకు నీపట్ల ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఇతరులు నీగురించి ఏదో అనుకుంటారని భావిస్తూ ఉంటే వాళ్ళతో పాటు నీవు కూడా వెనుకే ఉండిపోతావు.
నీవు నీకు నచ్చాలి..ఇతరులకు కాదు.
నీవు తొడిగే బట్టలు నీకు సౌకర్యంగా ఉండాలి కాని ఇతరులకు కాదు. నీవు ఎదగడానికి ప్రయత్నించే కొద్దీ ఇతరుల నుండి అవహేళనలు, ఎగతాళి మాటలు, మనస్సును గాయపర్చే మాటలు, అవరోధనలు, అడ్డంకులు ఎదురుకుంటూనే ఉండాలి.
ఏరోజైతే నీవు సక్సెస్ అందుకుంటావో ఆక్షణం నుండీ నిన్ను ఎగతాళి చేసిన వారే సైతం నిన్ను గొప్పగా పొగడటం ప్రారంభిస్తారు.

మీరు ఒకసారి ఓ గొప్ప మహానుభావుడి కధ వినండి.

*అది బ్రిటిష్ కాలం.. ఒక పిల్లవాడు స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. " స్కూళ్ళో కొందరు పోకిరీ పిల్లలు పిలక పంతులు అని వెక్కిరిస్తున్నారమ్మా .. పిలక తీసేస్తానమ్మా " అని చెప్పి ఏడ్చాడు.*

*చూడు నాన్నా.. " నీ పిలక వలన వాళ్ళకి ఏ నష్టమూ లేదు. పిలక ఉన్నందుకు నువ్వు బాధ పడక్కరలేదు. ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళు వెక్కిరించారని నువ్వు పిలక తీసేస్తే నీ మీద నీకు గౌరవం లేనట్టే. అవన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టిపెట్టు నీ వలన దేశానికి చాలా ఉపయోగముంది." అంది.*

*కొంతకాలం తరువాత .." అమ్మా  స్కూళ్ళో పిల్లలు నన్ను జంధ్యం మాష్టారు .. జంధ్యం మాష్టారు అంటూ వెక్కిరిస్తున్నారు.. అస్తమానూ జంధ్యం పట్టుకొని లాగుతూ అల్లరి చేస్తున్నారు " అంటూ మళ్లీ ఏడ్చాడు.*

*" నీ జంధ్యం బయటకు రాకుండా చొక్కాలు కుట్టిస్తాను నాయనా.. బాధపడకు. వాళ్ళ చేతలు ,వాళ్ళ మాటలు పట్టించుకోకు. నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుమిలిపోకూడదు. రాళ్లు అడ్డొచ్చాయని ప్రవాహం ఆగిపోతుందా.. ?  " అని అనునయించింది.*
*మరికొంత కాలం గడిచాక ఆ పిల్లాడు ఇంకా పెద్ద చదువులు చదవడానికి దూరప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ అలాంటి సమస్యే ఎదురయ్యింది. " అమ్మా ! ఇక్కడి వాళ్ళు కోడిగుడ్లు తినమని  నన్ను పొరుపెడుతున్నారు. బెదిరిస్తున్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను తినే భోజనంలో కోడిగుడ్డుని కలిపేస్తున్నారు. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా " అని ఉత్తరం రాసాడు.*

*"వాళ్ళు ఎన్నిరకాల పన్నాగాలు పన్నినా నువ్వు చలించకు. వాళ్ళు కాకుల వలే గోలచేస్తే చెయ్యనీ , దోమల వలే రొదపెడితే పెట్టని..  వాళ్ళు అలాగే మిగిలిపోతారు. కానీ నువ్వు దేశచరిత్రలో మహానుభావుడిలా నిలిచిపోవాలి.  ఏకాగ్రత కోల్పోకు.. నీ చదువుని ఒక తపస్సులా భావించు. ఉదయాన్ని చూడాలంటే చీకటిని భరించాలి.ధృఢమైన సంకల్పంతో ముందుకెళ్లు.  " అని ఆమె తిరుగు ఉత్తరం రాసింది.*

*తల్లి రాసిన ఉత్తరం చదివిన అతడు కొండంత బలంతో చదువు పూర్తిచేశాడు. కేంబ్రిడ్జి కి వెళ్ళాడు. ప్రపంచదేశాలు మనివ్వెరపోయేలా భారతదేశపు ఖ్యాతిని ఆకాశంలో నిలబెట్టాడు.*

*అతడే విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త " సి.వి.రామన్ " . తన తల్లి చెప్పిన విలువలను , హితోక్తులను ఆయన తన జీవితకాలం పాటించారు. విదేశాలకు వెళ్లినా , ప్రోఫెసర్ గా పనిచేస్తున్నా, మద్రాస్ ఐ.ఐ.టి. కి వైస్ ఛాన్సేల్లెర్ గా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ తన పిలకని తీయలేదు. భారతీయతను వదిలిపెట్టలేదు. అందుకే తలపాగా ధరించేవారు.*
" Raman the great."
కాబట్టి మిత్రులారా మీరందరూ సివి రామన్ ఆదర్శంగా తీసుకోండి. మనకి మనం ఆత్మ బలంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మనకి విజయం ఏమాత్రం కష్టం కాదు. జైహింద్!!!
how to make people respect you, respect, how to get respect, how to command respect, how to gain respect, respect yourself, how to know if you do not respect yourself, how to be respected, make people respect you, how to respect yourself, signs you don't respect yourself, how to learn to respect yourself, how to command respect if you're quiet, things that make others lose respect for you, how to gain respect from others, Jordan Peterson - how to get people to respect you

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts