ఆదివారం, మార్చి 17, 2019

"హాయ్ సర్ " పక్కనుండి వచ్చిన గొంతు విని ట్రైన్ విండో నుండి కదులుతున్న చెట్లను, పొలాలను గమనిస్తున్న నేను అతని వైపు చూశాను.
  తెల్లగా, కాంతివంతమైన ముఖంతో చిరునవ్వు చిందుస్తూ నా వయస్సే ఉన్న ఒక యువకుడు కనిపించాడు. బహుశా వేరే సీటులో నుండి వచ్చి నా ప్రక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతకు ముందు నాపక్క అప్పటివరకూ ఎవరూ లేరు.

 "హాయ్ సర్..." నేనూ ప్రతి పలకరింపు చేశాను. అప్పటికే ట్రైన్ నిడదవోలు దాటుతుంది.
 "నేను రాజమండ్రి నుండి వస్తున్నాను సర్ ..మీరెక్కడ నుండి?" అడిగాడతను.
 "కాకినాడ నుండి" చెప్పాను.
"ఎక్కడకి వెళ్తున్నారు?
"విజయవాడ"
"నేను ఏలూరు మా అక్క వాళ్ళింటికి వెళ్తున్నాను." నేను అడగకుండానే అతను తిరిగి చెప్పాడు.
 ఎందుకో నేను కాకినాడ అన్నప్పటి నుండీ అతని ముఖంలో ఒక ఆనందం. అలా ఇలా ఒకటేమిటి అన్ని విషయాలు చెప్తూనే ఉన్నాడు. ఈమధ్యే రిలీజ్ అయిన కంచె సినిమా చాలా బాగుందని, మీరు కూడా చూడండని చెప్పాడు.
నవ్వి ఊరుకునే వాడిని.
  " అదేమిటి సర్... అన్నీ నేనే మాట్లాడుతున్నాను. మీరేమిటీ చెప్పరేమిటి? "నన్ను అడిగితే " అదేం లేదు.. మీరు అన్ని విషయాలు చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాను.
  కొంతసేపు అయిన తరువాత తన పర్సనల్ విషయాలు చెప్పాడు. తనకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారని అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయని, అమ్మ,నాన్న ఈలోకంలో నుండి దూరంగా వెళ్లిపోయారని చెప్పాడు.తను మాత్రం రాజమండ్రి బట్టల దుకాణంలో పని చేస్తూ ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాడట!
  నా సానుభూతి తెలిపాను. కొద్దిసేపు మౌనం తరువాత నేనే అడిగాను.
"మరి నీవేందుకు పెళ్లి చేసుకోలేదు అని?"
 దానికతను సమాధానం చెప్పలేదు. నేను అతనితో మాటల సంభాషణ కొనసాగించేటప్పటికి తెగ సంతోషపడిపోయాడు. కొంత సంభాషణ జరిగిన తరువాత ఒక్కసారిగా అతనేమిటో తెలిసింది.
"నన్ను రాజమండ్రి తన ఇంటికి రమ్మన్నాడు. తను చీర కడితే చాలా అందంగా ఉంటానని ఏ సినిమా హీరోయిన్ కూడా సరిపోదన్నాడు. తన చేతులు నా తొడపై వేసి రుద్దాడు. నాకు ఒక్కసారిగా ఏమి జరిగిందో అర్ధం కాలేదు.  వెంటనే తేరుకుని తనకు గట్టిగా చెప్పి దూరం జరగమన్నాను."
  "సర్... నేను మీకన్ని విధాల సహకరిస్తాను. ప్లీజ్ మా ఇంటికి రండి. కాకినాడ నుండి రాజమండ్రి రావడం కష్టం కాదుగ!"నాకు అతని మాటలకు, చ్రేష్టలకు వళ్ళంతా తేళ్ళు,జెర్రులు పాకుతున్న ఫీలింగ్ కలుగుతోంది.
 వాయిస్ కూడా మార్చేశాడు. అచ్చు లేడీస్ వాయిస్ లా ఉంది.
  "ఏలూర్ స్టేషన్ ఎప్పుడు వస్తుందిరా దేవుడా? అంటూ వెయ్యి మొక్కులు మొక్కాను. అతను నాకు ఇబ్బందిగా మారిపోయాడు. మా కంపార్ట్ మెంట్ లో ఎవరూ పెద్దగా లేరు. కొద్ది సేపటికి ఏలూర్ స్టేషన్ లో ట్రైన్ ఆగింది. "సర్... మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సర్.. మీరు చాలా బాగున్నారు. మీకు టచ్ లో ఉంటాను. మీకు బానిసలా సేవలు చేస్తాను.ప్లీజ్ సర్" అతను నన్ను వదలలేదు. ట్రైన్ ఇంకా కదలడం లేదు.
  నా బుర్రలో వెంటనే ఒక ఆలోచన వచ్చింది.. "ఒకే మరి నా ఫోన్ నంబర్ ఇస్తాను. నీవు ఎప్పుడు కాల్ చేసినా లేడీస్ వాయిస్ తోనే మాట్లాడాలి. నీ ఒరిజినల్ వాయిస్ తో మాట్లాడితే నీ నంబర్ ఎత్తను ఒకేనా? అతను ఆనందంతో తబ్బిబ్బయ్యి పోయాడు.వెంటనే మా ప్రసాదిగాడి ఫోన్ నెంబర్ ఇచ్చేశాను. అతను ఆనెంబర్ నోట్ చేసుకొని దిగిపోవడం, ట్రైన్ ముందుకు కదలడం ఒక్కసారే జరిగిపోయాయి. "హమ్మయ్యా..అంటూ ఊపిరి పీల్చుకున్నాను.
వారం రోజుల తరువాత మా ప్రసాడుగాడు నాదగ్గరికి పరుగున వచ్చాడు...ఇంతకీ ప్రసాదిగాడికి ఏమి జరిగింది?
(తరువాత పేజీలో


2 కామెంట్‌లు:

 


Popular Posts

Recent Posts