గురువారం, జనవరి 24, 2019

Its-better-to-stay-away-from-being-I-I
మన జీవితకాలంలో ఎంతోమంది వ్యక్తులు పరిచయమవుతూ ఉంటారు. వారిలో కొంతమందితో మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. అయితే కొన్ని,కొన్ని సందర్భాలలో కొంతమంది వలన మనం నష్టపోవడమో , లేక మోసపోవడమో కూడా జరుగుతూ ఉంటుంది. మరికొంతమంది వలనయితే నష్టాలు,మోసాలు జరగకపోయినా మనస్సు మాత్రం విపరీతంగా గాయపడే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే వారి చేష్టలు గాని, మాటలుగాని మనకి ఆ పరిస్థితిని తీసుకొస్తాయి.

మనo పై పరిస్థితులకు గురవ్వకుండా ఉండాలంటే మనకు మనం మనతో ఉన్న ప్రతీ వ్యక్తిని పరిశీలించి జాగ్రత్తతో మెలగాలి. అటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తీ యొక్క గుణం ఏమిటంటే "ప్రతిదీ నావలననే సాధ్యం! నేను మాత్రమే, నేను,నేను..నేను" ఇలా మాటలాడే వాడికి కొద్ది జాగ్రత్తగా ఉండటమే మంచిది.

ఎందుకంటే ఈ వ్యక్తిలో ప్రధానంగా...

1.ఇతరులకు క్రెడిట్ దక్కడం చూడలేడు.
2.తనతో ఉన్న మిత్రుల విషయంలో "నల్గురితో ఉన్నప్పుడు తనను హైలెట్ చేసుకుంటూ అతనిని తక్కువ చేసి పరిచయం చేస్తాడు. లేక తక్కువ చేసి మాట్లాడుతాడు.
3.ఎదుటివాడు ఎంత గొప్పగా చెప్పినా? తాను చెప్పేదే గొప్ప అనే అహంకారం నిలువెల్లా కన్పిస్తుంది.
4.తనేదో ఉద్దరించడానికి సృష్టించబడ్డాననే ఫీలింగ్ కు గురవుతూ ఉంటాడు.
5.ఏ పనీ ఊరికనే చేయడు.సహకరించడానికి అసలు ఇష్టపడడు.
6.ఇతరులకు సహాయం చేసే విషయంలో వెనుకకు పోతూ ఉంటాడు.

      కాబట్టి మిత్రులారా "నేను...నేను" అనే వాడి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అతనితో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండండి. నిజానికి పై లక్షణాలలో కొన్ని లక్షణాలు అందరిలో లేకపోవచ్చు. కాని మిగతా లక్షనాలున్నా జాగ్రత్త అవసరమే కదా! సహజంగా మనకు పరిచయ వ్యక్తులలో ఏవో కొన్ని లోపాలున్నా వారిలో ఉన్న మిగతా మంచి లక్షణాలను బట్టి ప్రేమించడం అలవర్చుకోవాలి. జాగ్రత్త పడాలి తప్ప సంబంధాలు త్రెంచుకోకూడదు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే "మనలో ఈ గుణాలుంటే వెంటనే రూపుమాపుకోవాలి. లేదంటే మనకు ఉండే మంచి మిత్రులందరూ దూరమయ్యి పోవడం ఖాయం" సన్నిహితులు సహించలేక సైడ్ అయిపోవడం విదితమే!!
Its-better-to-stay-away-from-being-I-I



0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts