సోమవారం, నవంబర్ 14, 2016

ఇప్పటివరకూ ఏ ప్రధాని చేయని ఒక సంచలనాత్మక పని మన ప్రధాని నరేంద్ర మోడీ జీ చేసారు. 500రూ//, 1000రూ// నోట్లను రద్దు చేసి, కొత్త నోట్లను ప్రవేశ పెట్టడం వలన పూర్తిగా దొంగ నోట్లను నిరోధించవచ్చు. అయితే దొంగడబ్బు [నల్లధనం] ను పూర్తిగా నిరోధించడం సాధ్యం కాకపోవచ్చు. మనిషిలో నీతి,నిజాయితీ అడుగంటిపోయినప్పుడు ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా సఫలీకృతం కావు. కానీ నరేంద్ర మోడీ గారూ పూర్తీ నిబద్ధతతో తన పని తాను చేసుకుపోవడం భారతదేశానికే శుభసూచకం.

ఇప్పటికే బడా బాబులు తమ వద్ద ఉన్న నల్లడబ్బులను మార్చేసుకున్నారని గట్టి వాదన వినిపిస్తోంది. నల్ల ధనాన్ని నిరోధించడం అనేది చాలా కష్టమని సర్వేలన్నీ చెప్తున్నాయి. 

నరేంద్ర మోడీ వీటిపై శ్రద్ధ ఎక్కువే పెట్టాలి. పేదవాడి కడుపు కొట్టి మెక్కుతున్న ఈ బడాబాబులను రచ్చకీడ్చవల్సిందే. దీని కోసం ఏమి చేయాలి?

ఈసారి నోట్లు బదులు బంగారం దాచుకునే ప్రక్రియ మొదలవుతుంది. ఇదే జరిగితే సామాన్యుడికి బంగారం ధర ఆకాశంలో కనిపిస్తుంది.

ఎందుకంటే పంది - రోత తినడం మానివేయడానికి, మురికిగుంటల్లో దొర్లకుండా ఉండడానికి ఇష్టపడదు. అది దాని నైజం. ఈ నల్ల కుబేరులు కూడా పందిలాంటి వారే! అన్యాయంగా దోచుకోకుండా బ్రతకలేరు. పందిని చంపడానికి ఎంత కష్టపడాలో వీళ్ళ అవినీతిని చంపడానికీ అంతే కష్టపడాలి. ఏదో విధంగా ఈ పనిలో ముందుకు నెట్టుకొస్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి మనం కూడా మన వంతు సాయం చేద్దాం దీనికి మీరేమంటారు?

0 Comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Follow by Email

Popular Posts

Recent Posts