శనివారం, అక్టోబర్ 15, 2016

అక్షరాలు దగ్గర దగ్గరగా మఖ్యంగా 'పొడవుగా' వ్రాసేవారు క్రమశిక్షణగా వున్న వాళ్ళు, సిగ్గు ఎక్కువగా వున్నవాళ్లు, డబ్బు విషయంలో పొదుపరిగనూ అయి వుంటారు. 
* చాలమందికి ఇంధ్రధనస్సు అంటే ఇష్టం. అది కనిపిస్తే కేరింతలు కొడతారు. కొంతమంది చిత్రకారులు దానిని అద్భుతంగా గీస్తారు. ప్రకృతి ఆరాధకులు వాటి కోసం ఆకాశం కేసి చూస్తారు. కానీ, వీరు మాత్రం నివసించేదే ఇంధ్రధనస్సు మీద.
* మీకు లోకం ఆనందంగానూ, రంగురంగుల ఊయలగానూ కన్పిస్తుంది.
* వేరొకరి జోలికి వెళ్లకుండా మీ జీవితం మీరే జీవించాలన్నదే మీ తిరుగులేని అభిప్రాయం 
* తమాషా ఏంటంటే మీరు పూర్తిగా భావుకులు కారు. ప్రపంచంలో మంచి చెడ్డలు మీకు బాగా తెలుసు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా తెలసుకోవటంలో మీ కన్నా సమర్ధులైన వారు లేరని చెప్పొచ్చు.
* సాంప్రదాయాలకు అనుగుణంగా నడవటానికి మీరు ఇష్టపడరు. 
* సాంప్రదాయవాదులైన, పెద్దలను మీ అతినాగరికపు పనులతో ఆశ్చర్యపరచటం మీకెంతో సరదా. 
* మీ చుట్టుపక్కల వాళ్లందరినీ మీరు స్నేహితులగానే భావిస్తారు.
* మీరు ఎంత ప్రాక్టికల్ అంటే, మీ ప్రేయసి/ప్రియుడు నుంచి శాశ్వతంగా విడిపోయే సమయంలో కూడా 'మనం స్నేహంగా వుండలేమా' అని అడిగే మనస్తత్వం మీది. 
*మీ ప్రేమ ఫలించకపోతే అతి నిజాయితీపరులుగా పార్వతో/దేవదాసులైపోరు. మీ పరిశోధనా జిజ్ఞాసను ఆకట్టుకొని అమ్మాయి లేదా అబ్బాయి కనిపించగానే, పాత విషయాలు మరిచిపోయి, మళ్ళీ [నిజాయితీగా] ప్రేమలో పడతారు.
* మీ ప్రేయసికి ఒక విషయంలో మీ పై కోపం రావచ్చు. ఎందుకంటే మీరు ఆవిడపట్ల ఎంత ఆసక్తి చూపుతారో అంటే ఆసక్తిగా మీ ఇంటికి న్యూస్ పేపర్ తెచ్చే అబ్బాయి పైన, ధర్మం చెయ్యమని వచ్చే పేదరాలిపైన కూడా చూపుతారు.
* ఇష్టమైన అభిరుచి అంటూ ఏమి వుండదు. రాజకీయాలు మిమ్మల్నెంతగా ఆకట్టుకుంటాయో, ఆటలు కూడా అంతే ఇష్టపడతారు. ర్యాకెట్లో చంద్రమండలంకి వెళ్ళేవారు, గుర్రం నడిపే వాడు, ఒక నటుడు, సంగీతం వాయించేవాడు, ఒకటేమిటి ప్రపంచంలో అన్ని విషయాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మిమ్మల్ని ఇష్టపడేవారు సాధారణంగా మిమ్మల్ని అర్ధం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. మీకు ఏ అభిరుచిలో అయినా ఇమడ కలిగే శక్తి వుంది.
* కొద్ది మందికి చెడిపోవడం బాగా చేతనవుతుంది కొందరికి బాగుపడటం తెలుస్తుంది. కానీ మీకు చెడిపోవటం ఎంత బాగా తెలుసో బాగుపడడం కూడా అంతే బాగా తెలుసు 
*అపురూమైన ఏదో ఒక గొప్పతనం మీప్రతిచర్యలోనూ ఏదో రూపంలో చోటుచేసుకుంటూ ఉంటుంది. [మీకు నచ్చిన విషయాలన్నీట్లో మీరు ప్రవేశించి, ఎందులో మీ ప్రజ్ఞను నిరూపించుకోగలరో నిర్ధారించుకొని ముందడుగు వేస్తే జీవితంలో మీరు కోరుకున్న సుఖాలు, సౌఖ్యాలు మీ ముంగిట నిలుస్తాయి. మీరు చేయవలసిందల్లా మొహమాటం లేకుండా ప్రవేశించటమే].
* మీరు కాస్త పిరికివారే అయినా, దాన్ని ఎక్కడా బైటపడనివ్వరు. కాబట్టి వీలైనతంగా అదే రకమైన జీవితం గడపడం మంచిది. 
* విమర్శలని ఏ మాత్రం సహించలేరు. ఉదాహరణకి ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కి జెండా పాతబోయే సమయంలో 'ఇంట్లో భార్యకు చీరకొనివ్వలేదు గాని, ఇక్కడకొచ్చి ఎవరెస్ట్ మీద జెండా పాతుతున్నాడురా' అని మీ పోటీదారుడైవారైనా వెక్కిరిస్తే వెంటనే ఆ పర్వతం దిగడం ప్రారంభించేస్తారు. మీ విజయానికి గుర్తుగా జెండా పాతాలనే ఉత్సాహం అప్పుడే చచ్చిపోతుంది. మీరు ఆడవారైతే మీ స్నేహతురాలు ' ఈ చీరె నీకు బాగోలేదే' అంటే ఆ చీర పెట్టె అడుక్కి వెళ్లిపోవాల్సిందే 
* వింత వింత కలలు కంటూ నిద్రపోవడం, వాటి గురించి దిగులు పెట్టుకోవటం కూడా మీ ప్రవర్తనలో సర్వసాధారణం 
* ఏదో జరగబోతుంది అని మీరు అనుకున్నారంటే, సర్వసాధారణంగా నూటికి యాభై సార్లు అది జరుగుతుంది ఉదాహరణ కి మీ అబ్బాయి బైక్ మీద బైటకు వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళొద్దు అని చెప్తే వెళ్లకపోవటమే మంచిది. ఎందుకంటే ముందే  చెప్పినట్లు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సస్ ఏభైశాతం. 

2 వ్యాఖ్యలు:

  1. .... యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సస్ ఏభైశాతం. ......

    అస్సలు సరికాదండి. అనేకసార్లు ఒకవ్యక్తి బయటకు వెడితే సగటున సగం సార్లు ప్రమాదం జరుగుతుం దంటున్నారు. చాలా భయంకరమైన తప్పు. అదే సూత్రీకరణ ప్రకారం ఒక రోజున అసంఖ్యాకులు బయటకు వెడితే (రోజూ‌ జరిగేది అదేగా) వారిలో ఆరోజున సగటున సగం‌ మందికి ప్రమాదం జరగాలి. అంత భారీసంఖ్యలో ప్రమాదాలు జరుగుతాయా? జరగవు కాక జరగవు కదా. సరే మీరు వాదనకు అలా రోజూ ఈ‌ అసంఖ్యాకుల్లో‌ సగం మంది ప్రమాదాల బారినపడితీరతారని సిద్ధాంతం చేస్తే అలా ప్రమాదాల బారినపడటం‌ అంటే ఏమిటో‌ ఒక చిన్న లెక్కద్వారా పరిశీలించి చూదాం.

    ఒకఊళ్ళో 10000 మంది ఉన్నారు. వారిలో‌ సగం‌ జనం అంటే 5000 మంది బయటకు వెళ్ళగా మీ లెక్క ప్రకారం 2500 మంది క్షతగాత్రులయ్యారు. మరునాడు 10000 - 2500 = 7500 మందిలో సగం‌ మంది అంటే 3750 మంది బయట తిరిగితే వాళ్ళలో 1875 మందికి ప్రమాదం‌ జరిగింది... ఇలా కొనసాగితే ఏం జరుగుతుంది? సరిగ్గా 33వ రోజున ఆ ఊళ్ళో మిగిలిన ఒక్కడూ‌ చచ్చి ఊరు శూన్యం అవుతుంది. అదే లెక్కప్రకారం లక్షమంది ఉన్న పట్టణం ఐతే 41వ రోజున ఖాళీ. కోటిమంది ఉన్న హైదరాబాదు లాంటి మహానగరం ఐతే 57వ రోజున జనశూన్యం అవుతుంది.

    అందుచేత దయచేసి అశాస్త్రీయమైన ఊహాగానాలను టపాలో నిజం అన్నట్లు వ్రాయకండి. మీ‌ మనస్సుకు పట్టటం కోసం ఉదాహరణపూర్వకంగా విశదీకరించవలసి వచ్చింది.

    ప్రత్యుత్తరంతొలగించు

Follow by Email

Popular Posts

Recent Posts