శుక్రవారం, మే 20, 2016

Adsense ద్వారా అంత సంపాదించండి,ఇంత సంపాదించండి అనే ప్రకటనలు విని నేను కూడా ఒక సంవత్సరం క్రితం Youtube ఛానెల్ ఒకటి క్రియేట్ చేసి ఇప్పటికి ఏప్రియల్ ి౩౦ కి 100 డాలర్లు సంపాదించాను. కొంతమంది మిత్రులను అడిగితె ఈ నెల అంటే మే 27 కి బ్యాంక్ కు వచ్చేస్తాయి అంటున్నారు. అప్పటివరకూ వెయిట్ చేస్తాను తప్పదునేను కొత్త,కొత్త షార్ట్ ఫిలిమ్స్,డాక్యుమెంటరీలు తీస్తాను.గూగుల్ కంపెనీ నిజాయతీ ఏమిటో త్వరలోనే తెలుస్తుందన్న మాట! డబ్బులోస్తే మీకు కూడా చెప్తా లెండి. నిజమైతే మీరు కూడా ఆ దిశగా ప్రయాణం మొదలుపెడుదురు.ఏమంటారు?

2 కామెంట్‌లు:

  1. ఈ విశ్వానికి ఆ భగవంతుడు ఎలాగో .. ఈ వెబ్ ప్రపంచానికి గూగుల్ దేవుడు అల్లాగ. ఆ దేవుడిని మోసం చేయనంతకాలం మన డబ్బులు ఎక్కడికీ పోవు . గ్యారంటీగా వస్తాయి . మనలో నిజాయితీ ఉంటె గూగుల్ కూడా నిజాయితీ గానే ఇస్తుంది . ఇది ఎందుకు చెపుతున్నానంటే - ఈ మధ్యనే ఒకతను దాదాపు 2 లక్షలు పైచిలుకు మనీతో నెలకు దాదాపు 30,000 పైన సంపాదిస్తున్న ఒక గూగుల్ న్యూస్ అప్రూవ్ద్ వెబ్ సైట్ కొన్నాడు . మరింత సంపాదించాలని అతను కొంతమందిని రచయితలుగా నియమించుకున్నాడు జీతానికి . మొదటి నెల మంచి రిజల్ట్స్ వచ్చాయి . ఇక మరుసటి నెల తన అకౌంట్ లో దాదాపు 50,000 ఉండగా ఆ సైట్ ఆడ్ సెన్స్ అకౌంట్ బ్లాక్ అవడమే కాదు , ఆ వెబ్ సైట్ గూగుల్ రిజల్ట్స్ లోనే లేకుండా పోయింది. తీరా తెలిసిందేమంటే ఆయా రచయితలు కాపీ పేస్టు చేసేవారట. కనుక గూగుల్ ద్వారా సంపాదించాలంటే మనం ముందు నిజాయితీగా ఉండాలి ..
    ఆల్ ద బెస్ట్ చౌదరి గారూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా యాడ్ సెన్స్ డబ్బులు రాకపోవాలి? మీసంగతి చెప్తాను శ్రీనివాస్ గారూ!:)

      తొలగించండి

 


Popular Posts

Recent Posts