బుధవారం, మార్చి 30, 2016


బుధవారం, మార్చి 23, 2016


శనివారం, మార్చి 19, 2016


మంగళవారం, మార్చి 15, 2016

More Videos : Sakshyam TV

శుక్రవారం, మార్చి 11, 2016

బ్లాగు మిత్రులారా ఈక్రింది వీడియో చూస్తే మీరు నవ్విపోక తప్పదు. రోజాగారికి,ఆనం వివేకానందారెడ్డి గారికి మధ్య పెద్ద కామెడీ పైటింగ్స్ నడిచాయి. మొత్తానికి ఏ పార్టీ అయినా ప్రజలకు చేసేది ఏమీ లేదు కాబట్టి ఓటులేసి గెలిపించినందుకైనా కామెడీలతో కాస్త మనసుకు హాయి కలిపిస్తున్నందుకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలేమో! ఏది,ఏమైనా ఈవిధంగానైనా ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ కలిపిస్తే చాలనుకుంటా!More Videos : "Sakshyam TV"

గురువారం, మార్చి 10, 2016

ఈక్రింది వీడియో చూడండి. ఒకరికొకరు బూతులు తిట్టుకునే వీళ్ళు ప్రజల సేవకులా? ఎవరైనా నమ్మగలరా?

బుధవారం, మార్చి 09, 2016

నేటి రాజకీయాలు అలాగే ఉన్నాయి. కలర్ కోసమో, లేక కొత్త ఉత్సాహం రావడం కోసమో తెలీదు గాని అన్నీ రాజకీయ పార్టీలు సినిమా యాక్టర్లకు పార్టీ టికెట్స్ ఇచ్చి ప్రజల నెత్తి మీద పీఠం వేసి కూర్చోబెడుతున్నాయి. పాపం ఆ సినిమా యాక్టర్ కాస్తా రాజకీయ నాయకుడు అయిపోయినా సినిమాలో భారీ డైలాగులతో మోతమోగించే అలవాటు నుండి తేరుకోలేక అదే సినీ ఒరవడిని ప్రదర్శిస్తూ అప్పటి వరకూ అంటే సినిమా ప్రపంచంలో సంపాదించుకున్న నేము,ఫేము మొత్తం దిగజార్జుకుంటున్నారు. సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం. దానిలో జరుగుతున్న బాగోతాలు చదువుకుని నవ్వుకునో,తిట్టుకునో వీళ్లింతే వీళ్ళ ప్రపంచమూ ఇంతే అనుకుంటూ వదిలేస్తారు జనాలు. కానీ రాజకీయ రంగం అటువంటిది కాదు. దీనిని ఎంత కంపు,రొంపు అని విమర్శించినా దేశ భవిష్యత్, ప్రజల భవిష్యత్తు దీని పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రంగంలో కొచ్చిన తరువాత  ఒళ్ళు దగ్గర పెట్టుకోక పోతే ఏదో ఒక రోజు ప్రజలు గట్టి బుద్ధి చెప్పి అధః పాతాళానికి తోక్కేస్తారు. కాబట్టి ఏ నాయకుడైనా సరే  ప్రజలకి ఒంగి ఉండాల్సిందే! 

       ఇవేమీ తెలియని సినిమా యాక్టర్స్ ని అనవసరంగా రాజకీయాలలోకి లాగి డాన్స్ వేయిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. దానికి ఉదాహరణ రోజా గారే! ఆమె ఏనాడూ తన సొంత నియోజకవర్గం గూర్చిన అభివృద్ధి మాటే ఎట్టలేదు. ఎప్పుడు చూసినా టి‌విలలో,పేపర్లలో వాల్లనూ,వీళ్ళనూ తిడుతూ,విమర్శిస్తూ కాలం గడుపుతోంది. ఆమె పరిస్తితి ఒక సంవత్సరం పాటు అసెంబ్లీలోకి అడుగు వేయడానికి కూడా వీలు లేనట్టుగా శిక్ష వేయించుకుంది. ఆమె ఏ పార్టీ ఉన్నా అలానే ప్రవర్తిస్తూ వస్తోంది. ఆమె ప్రజా ప్రతినిధేమిటో అర్ధమై చావడం లేదు.

      ఇక పోతే చిరంజీవిగారు. "ప్రజారాజ్యం" పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిపేసి మినిష్టర్ పదవి పూర్తిగా అనుభవించకుండానే ప్రజలలో లేకుండా ఒక మూలకు పోయాడు. ఇక ఆయనగారి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రంగంలో దిగి ఎక్కడ ఏమి జరిగినా నాలుగు సినిమా టైపు డైలాగులు వదిలేసి పోతున్నాడు. పాపం ఇంతకు మించి ఈయనగారికి శీను లేదని కోడరి అభిప్రాయం.

       ఇంకా ఇప్పుడు రాజకీయ నాయకుల వలకు బలయిన వాళ్ళలో బాలకృష్ణ ఒకరు. పాపం రాజకీయాలో కొచ్చినా తను హీరోనే అనుకున్నాడో,ఏమో కొన్ని భారీ (భయంకరమైన) డైలాగ్స్ వదిలి కొంప మీదకు తెచ్చుకున్నాడు. ఎటువంటి వివాదంలోకి రాకూడని పరిస్థితులలో పెద్ద వివాదాన్నే మీదేసుకున్నాడు. అభిమానుల్లో గుండెల్లో సింహం లా ఉన్నవాడు అభిమానులు సైతం చీదరించుకునే పరిస్తితి తెచ్చుకున్నాడు.

     ఈనాటి తరంలో ఇలా ఎందరో ఉన్నారు. అయితే కొంతమంది రాజకీయాలలో ఇమిడిపోయినా వాళ్ళందరూ పెద్ద కీలక పదవులు పొందక పోవడం విశేషం. ఎన్.టి.ఆర్.ఏం.జె.ఆర్ ల కాలం కాదిది. కాబట్టి రాజకీయ నాయకుల ప్రలోభాలకు మురిసిపోయి రాజకీయాలలో కొచ్చి అభిమానుల హృదయాలలో స్థానాన్ని పోగొట్టుకోవద్దని సినిమా యాక్టర్లందరికీ మనవి.

సోమవారం, మార్చి 07, 2016

ఈమధ్య సినీ హీరో MLA నందమూరి బాలకృష్ణ గారు తన లోపలి ఫీలింగ్సును చాలా దారుణంగానే ప్రకటించేశారు. స్త్రీల పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేకుండా దారుణంగా వ్యాఖ్యానించాడు. ఒక గౌరవ పదమైన పదవిలో ప్రజా ప్రతినిధుడిగా ఉన్న బాలకృష్ణ స్త్రీల పట్ల అసభ్యంగా వ్యాఖ్యానించడం చాలా దారుణం. అమానుషం. సినిమాలలో స్త్రీల గురించి గొప్ప,గొప్ప భారీ డైలాగులతో అదరగొట్టే బాలకృష్ణ నిజ జీవితంలో స్త్రీల పట్ల ఇంత అసభ్యకరంగా ప్రవర్తన కలిగియుంటాడా అని ఈ క్రింది వీడియో చూస్తే మీరు నివ్వెరపోక తప్పదు.

నేను ఉంటున్న రూమ్ కి ప్రక్కనున్న ఇంటి వారు క్రైస్తవులనుకుంటా! ప్రతిరోజూ ఉదయమే ఎవరో విజయప్రసాద్ రెడ్డంట..ఆయనగారి ప్రసంగాలు ఫుల్ సౌండ్ తో పెడుతుంటే నా రూమంతా అదురులతో మారుమోగిపోతుంది. బహుశా నన్ను క్రైస్తవంలోకి ఆహ్వానించడం కోసం కాబోలు. అంతకు ముందు కొన్నిసార్లు ఒక అబ్బాయి అన్నయంటూ వచ్చి యేసు దేవుడని,మనందరికోసం ప్రాణం పెట్టాడని ఏవో పాస్టర్లు దండుకోవడానికి కల్పించిన నాలుగు కల్పిత బోధనలు తీసుకొచ్చాడు. నేను బైబిల్ మధ్యలో పెట్టి అవ్వన్నీ చూపించు అనేటప్పటికి అక్కడి నుండి తెలివిగా జారుకున్నాడు. మళ్ళీ నాదగ్గరకు రావడానికే భయపడుతున్నాడు. ఇక తన వల్ల పని అవ్వదనుకున్నాడో,ఏమో ఆ విజయ ప్రసాద్ రెడ్డి అనే పాస్టర్ ప్రసంగాలతో మారుమోగిస్తున్నాడు. ఆ పాస్టర్ బోధనలు ఒకసారి విన్నానో, లేదో అన్నీ జంతర్ మంతర్ బోధనలే. ఒకదానికొకటి సంబంధం ఉండి చావదు. తలపోటు పెరిగిపోతుంది. వేసిన కేసట్టే వేసి,వేసి విసిగిస్తుంటే వీళ్ళు ఇంత మూర్ఖులా అనిపిస్తోంది. ఏదో ఒకరోజు బైబిల్ చేత బట్టుకుని వాళ్లెంటికే వెళ్ళి గట్టిగా ఇవ్వక తప్పదనిపిస్తోంది.

ఆదివారం, మార్చి 06, 2016

సరదాగా ఒకసారి రాశి ఫలాలు చూద్దామని ఈనాడు చూశాను, అందులో ఉన్న నారాశి ఫలం చూసి సంతృప్తి చెందలేకపోయాను. సాక్షిలో పరీక్షించుకుందామని వెదికితే "రాశి ఫలాల శీర్షిక పైన ఈనాడు రాశి ఫలాలన్నీ శుద్ధ తప్పని ఉంది. పోనీలే సాక్షిలో నైనా నా రాశి ఫలం బాగుందేమనని చూస్తే ఈనాడు కన్నా అద్వాన్నంగా ఉంది. ఏమి అర్ధం కాక రెండు పేపర్లు చించి పారేసి నిజాలు నిగ్గసిగా వ్రాసే కొత్త పేపరు కోసం వెదకడం ప్రారాభించాను. ఒక పేపరూ లేదు. బహుశా ఈ రాష్ట్ర ప్రజల గతి ఇంతేనేమో!

శనివారం, మార్చి 05, 2016

బుధవారం, మార్చి 02, 2016

రాత్రి మనువు గారి బ్లాగు చదువుతున్నప్పుడు ఆయన గారు వ్రాసిన టపా ఒకటి చాలా ఆశ్చర్యం కలిగించింది. పూర్తి వివరాలు ఆయనగారి బ్లాగు చూడండి. ఇంతకీ విషయమేమిటంటే ఒకామె తనపై అత్యాచారం చేయబోయిన వాడి మర్మాంగాన్ని కోసేసిందట. వాడు లబోదిబో మని హాస్పటల్ కి పరుగుతీస్తే ఎవరూ పోలీస్ కేసు లేకుండా జాయిన్ అవ్వడానికి వీలు లేదనేటప్పటికి తప్పనిసరి పరిస్థితిల్లో పోలీసు స్టేషన్ వెళ్ళి ఏదో కహానీ అల్లి పోలీసుల ద్వారా హాస్పటల్లో జాయిన్ అయ్యాడు. తీరా పోలీసులు కూపీ లాగేటప్పటికి అసలు వ్యవహారం బయటికొచ్చి అందరూ అవాక్కయ్యారు. ఆ ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి లోపల వేయడానికి సన్నాహాలు చేశారు.
        నా ఉద్దేశ్యం ప్రకారం స్త్రీలందరూ ఈ పద్ధతిని అవలంబిస్తే బాగుంటుంది అనిపిస్తోంది. బలయ్యి కోర్టుల కెళ్లినా, పోలీసు స్టేషన్ల కెళ్లినా సరైన న్యాయం జరగడం లేదు. కాబట్టి ఇటువంటి మృగాల మర్మాంగాలను కోసి పారేస్తే దరిద్రం వదిలిపోతుంది. సమాజంలో విలువ లేకుండా పోతుంది. శీలం లేని ఆడదానికి ఎలా విలువ లేదో మగతనం కోయించుకున్న దరిద్రులకు అటువంటి పరిస్థితే ఉంటుంది.
      మహాప్రవక్త ముహమ్మద్(స)వారు ఇటువంటి వారిని రాళ్ళతో కొట్టి చంపేయమన్నారు. కనీసం అది అమలు చేసే అవకాశం మన దేశంలో ఎలాగూ లేదు కాబట్టి, పోలీసు కేసు పెట్టి,కోర్టుల చుట్టూరా తిరిగి సరైన న్యాయం దొరక్క కుమిలిపోవడం కంటే ఈ రాక్షస మృగాల మర్మాంగాలను కోసేసి వేలాడ దీయడం చేస్తే కొన్నాళ్ళకు స్టీల వంక చూడడానికే భయపడతారు. తనపై అత్యాచారం చేయబోయిన వారిని చంపినా చట్టం శిక్షించే అవకాశం కూడా లేదు.

మంగళవారం, మార్చి 01, 2016

నేను ఆలోచించనే లేను. ఇసుక ఫ్రీ అన్నారని ఆనందపడిపోయాను. ఇంతకీ ఇసుక ఎవరికి ఫ్రీ అండీ? దళారులకా? ప్రజలకా?...బహుశా దళారులకే ఫ్రీ అవుతుంది లెండి. ఎందుకంటే ప్రజలేమీ ఇసుకను తవ్వి తెచ్చుకునే పరిస్తితి లేదుకదా? ఒకవేళ తెచ్చుకోవాలనుకున్నా ట్రావెలింగ్ సర్వీసు ఖర్చులు షరా మామాలే! మధ్యస్థ కుటుంబాలు కట్టుకునే చిన్న,చిన్న గుడిసెలకు అంతగా ఇసుక ఫ్రీ వార్త విని ఆనందపడడు లెండి. పెద్ద,పెద్ద బిల్డింగ్స్ కట్టుకునే మహానుభావులకి మాత్రం భలే వరమంటే నమ్మండి. వై‌ఎస్‌ఆర్ కూడా రైతు రుణమాఫీలు పెట్టి లక్షలకు లక్షలు  అప్పులు లేకుండా చేసినప్పుడు ఎకరాలకు ఎకరాలు పొలాలున్న రైతుల అప్పులన్నీ ఉష్ కాకి అయ్యిపోయాయి. వారికి చక్కగా కౌలు రైతునుండి కౌలు డబ్బులు,రుణమాఫీ డబ్బులు భలే వస్తుండేవి. కౌలు రైతులు మాత్రం అప్పులు ఉష్ కాకి అవ్వడానికి సొంత పొలాలు లేక పాపం నెమ్మదిగా తీర్చుకోవాల్సి వచ్చింది. ఆలోచిస్తూ ఉంటే ఇసుక ఫ్రీ పధకం అటువంటిదే కాబోలు అనిపిస్తోంది. దీనిని బట్టి అర్ధమయ్యేదేమిటంటే బడా బాబులను తప్ప పూరీ గుడిసె ప్రజలను ఏ ప్రభుత్వమూ రక్షించలేదని అర్ధమవుతుంది.

Follow by Email

Recent Posts