శుక్రవారం, సెప్టెంబర్ 16, 2016

కాకినాడ వివేకానంద పార్క్ లో కూర్చుని ఉన్నాను. టైం 7PM అవుతూంది.
ఇంతలో బైక్ మీద వేగంగా వచ్చిన కానిస్టేబుల్ నాకు దగ్గరలో బెంచీ పై కూర్చుని ఆ చీకట్లో కబుర్లు చెప్పుకుంటున్న ఒక జంట దగ్గరికి వెళ్లాడు. వాళ్ళు లవర్స్ అనుకుంటా కానిస్టేబుల్ ను చూడగానే భయపడిపోయారు. లేచి నిలబడిపోయారు.
కానిస్టేబుల్ ఏదో అడుగుతున్నాడు. వాళ్ళు ఏదో బ్రతిమిలాడుతూ చెపుతున్నారు.
ఆ పోలీసాయన వినిపించుకోవడం లేదు. అక్కడి నుండి నడవండి అన్నట్టు కంగారు పెడుతున్నాడు.
ఆ అమ్మాయి బిక్క చచ్చి పోయి చూస్తోంది. అబ్బాయి కానిస్టేబుల్ ను బ్రతిమిలాడుతూనే ఉన్నాడు.
చివరికి ఆ అబ్బాయి పర్సులోంచి కొంత డబ్బు కానిస్టేబుల్ కి ఇచ్చేసాడు.
కానిస్టేబుల్ ఆ డబ్బులు తీసుకుని మరొక జంటను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు.
నేను లేచి అటు వెళుతూ ఆ అబ్బాయిని ఆపోలీసోడు ఎంత గుంజాడు నీ దగ్గర అని అడిగాను.
దానికి ఆ అబ్బాయి తెగ బాధపడిపోతూ "1000రూ// సర్! ఎంత బ్రతిమిలాడినా తగ్గించలేదు. స్టేషన్ కొస్తే 5000 అవుతుంది. ఇక్కడ అయితే 1000 రూ అవుతుంది. తరువాత నీ ఇష్టం అన్నాడు. ఎందుకొచ్చిన గొడవని ఇచ్చేసాను. అనవసరంగా ఈ రోజు వెయ్యి రూపాయలు బొక్క, ఎవరి ముఖం ప్రొద్దుటే చూసానో అంటూ తెగ వాపోయేడు.
ఆ అమ్మాయి సిగ్గుతో తల దించుకుని బెంచీకి అటు తిరిగి కూర్చుని ఉంది.
నేను ఆ అమ్మాయిని పిలిచి ' అమ్మా నీ లవర్ వెయ్యి రూపాయలు పోయాయని తెగబాధ పడిపోతున్నాడు. నీవు ఇంటికెళ్ళాక మీ నాన్నగారిని నీ లవర్ 1000రూ ఇచ్చేయమని చెప్పు ,అతని నష్టంలో ప్రధాన భాగాస్వామివి నీవే కదా?" అంటూ అక్కడ నుండి వచ్చేసాను.
ఆ మాట అన్నందుకు వాళ్ళు నా మీద కోపపడి తిట్టుకున్నారో,లేదో నాకు తెలియదు గాని ఆ అమ్మాయి సిగ్గుతో బిగిసుకుపోవడం మాత్రం గమనించాను.

మంగళవారం, సెప్టెంబర్ 13, 2016

ఉత్తమ పెంపకం అంటే, కన్నవారికి వారి బిడ్డలకూ మద్య ఒక గొప్ప అనుబంధం ఉండడం. ఈ కింద పేర్కొన్న కొన్ని చిట్కాలు మీకు మీ పిల్లలతో ఒక చక్కని అనుబందం ఏర్పడటానికి తోడ్పడతాయి.

* బేషరతు ప్రేమ పంచండి.
     మీ పిల్లలు పసి పిల్లల్లా, ప్రీ-స్కూలర్లలాగా ఎప్పటికీ ఇలాగే ఉండిపోరు. కాలం చాలా వేగం వెళుతూనే ఉంటుంది. ఈ రోజున ఉన్న ఈ పిల్లలు రేపటికి పెరిగి పెద్దవాళ్లవుతారు. అయితే, స్వతహాగా మీరు కూడా మీ పిల్లలు మరింతగా ఎదగడానికి మీ వంతు ప్రోత్సాహం, అందిoచాలి. తల్లిదండ్రులు ఉన్నంతలో పిల్లలతో అత్యధిక సమయం గడిపేది బాల్యంలోనే బాగా సన్నిహితంగా గడిపేది కూడా ఈ కాలంలోనే. అయితే వారు కాస్త పెద్ద వారై, టీనేజర్ వయసుకు వచ్చేస్తే, వారి జీవిత కార్యకలాపాల్లో వారు తలమునకలైపోతాయి. అందుకే ఆ పసి వయసులో వారితో కలిసి సాద్యమైనంత ఎక్కవ సమయం ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలి. అప్పుటి ఆ తీయని జ్ణాపకాలను ఎప్పటికీ గుండెలో భద్రంగా ఉంచుకోవాలి. మీ పిల్లలన్నీ మీరు నిరంతరం ప్రేమిస్తూనే ఉంటారు. కానీ, మీరు మీ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి తెలిసోచ్చేలా వ్యవహరించండి.

* పిల్లల మనసుల్లోంచి 
    మీ పిల్లలు ఎప్పుడైనా మీమ్మల్ని అసహనానికి గురి చేసే సందర్బాలు ఉండవచ్చు. అయితే వాళ్ల స్థానంలో కూర్చుని ఆలోచిస్తే, ఆ అసహనమేమీ రాదు. అలా అనుకోవడానికి మీ బాల్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండీ. ఆ బాల్యంలో మీరు కూడా దాదాపు ఇలాగే ప్రవర్తించి ఉంటారు. మీ బాబు కొద్ది రోజులు తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటానంటే ఇప్పుడు మీరు అభ్యంతరం చెప్పవచ్చు. కానీ, మీ బాల్యంలో మీలో కూడా అలాంటి కొరికలే ఉండవచ్చు. అందుకే పిల్లల కోణంలోంచి ఆలోచించినప్పుడే పిల్లల్ని బాగా అర్ధం చేసుకోగలుగుతాం. వాళ్ల మనసును నొప్పించకుండా వ్యవహరించగలుగుతాం.

* ఎవరి మీదా ఆధారపడకుండా 
     పిల్లలకు తల్లిదండ్రులే అన్నీ చేసిపెట్టే విధానం ఎక్కువ హానికరమైనది. దీనివల్ల పిల్లలు ప్రతి దానికీ తల్లిదండ్రుల మీదే ఆధారపడే స్థితికి చేరుకుంటారు. ఆ పరిస్థితి రాకుండా, కొన్ని చిన్న చిన్న పనులు వారికి అప్పగించి ఎవరి సహకారమూ తీసుకోకుండా ఆ పని పూర్తి చేయమని చెప్పాలి. వాళ్ల పనులు వాళ్లే చేసుకోగలిగే ఈ వైఖరి వల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తన కాళ్ల మీద తాను నిలబడే తత్వం పెరుగుతుంది.     

సోమవారం, సెప్టెంబర్ 12, 2016

ఈమాట అన్నందుకు మహిళా మణులు నన్ను విమర్శించవచ్చు. అయినా ఏం పర్లేదు. ఎందుకంటే ఈరోజు అత్యధికంగా పురుషులు నరకయాతన అనుభవించేది, మానసికంగా క్రుంగిపోయేది కేవలం స్త్రీ వలన మాత్రమే.నిజానికి స్త్రీ తన జీవితంలో అనేక పాత్రలు ధరిస్తుంది. అందులో అతి పవిత్రమైనది, మాటలతో వర్ణించలేనిది ఒక్క తల్లి పాత్ర మాత్రమే. దీనికి మాత్రమే స్త్రీ నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చుతుంది. మిగతా అన్ని పాత్రలకు అన్యాయం చేసేదే! పురుషునికి నరకయాతన చూపించే ప్రధాన అస్త్రం భార్య పాత్ర. నాకు తెలిసి ఈ పాత్రకు చట్టాల అనుమతి కూడా ఉంది. ఆమే  తప్పు చేసి ఆమే కోర్టు కేక్కితే మన భారత చట్టాలన్నీ ఆమెకు మాత్రమే సహకరిస్తాయి. పురుషుడు మాత్రం నిలువునా అన్యాయంలో మునిగిపోవాల్సిందే.

         పురుషునితో సమాన హక్కులు కోరుకునే స్త్రీ మణులు సమాన చట్టాలకు ఎందుకు సహకరించరో? పురుషునితో సమానమని విర్రవీగుతున్న స్త్రీలు బయట మృగ పురుషులకు బలవ్వుతున్న దాఖలాలెన్నో. నిజానికి స్త్రీ తన పురుషున్ని అర్ధం చేసుకోవడం కంటే అపార్ధం చేసుకోవడానికే పని చేస్తుంది.

      అందుకే అనుకుంటాను కొంతమంది మహానుభావులు స్త్రీ గూర్చి ఇలా హెచ్చరించారు.
1.స్త్రీ నీడ లాంటిది. పట్టుకోవాలంటే దొరకదు. పట్టించుకోవడం మానివేస్తే నీ వెనుకే తిరుగుతుంది.
2.స్త్రీ నది లాంటిది దొర్లించుకుంటూ పోయి సముద్రంలోకి విసిరివేస్తుంది.
౩.స్త్రీ మనస్సు అద్దంతో సమానం,పగిలితే అతకదు అన్న మాట పచ్చి అబద్ధం.  ఇది కేవలం పురుషునికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే చరిత్రలో అన్యాయానికి గురైంది పురుషులే. ఉదా:కు పార్వతి,దేవదాసుల్లో దేవదాసే పోయాడు. లైలా,మజ్నూలలో మజ్నూయే పోయేడు.
         అందుకనే స్త్రీ పట్ల పురుషుడు జాగ్రత్త వహించాలి. ఆదమరచియుంటే మనం మటుమాయమవ్వడం ఖాయం.మనకందరికీ స్త్రీ నుండి రక్షణ లభించుగాక! శుభం!!!

ఆదివారం, సెప్టెంబర్ 11, 2016

9-9-2016 తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలంటూ ద్వజమెత్తారు. జాతీయ పార్టీ అయిన బిజెపిని ఘాటుగానే విమర్శించారు. ఈ పబ్లిక్ మీటింగ్ లో ఇద్దరు యువకులు కూడా అసువులు బాసారు. ఇంతకీ పవన్ ఏం మాట్లాడాడు? ఏ విషయాలు తెలియజేసాడు? ఆయనిచ్చిన దిశానిర్దేశం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ భాగాలు మాదిరిగా మీ ముందు పెడతాను. మీకు వీలయితే వీక్షించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవ భాగం ( Part :2).
Part : 2

9-9-2016 తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలంటూ ద్వజమెత్తారు. జాతీయ పార్టీ అయిన బిజెపిని ఘాటుగానే విమర్శించారు. ఈ పబ్లిక్ మీటింగ్ లో ఇద్దరు యువకులు కూడా అసువులు బాసారు. ఇంతకీ పవన్ ఏం మాట్లాడాడు? ఏ విషయాలు తెలియజేసాడు? ఆయనిచ్చిన దిశానిర్దేశం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ భాగాలు మాదిరిగా మీ ముందు పెడతాను. మీకు వీలయితే వీక్షించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొదటి భాగం (First Part :1).
First Part : 1

శుక్రవారం, సెప్టెంబర్ 09, 2016

తిరుపతి పబ్లిక్ మీటింగ్ లో ఊదరగొట్టిన పవన్ ఈరోజు కాకినాడలో ఊదరగోట్టడానికి వస్తున్నాడు. రాజకీయ పార్టీలన్నీ లబో,దిబో మంటున్న లభించని ప్రత్యేక హోదా కేవలం అక్కడా,ఇక్కడా పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రసంగాలు పెట్టడం వలన లభిస్తుందా? పవన్ తీరు చూస్తుంటే పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్టు ఉంది. ఈమధ్య పవన్ జరుగున్న ప్రతి చిన్న సంఘటనకు మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నాడు.
       నిజానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పట్ల, ఆంద్ర భవిష్యత్ పట్ల ఆందోళన,చిత్తశుద్ది ఉంటే "ఆమరణ నిరాహార దీక్ష" చేయాలి. అప్పుడు పవన్ చేపట్టిన ఉద్యమంలో చలనం వస్తుంది. దేశంలో కదలిక వస్తుంది. అంటే గాని అక్కడక్కడ మీటింగులు పెట్టి ఏవేవో మాట్లాడి వెళ్ళిపోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు.
      రేపొద్దున్న జగన్ అండ్ మిగతా పార్టీ వాళ్లు చేసే బంద్ వలన కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు.

శుక్రవారం, ఆగస్టు 26, 2016

అందమైన తెల్లటి గులాబీని చూసి ప్రేమలో పడిన ఓ మంచి మనస్సున్న తుమ్మెద... ఆ తెల్లటి గులాబీని చేరుకోవాలని ప్రయత్నిస్తుంటే గులాబీ క్రింది ముల్లు దానిని గాయం చేయడం ప్రారంభించాయి.
     పాపం తుమ్మెద ఆ గాయాలలో గులాబీని చేరుకున్నప్పుడు తుమ్మెద గాయాల తాలూకు రక్తం తెల్ల గులాబీకి అంటుకున్నాయి.
    తెల్ల గులాబీ నా వాళ్లే తుమ్మెదను గాయపర్చారని గ్రహించక అపార్ధం చేసుకుని నా తెల్లటి అందాన్ని చూసి ఓర్వలేక ఎర్రరంగు పులిమి నాశనం చేస్తుందని తుమ్మెదను ఈసడించుకోవడం ప్రారంభించింది.

Recent Posts