సోమవారం, జూన్ 22, 2020

చైనా వస్తువులు వాడని వాడు దేశ భక్తుడు? వాడే వాడు దేశద్రోహి!

is-china-devotee-of-goods-hes-traitor
భారత్-చైనా యుద్దమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో కొంతమంది రాజకీయ ప్రముఖుల నినాదం ఏమిటంటే.. "చైనా వస్తువులు వాడని వాడు దేశ భక్తుడు? వాడే వాడు దేశద్రోహి!" అని.

నిజానికి ఇది వినడానికి చాలా గమ్మత్తుగా ఉంది. నిజమే కదా చైనా వస్తువులు వాడటం మానేస్తే చైనా ఆర్ధిక పరిస్థితి పడిపోయి అప్పుల ఊబుల్లో కూరుకుపోయి సర్వనాశనం అయిపోతుందని కొంతమంది మేధావులు ఊదరగొడుతున్నారు. ఇది ఎంత వరకూ నిజమనేది నాకయితే తెలీదు గాని.. యుద్ధానికి రెడీ అయిన చైనా మాత్రం ఈమాత్రం నష్టాన్ని అంచనా వేయకుండా ఉంటుందా అన్నది నా సందేహం. 

ఇకపోతే పై విషయం వదిలేద్దాం.. ఎందుకంటే చైనా కొచ్చే నష్టాలతోనూ, కష్టాలతోనూ ఆలోచించాల్సిన పనిలేదు. ఇప్పటికే చైనా తీసుకొచ్చిన కరోనాకి ప్రపంచమే అంధకారంలోకి పోతోంది.
ఇప్పుడు అసలు విషయానికొద్దాం "చైనా వస్తువులు వాడని వాడు దేశ భక్తుడు? వాడే వాడు దేశద్రోహి!" అనే నినాదం ఎలా ఉందంటే "మద్యం..లేక సిగరెట్ త్రాగటం ఆరోగ్యానికి హానికరం లాంటి రాతలు మన మందుబాటిళ్ల మీద, సిగరెట్ పెట్టెల మీద ఉంటుంది కదా అలా ఉంది. ఎందుకంటే సిగరెట్, మందు ఆరోగ్యానికి హానికరం అయినప్పుడు అవి మార్కెట్ లోకి ఎందుకు వదులుతున్నారు. ఆయా కంపెనీలను ఎందుకు తీసి పారేయడం లేదు? అంటే ఇదంతా ఒక డ్రామా తప్ప వ్యాపారం మాత్రం మామూలే... వాటిని వాడేవాళ్లు మామూలే... అచ్చం ఇలానే ఉంది ఈ రాజకీయ నాయకుల "చైనా వస్తువులు వాడని వాడు దేశ భక్తుడు? వాడే వాడు దేశద్రోహి!" అనే వాదన కూడా!

చైనా నుండి వచ్చే దిగుమతులన్నీ ఆపేయవచ్చు కదా? ఎందుకు ఆపటం లేదు. చైనా ప్రొడక్ట్స్ అన్నీ దిగుమతి చేసుకుని వాటిని మార్కెట్లోకి వదిలేస్తూ మళ్ళీ "చైనా వస్తువులు వాడని వాడు దేశ భక్తుడు? వాడే వాడు దేశద్రోహి!" అని లెక్చర్లు దంచటం ఎంతవరకు సమాజసం? ఒక్కసారి ఆలోచించండి?

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts