సోమవారం, జనవరి 06, 2020

"సీతకత్తి" సినిమా

Artists will always be alive .. | కళాకారులెప్పుడూ బ్రతికే ఉంటారు.. వారికి చావు లేదని తెలియజేసిన "సీతకత్తి" సినిమా!

అప్పుడప్పుడూ మంచి,మంచి సినిమాలు వెతికి,వెతికి చూడటం అలవాటు నాకు. నా వెతుకులాటలో దొరికిన తక్కువ సినిమాలలో మంచి సినిమా "సీతకత్తి"
సినిమా అంతా చాలా చక్కగా నడిచింది. నిజానికి సినిమాలో నాటకరంగం గురించి చూపటం జరిగింది. ప్రజాదరణ లేని కళాకారుల జీవితాలు ఏవిధంగా ధ్వంసమవుతున్నాయో ఈ సినిమా చక్కగా చూపించింది.

ఒక నాటక రంగం నడుపుతున్న హీరో (నాటక పెద్ద) తన మనుమడి బ్రెయిన్ ఆపరేషన్ కి రెండు లక్షలు ఖర్చవుతాయని కూతురు చెపితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. ఆ మర్నాడు నాటకంలో ఒక కుటుంబ పెద్ద పాత్ర పోషిస్తూ కూతురు పాత్రతోనూ, కాబోయే అల్లుడు పాత్రతోనూ మాట్లాడుతూ శాశ్వత మౌనం వహిస్తాడు. ఈ సన్నివేశం మనకి హృదయం ద్రవించిపోతుంది.

ఇక తరువాత నుండి ఆ హీరో ఆత్మ వివిధ హీరోలను ఆవహించి సినిమాల్లో నటించి తన మనుమడి బ్రెయిన్ ఆపరేషన్ చేయించడమే కాకుండా తన నాటకరంగం గ్రూపు వారందరినీ ఆర్ధికంగా స్థిరపడేలా చేస్తుంది.

అయితే ఒక ప్రొడ్యూసర్ కమ్ హీరో కధ ఒకటి చెప్పి సినిమా మరొకటి చేస్తుంటే హీరో ఆత్మ సినిమా మధ్యలోనే ఆ మోసం చేసిన హీరోను ఆవహించి నటించడం మానివేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సన్నివేశాలు సరదాగా నడుస్తాయి. చివరికి ఆత్మ పెట్టిన కేసుతో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ మోసం చేసిన ప్రొడ్యూసర్ కమ్ హీరో కి శిక్ష పడటంతో సినిమా ముగుస్తుంది.

అయితే ఈ సినిమాలో మనం ముఖ్యంగా గమనించాల్చింది " కళాకారుడు ఎప్పుడూ ప్రజల హృదయాలలో బ్రతికే ఉంటాడని."

బ్లాగు మిత్రులారా నేను వివరించడంలో గందరగోళం ఉండవచ్చు. కానీ మీరందరూ తప్పనిసరిగా ఈ  "సీతకత్తి" సినిమా చూడాలి. సినిమా డౌన్లోడ్ కొరకు క్రింది లింక్ ద్వారా వెళ్లవచ్చు.
 "సీతకత్తి" సినిమా డౌన్లోడ్

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts