సోమవారం, ఏప్రిల్ 06, 2020

even-if-you-do-not-dare-others-please-do-not-fear-your-others
🙂ఒక చిన్న నీతి కథ🙂

ఊరి బయట పొలం దగ్గర ఇద్దరబ్బాయిలు👦👶 పరుగులు పెట్టి అడుకుంటున్నారు.
ఒకడు పదేళ్ల వాడు.
ఇంకొకడు ఆరేళ్ల వాడు.
చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.
పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.
ముందు పెద్ద బావి 🏟 ఉంది.

పెద్దోడు చూసుకోలేదు.

అందులో పడిపోయాడు.

వాడికి ఈత రాదు.

బావి చాలా లోతు.

చుట్టుపక్కల ఎవరూ లేదు.

అరిచినా 😮😩 సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.

చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.
"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.
నీట మునిగి తేలుతూ🏊🏻 కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.

చిన్నోడు తన శక్తినంతా💪😰 కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.
"అన్నా ... భయపడకు..!☝
జాగ్రత్తగా పట్టుకో..!
పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.😧
తాడు 📯 చివరను ఒక చెట్టుకి🌴 కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.


➡ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.
ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.
ఊళ్లో ఎవరూ నమ్మలేదు.

ఆరేళ్ల వాడేమిటి...🤔

పదేళ్ల వాడిని లాగడమేమిటి?🙄

అందునా బావి నుంచి లాగడమేమిటి?😯

అసాధ్యం..!☹

వాడు చేయలేడు అని అన్నారు.
ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.

➡సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.
ఆ ఊరు పెద్దమనిషికి విషయం తెలిసింది.
"మీరు నమ్ముతారా అని అడిగారు
"నమ్ముతాను" అన్నాడు.
"ఎలా?"
"చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు."
"అదెలా సాధ్యం...
అంత చిన్నోడు ఎలా చేయగలడు?"

➡"తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు.

"ఒరేయ్..! నీకంత బలం లేదురా,

నువ్వు చేయలేవురా,

అది నీవల్ల సాధ్యం కాదురా.

అని చెప్పేవారెవరూ కూడా...
ఆ పరిసరాల్లో లేరు,  కాబట్టి వాడు చేయగలిగాడు."

👉 "నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. "

ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.😶

👉"నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే..." అన్నాడు పెద్దమనిషి.

Note : *మీరు ఇతరులకు ధైర్యం ఇవ్వకున్నా పర్లేదులే గానీ...దయచేసి మీ భయాన్ని మాత్రo ఇతరులపై రుద్దకoడి.*🙏

1 కామెంట్‌:

 


Popular Posts

Recent Posts