ఆగస్ట్ 21-2017 రోజునాడు భూమి నాశనం కానుంది ఒకవైపు, అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి ఆ దేశమంతా చీకటిలోకి వెళితే ఇక వెలుగులోకి రాదు నాశనం కానుందని మరో వైపు ఇలా అన్ని ప్రక్కల నుండి మన టీవీ వాళ్ళు ఊదరగొట్టి పాడేశారు. ఆగస్ట్ 21-2017 వెళ్ళిపోయింది ఏం జరిగింది? ప్రళయమెక్కడ వచ్చింది? ఏదైనా ఒక విషయాన్ని మనం ప్రజలకు తెలియజేస్తున్నామంటే అందులో వాస్తవం ఉండాలి. అంతేగాని TRP రేట్లు పెంచుకోవడం కోసం అడ్డమైన విషయాలు తీసుకుని వచ్చి ప్రజలపై రుద్దాలని ప్రయత్నించకూడదు. మన మహనీయులైన, శాస్త్రాలైనా ప్రళయం వచ్చే ముందు కొన్ని సూచనలు సూచించారే గాని ఫలానా సమయంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పలేదు. ఇవేవీ పట్టించుకోకుండా అదిగో ప్రళయం, ఇదిగో ప్రళయం అంటూ ఊదరగోట్టడం దేనికసలు? 2000లో ప్రళయం అన్నారు రాలేదు. ఇంకేముంది 2012లో మొత్తం భూమంతా ఖాళీ అయ్యిపోతుందన్నారు అవ్వలేదు. కొంతమందయితే బ్లాగుల్లో కూడా అదిగో,ఇదిగో అంటూ జ్యోస్యాలు వ్రాసేస్తున్నారు! ఇప్పుడా జ్యోతిష్యం అబద్దమనే కదా అర్ధం. ఇప్పుడు మళ్ళీ 2020 అంటున్నారు. ఈ సంవత్సర అంకెలు బాగున్నాయి కదా! ప్రజలు నమ్ముతారులే అనే ఉద్దేశ్యం కాబోలు. వాళ్లనుకున్నది నిజమే అనుకుంటా ఇవి నమ్మే ప్రజలకు బుర్రలు పనిచేస్తేనే కదా? వాళ్ళు చెప్పేది అబద్ధమని అర్ధమయ్యేది!!
మంగళవారం, ఆగస్టు 22, 2017
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Sakshyam Education
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి