ఏమిటో అర్ధమై చావడం లేదు. మంచితనం లేదు, ప్రేమ లేదు ఎటు చూసినా అన్యాయమే కనిపిస్తోంది. నా మిత్రుడు ఒకడు బ్లాగ్ ఒకటి తయారు చేయమని చెప్పాడు. సరే వీలు చూసుకుని ఒక వారం రోజుల్లో చేస్తానని చెప్పాను. నిన్న వచ్చి అలా అయితే ఎలా? బ్లాగ్ చేసి ఇవ్వాలి కదా? నా బిజీ ని ప్రక్కన బెట్టి ఎన్ని సార్లు ఫోన్లు చేయమంటావు? అని అడిగేసరికి నాకు మైండ్ బ్లాక్ అయ్యిపోయింది. అంత పాయింట్ అవుట్ చేసి మాట్లాడవలసింది ఏముంది? పోనీ ఏమైనా బ్లాగ్ డిజైన్ కు డబ్బులు ఇస్తున్నాడా? లేదే? ఇదేమి దారుణం? నేను ఎక్కువుగా బాధ పడింది దేనికంటే మరొక మూడో వ్యక్తీ సమక్షంలో అలా మాట్లాడటం, అదీ కాక అతను వెళ్ళిపోయిన తరువాత నీతి కబుర్లు చెప్పడం మరీ దారుణమనిపించింది. ఏది,ఏమైనా ఇలాంటి వ్యక్తులను వదిలించుకోవడమే మంచిదని అనిపిస్తోంది. దీనికి మీరేమంటారో?
ఆదివారం, మే 07, 2017
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి