బుధవారం, అక్టోబర్ 05, 2016

నమ్మకశక్తిని సంపాదించి, బలోపేతం చేసుకునేందుకు గల మూడు మార్గాలు;

1. విజయం గురించి ఆలోచించండి, ఓటమి గురించి కాదు. పనిచేసే చోట, ఇంట్లోనూ, ఓటమి గురించి ఆలోచించే బదులు విజయం గురించి ఆలోచించండి. ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, ఇలా ఆలోచించండి, ''నేను గెలుస్తాను'' , అంతేగానీ ''నేను బహుశా ఓడిపోతాను,'' అని కాదు. ఇంకొకరితో పోటీ చేసేప్పుడు, ''అందరికన్నా ఉత్తమమైన వ్యక్తితో నేను సమానుడిని'' అనుకోండి, ''అతనితో నేనెక్కడ పోటీ చేయగలను.'' అని కాదు. అవకాశం మీ ముందుకొచ్చినప్పుడు ''నేను చెయ్యగలను'' అనుకోండి, చెయ్యలేను,'' అని ఎప్పుడూ అనుకోవద్దు.  ''నేను విజయాన్ని సాధిస్తాను'' అనే గొప్ప ఆలోచన మీ ఆలోచనవిధానాన్ని ఆక్రమించుకో నివ్వండి. విజయం గురించి ఆలోచిస్తే, విజయాన్ని అందించే ప్రణాళికలను మీ మనసు రూపొందించగలుగుతుంది. అపజయం గురించి ఆలోచిస్తే దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఓటమి గురించిన ఆలోచనలు అలాటి మరిన్ని ఆలోచనలని పుట్టించి, ఓటమిని కలగజేస్తాయి.

2. మీ గురించి మీకున్న అభిప్రాయం కన్నా మీరు మెరుగైనవారేనని తరచూ గుర్తు చేసుకుంటూ ఉండండి. విజయాన్ని సాధించినవాళ్లు సూపర్ మెన్ ఏమి కారు. విజయనికి అసాధారణమైన తెలివితేటలు అవసరం లేదు. అంతేకాదు, విజయం సాధించటంలో పెద్ద రహస్యమో, మర్మమో కూడా లేదు. అలాగే విజయం అదృష్టం మీద ఆధారపడి ఉండదు. విజయాన్ని సాధించేవాళ్లు తమ మీదా, తాము చేసే పనిమీద నమ్మకాన్ని పెంచుకున్న మామూలు మనుషులే. ఎప్పుడూ - అవును, ఎప్పుడూ కూడా -మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. 

3. గొప్ప నమ్మకాలని కలిగి ఉండండి. మీ విజయం మీ నమ్మకాన్ని బట్టే పెద్దదిగానో, చిన్నదిగానో ఉంటుంది. చిన్నచిన్న లక్ష్యాలని ఏర్పరచుకుంటే ఫలితాలు కూడా చిన్నవే ఉంటాయి. పెద్ద లక్ష్యాలని ఏర్పరచుకుని పెద్ద విజయలని సాధించండి. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి! పెద్ద ఆలోచనలూ, పెద్ద ప్రణాళికలు సామాన్యంగా సులభంగా ఉంటాయి. కనీసం చిన్న ఆలోచనలు, ప్రణాళికల కన్నా కష్టమైనవి మాత్రం కాదు.

జనరల్ ఎలెక్ర్టిక్ కంపెనీ బోర్డు చెయిర్ మన్, మిస్టర్ రాల్ఫ్ జె. కార్డినర్, ఒక లీడర్ షిప్ సమావేశంలో ఇలా అన్నాడు : '' నాయకత్వాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి, అది తనకోసం కావచ్చు లేదా కంపెనీ కోసం కావచ్చు. తనని తను వృద్ధి చేసుకునే వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొనాలనే సంకల్పనం చేసుకోవాలని మేం కోరుకుంటున్నాం. ఎవరూ ఎవరినీ అభివృద్ధి చెందామని ఆదేశించరు.... ఒక వ్యక్తి తన ప్రత్యేక రంగంలో వెనకబడి ఉంటాడా ముందుకిపోతాడా అనేది, అతను ఆ పనిని ఎంత మనస్ఫూర్తిగా చేస్తాడనే దానిమీద ఆధారపడి ఉంటాంది. దీన్ని సాధించేందుకు సమయం, ప్రయత్నం, త్యాగం అవసరమవుతాయి. మీకోసం ఇంకొకరెవరో ఆపని చెయ్యలేరు.''

మిస్టర్ కార్డినర్ చెప్పిన సలహా బావుంది, అమలు చెయ్యదగ్గది. దాని ప్రకారం జీవించండి. బిజినెస్ మేనేజ్ మెంటులో, అమ్మకాలలో, ఇంజినీరింగ్ లో, మతపరమైన కార్యాలలో, రచనా, నటన, ఇంకా ఏ విధమైన లక్ష్యాలనైనా పొందాలనుకునేవాళ్లు అన్నిటికన్నా పై స్థాయికి చేరుకోవాలంటే, మనసు పెట్టి , నిరంతరం తనని తను అభివృద్ధి చేసుకోవటం అనే ప్రణాళికని చేపట్టాలి. 

ఏ శిక్షణా కార్యక్రమమైన -ఈ పుస్తకంలో ఉన్నది సరిగ్గా అదే - మూడు పనులు చెయ్యాలి, విషయాన్ని మీముందుంచాలి, అంటే ఏం చెయ్యాలో చెప్పాలి. రెండు, చేసే పద్దతిని, అంటే ఎలా చెయ్యాలి అనేదాన్ని తెలియజేయాలి. ఇక మూడు, ఫలితాలని సాధించటం అనే అంతిమ పరీక్షకి మిమ్మల్ని గురిచేయ్యలి.

విజయాన్ని సాధించటం మీ కార్యక్రమంలో చెయ్యవలసింది ఏమిటి అనేది విజేతలైన వాళ్లు వైఖరీ, పనిచేసే విధానం ఆధారంగా తయారుచేయ్యబడుతుంది. వాళ్లు తమని ఏ విధంగా పనికి తగ్గట్టు మలుచుకుంటారు? అడ్డంకులని ఎలా అధిగమిస్తారు? ఇతరుల నుంచి గౌరవాన్ని ఎలా సంపాదించుకుంటారు? మామూలు మనుషులకన్నా వాళ్లు ఎందుకని భిన్నంగా ఉంటారు? వాళ్లెలా ఆలోచిస్తారు? 

మీ అభివృద్ధి ప్రణాళికలోని ఎలా అనే అంశం పనిచేసే తీరుకి కొన్ని నిర్దేశాలని వరుసక్రమంలో అందిస్తుంది. ఇవి ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తాయి. ఈ నిర్దేశాలు పనికొస్తాయి. వాటిని పాటించి చూడండి, మీకే తెలుస్తుంది.
మరి ఈ శిక్షణలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం, ఫలితాల మాటేమిటి? క్లుప్తంగా చెప్పాలంటే, ఈ శిక్షణాకార్యక్రమాన్ని మనసుపెట్టి, ప్రయత్నించి అమలుచేస్తే, ఇప్పుడు అసాధ్యమని తోచే విజయం మీ సొంతం అవుతుంది. ఈ ప్రణాళికలోని విభిన్న భాగాలని విడదీసి చూసినప్పుడు, మీ వ్యక్తిగత శిక్షణా కార్యక్రమం మీకు వరసగా పురస్కారాలని అందిస్తుంది : మీ కుటుంబం నుంచి మరింత లోతైన గౌరవభావాన్ని బహుమతిగా అందుకుంటారు, మీ స్నేహితులనించీ, తోటి పనివారినించీ ప్రశంసలని సంపాదించుకుంటారు, ఇతరులకి పనికొస్తున్నాను, అనేభావం మీకు బహుమతిగా దొరుకుతుంది, గుర్తింపు పొందుతారు, హోదా వస్తుంది, ఎక్కువ సంపాదనా, హెచ్చు స్థాయి జీవితం పురస్కారాలుగా లభిస్తాయి. 

మీకు మీరు స్వయంగా శిక్షణా ఇచ్చుకుంటారు. మీ గొంతుమీద కూర్చుని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెప్పేవాళ్ళెవరూ ఉండరు. ఈ పుస్తకమే మీకు మార్గదర్శి, కానీ మిమ్మల్ని అర్ధం చేసుకోవలసింది మీరే. ఈ శిక్షణని అమలుచేయ్యమని మిమ్మల్ని ఆజ్ఞాపించ వలసింది మీరే. మీ ప్రగతిని విలువకట్టవలసింది కూడా మీరే. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇంకా పెదా విజయలని సాధించేందుకు మీకు మీరే శిక్షణా ఇచ్చుకుంటారన్నమట.

మీ దగ్గర అన్నీ వస్తువులూ సిద్దంగా ఉన్న ఒక ప్రయోగశాల ఉంది. అందులో మీరు పనిచెయ్యచ్చు, చదువుకోవచ్చు. మీ ప్రయోగశాల మీచుట్టూ ఉంది. మీ ప్రయోగశాలలో ఉన్నది మనుషులు. ఈ ప్రయోగశాల, మనుషులు చెయ్యగల పనుల తాలూకు ఉదాహరణ లన్నిటిని మీకు అందిస్తుంది. మీ సొంత ప్రయోగశాలలో మీరే ఒక శాస్త్రవేత్త అని అనుకున్న తరవాత, ఇక మీరు నేర్చుకోగల వుషయాలకి అంతుండదు-ఇంకా వినండి, అక్కడ కొనటానికి ఏమి ఉండదు. అద్దె చెల్లించక్కర్లేదు. ఎటువంటి ఫీజులూ ఉండవు. మీకు కావలసినప్పుడల్లా ఈ ప్రయోగశాలని మీరు ఉచితంగా వాడుకోవచ్చు.

మీ ప్రయోగశాలకి మీరే నిర్దేశకులు కావటం వల్ల, అందరూ శాస్త్రవేత్తల్లాగే మీకు కూడా పరీక్షించాలనీ, ప్రయోగాలు చెయ్యాలనీ అనిపిస్తుంది.

జీవితమంతా మనచుట్టూ మనుషులు ఎప్పుడూ ఉన్నప్పటికి, చాలమందికి మనుషులు ప్రవర్తించే తీరు అర్ధం కాకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా? మనలో అధికశాతం గమనించటంలో శిక్షణా పొందరు. ఈ పుస్తకం తాలూకు ముఖ్యమైన ఉద్దేశలలో ఒకటి, పరీక్షించటం అనే విద్యలో మీకు శిక్షణా ఇవ్వటం, మనుషుల ప్రవర్తనని అర్ధం చేసుకునే పరిజ్ఞానాన్ని మీకు అందించటం. మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకోవచ్చు, జాన్ అంతా పెద్ద విజయలని ఎలా సాధించగలుగుతున్నాడు. టామ్ మాత్రం ఎందుకు మందకొడిగా ఉండిపోయాడు? '' ''కొంతమందికి ఎక్కువమంది స్నేహితులూ, మరికొందరికి తక్కువమంది స్నేహితులూ ఎందుకుంటారు?'' ''ఒక మనిషి చెప్పినా మాటని ఆనందంగా అంగీకరించేవాళ్లు, ఇంకొకరు అదే విషయాన్ని చెప్పినా ఎంధుకు వినిపించుకోరు.?''

ఒకసారి శిక్షణ పొందాక, మామూలు పరిశీలన అనే విధానం ద్వారా మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు. 
శిక్షణా పొందిన పరిశీలకుడిగా తయారయెందుకు మీకు సాయపడగల రెండు ప్రత్యేకమైన సలహాలు చెపుతాను వినండి. మీరు విశేషంగా అధ్యయనం చేసేంధుకు అందరికన్నా ఎక్కువ విజయాన్ని సాధించిన వ్యక్తినీ, అందరికన్నా పెద్ద అపజయాన్ని పొందిన వ్యక్తినీ అధ్యయనం చెయ్యండి. ఆ తరవాత, ఈ పుస్తకం ముందుకి సాగినకొద్దీ, విజేతగా ఉన్న వ్యక్తి విజయం తాలూకు సూత్రాలని ఎంత క్షుణ్ణంగా పాటిస్తున్నాడో గమనించండి. ఈ రెండు పరస్పర విరుద్ధమైన ఉదాహరణలని అధ్యయనం చెయ్యటం వల్ల, ఈ పుస్తకంలో చెప్పిన వాస్తవాలని అనుసరించటంలో ఉన్న వివేకం ఎంత ఉపయోగకరమైనదో నిస్సందేహంగా మీకు తెలిసివస్తుంది. 

ఒక్కొక్క వ్యక్తితోనూ మీరు పరిచయం చేసుకుంటూ పోతే విజయం తాలూకు సూత్రాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. విజయంతో నిండిన పనులని ఒక అలవాటుగా చేసుకోవటమే మీ ధ్యేయం. ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తే, అంతా త్వరగా అదిమి స్వభావంలో విడదీయరాని భాగంగా మరి మీరు కోరుకున్నట్టుగా పనిచెయ్య గలుగుతారు.

ఒక అభిరుచి కోసం దేన్నైనా పెంచే స్నేహితులు మనలో చాలమందికి ఉంటారు. వాళ్లు '' ఈ మొక్కలు పెరుగుతుంటే చూడటం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎరువులకీ, నీళ్లకీ అవి ఎలా ప్రతిస్పందిస్తాయో ఒక్కసారి గమనించండి.
పోయిన వారం కన్నా ఇప్పుడు ఎంతఏపుగా తయారయాయో చూడండి. '' అనటం మన౦ చాలాసార్లు వింటాం.
ఆ మాట నిజమే, మనుషులు జాగ్రత్తగా ప్రకృతికి సహకరిస్తే లభించే ఫలితాలు చేస్తే ఒళ్లు పులకరించిపోతుంది. కానీ మీ అంతట మీరు జాగ్రత్తగా నిర్వహించుకునే ఆలోచనలని అధీనంలో ఉంచుకోవటం అనే కార్యక్రమానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారో గమనిస్తే, దానికి పదిరెట్లు ఎక్కువ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. రోజురోజుకీ, నెలనెలకీ, మీరు మరింత ఆత్మవిశ్వాసాన్నీ, ప్రభావాన్ని, విజయాన్ని సాధించుకోవటం గమనిస్తే మీకు బలే సరదాగా అనిపిస్తుంది. మీరు విజయాన్ని, ఫలితలనీ సాధించే మార్గంలో ప్రయాణిస్తున్నారని తెలుసుకుంటే ఇచ్చే సంతృప్తిని ఏదీ, ఇంకేదీ, ఇవ్వలేదు. మీనుంచి మీరు వీలైనంత ఎక్కవ పొందటం కన్నా పెద్ద సవాలు మరొకటి ఏదీ ఉండదు.    

0 Comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Follow by Email

Popular Posts

Recent Posts