శనివారం, అక్టోబర్ 29, 2016

యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక సినిమాలు చూసే వాళ్ల తో పాటు తీసే వాళ్లు సంఖ్యా బాగా పెరిగింది. ఐదు నిమిషాల లఘు చిత్రంతో దర్శకత్వ అవకాశాలు పట్టేసిన వాళ్లు, రెండు నిమిషాల వీడియేతో హీరో ఛాన్స్ కొట్టేసిన వాళ్లూ ఎప్పటికిప్పుడు వార్త ల్లోని వస్తూనే ఉన్నారు. సినిమాలకు పని చేయాలని పెద్దగా ఆసక్తిలేకపోయిన తమ ప్రతిభను చూపించుకోవాలని అనుకునేవాళ్లూ చాలామందే ఉంటున్నారు. వీళ్లకి ప్రపంచానికి మద్యా ఇంటర్నెట్  వారధిలా పనిచేస్తోంది ఆ ఇంటర్నెట్ సాయంతో వీలైనంత మందికి అవకాశాలు కల్పిస్తోంది చాయ్ స్టోరీస్ అనే సంస్థ ఒకరికి మంచి కెమెరా పనితనం ఉండొచ్చు. ఇంకొకరు బాగా నటించొచ్చు మరొకరు కత్తిలాంటి కధలు రాయొచ్చు.కానీ సరైన బృందంలేక వాళ్లు ప్రతిభ వృధా అయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఒక్కో రంగంలో ప్రతిభ ఉన్నవాళ్లందరినీ ఒకే వేదిక పైకి తీసికొచ్చి వాళ్లందరితో కలిపి వారానికొ లఘు చిత్రం తీసి, సాధారణ సినిమా ల్లానే ప్రతి శుక్రవారం వాటిని అంతర్జాలంలోకి విడుదల చేస్తోంది చాయ్ స్టోరీస్.

కుర్రాళ్ల కోసమే...

'యువ సినీ ప్రేమికుల ప్రపంచానికి స్వాగతం... చాయ్ స్టోరీస్ వెబ్ సైట్ లోకి ప్రవేశించగానే కనిపించే మాట ఇది. ఆ మాట ప్రకారమే అక్కడ యువకులకూ యువతను ఆకర్షించే కధలకూ, ఆలోచింపజేసే అంశాలకే ప్రాధాన్యం. వాట్సాప్ లో వచ్చే ఓ సరదా సందేశం, దేశాన్ని కుదిపేస్తోన్న సమస్య... ఎలాంటి నేపాధ్యాన్ని ఎంచుకున్నా ఓ పది నిమిషాల నిడివిలో సూటిగా చెప్పగలగాలి. వినోదం, ఫిక్షన్, నాటకీయత లాంటి అన్నీ అంశాలకు సంబందించిన చిత్రాలను తీసే అవకాశం ఉన్నా, ఇప్పటివరకు సరదాగా సాగుతూ సామాజిక స్పృహను రేకెత్తించే సినిమా లే ఎక్కువగా వచ్చాయి. ఒక్కసారి తీయాలనుకున్న అంశం ఓకే అయితే దానికి కావల్సిన లొకేషన్లు, కెమెరా, ఇతర సామగ్రినంతా సంస్థతే అందిస్తుంది. ఔత్సాహికులు చేయాల్సించల్లా ఓ అందమైన చిత్రాన్ని వీలైనంత వేగంగా సూటిగా తీసేసి ఇవ్వడమే. ఎంత మంది ఔత్సాహికులు వస్తూ పోతూ ఉన్నా తొలి రోజుల్లో ఏర్పడ్డ బృందమే చాయ్ స్టోరీస్ ద్వారా ఎక్కువ సినిమాలు తీస్తోంది. వాళ్ల చిత్రాలకు అభిమానులు ఎక్కువ ఉండటం, బోలెడన్ని అవార్డులూ రావడమే అందుకు కారణం.

చిత్రోత్సవాల్లో చోటు 

యానిమేషన్ రంగంలో సుధీర్ఘు అనుభవం ఉన్న షోయెబ్, మీనాజ్ అనే కుర్రాళ్లు, ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ 'చాయ్ స్టోరీస్' ఆలోచన.ఆకాష్, దేవేష్, అభినయ్ లాంటి కొందరు స్నేహితులతో సరదాగా టీ తాగుతున్నప్పటి సందర్బంలో మాటల మద్యలో లఘుచిత్రాల అంశం ప్రస్తావనకు వచ్చింది వాటి ఆధారంగా సమాజం మీద ఎంతో కొంత ప్రభావం చూపించొచ్చని అనిపించింది. అంతే... అప్పట్నుంచి ప్రతి వారం ఒక్కో లఘుచిత్రాన్ని తీసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. చాయ్ తాగేప్పుడు వచ్చిన ఆలోచన కాబట్టి సంస్థకు చాయ్ స్టోరీస్ అనే పేరు పెట్టేశారు. రెండేళ్లుగా దాదాపు వంద లఘు చిత్రాలను తీసి విడుదల చేశారు. పెద్ద సినిమాల్లానే వీటికి పోస్టర్లూ, టిజర్లు విడుదల చేయడం, ఆన్ లైన్ లోనే చిన్న చిన్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ రావడంతో పాటూ క్రమం తప్పకుండా చిత్రాలు వస్తుండటంతో వినియెగదారుల సంఖ్యా బాగా పెరిగింది. అందరికీ వర్తించే అంశాలనే కధా వస్తువుగా తీసుకోవడంతో అంతర్జాతీయ ప్రేక్షకులకూ ఈ చిత్రాలు నచ్చేస్తున్నాయి.అలా స్థానిక చిత్రోత్సవాలతో పాటు ఇటీవల స్పెయిన్ లో జరిగిన సినీ ఫోన్ ఇంటెర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు భారత్ తరపున '3ఏ ఎమ్' అనే 'చాయ్ స్టోరీస్' లఘు చిత్రం మాత్రమే ఎంపికైంది.రోడ్డు మీద కనిపించే ప్రతి వస్తువునూ కార్లో పెట్టుకుంటే ఎలాంటి అనర్దాలు వస్తాయనే ధీమ్ తో తీసిన హారర్ చిత్రమది.

పిల్లలకు సినిమా పాఠాలు 

కేవలం సినిమాలు తీయడంతో తమ బాద్యత పూర్తివుతోందని ఈ కుర్రాళ్లు అనుకోవడం లేదు. సాధారణ విద్యార్ధుల్లానే స్వచ్ఛంద  సంస్థలు, హాస్టళ్లలో ఉండే పేద పిల్లల్లోనూ సినిమాలకు సంబంధిచిన అంశాలను నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటుందని గ్రహిచారు. మామూలు విద్యను వాళ్లను చాలామంది అందిస్తారు కానీ ఇలాంటి దృశ్య మాద్యమానికి సంబంధించిన శిక్షణ మాత్రం ఎవరూ ఇవ్వరు. అందుకే ఆ భాద్యతనూ చాయ్ స్టోరీస్ తీసుకుంది. వారం వారం వివిధ స్వచ్ఛంద సంస్థలకు వెళ్లి అక్కడి పిల్లలకు కెమెరా,నటన, దర్శకత్వం లాంటి ప్రాధమిక అంశాలకు సంబంధించిన శిక్షణ ఇస్తోంది డిజిటల్ మీడియాను సమర్ధంగా ఉపయెగించుకుంటూ సామాజిక మార్పు కోసం పనిచేస్తున్నందుకు దక్షిణాసియా స్థాయిలో ఇచ్చే మంధన్ అవార్డూ ఈ ఏడాది చాయ్ స్టోరీస్ కు దక్కింది 'వంద మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క దృశ్యంలో చూపించొచ్చు. అందుకే సమాజానికి మేం అనుకునే విషయాలను తెలియజేయడానికి ఆ మాధ్యమాన్నే ఎంచుకున్నాం' అంటారు షోయబ్.ఆ ప్రయాణంలో మీరూ భాగమవ్వాలనుకుంటే 'చాయ్ స్టోరీస్. కామ్ 'ని చూడండి.    

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts