శనివారం, జూన్ 30, 2018

జీవితంలో పైకి రావాలంటే ప్రతిభా,పనితనం మాత్రమే సరిపోవు.ఎప్పటికప్పుడు ఎమోషన్స్ ని అదుపు చేసుకుపోతూ అడ్జస్ట్ మెంట్ అలవాటు చేసుకోవాలి. ఇటువంటి విషయాలు చెప్పడానికి,రాయడానికి బావుంటాయని అనుకోకండి.అక్షరాలా అద్భుతాలు చేసినవారెందరో ఉన్నారు.
   అటువంటి వారిలో మన భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒకరు. 16ఏళ్ల వయస్సులోనే టెస్ట్ మ్యాచ్ రంగంలో దిగి,24 సంవత్సరాల పాటు నిర్విరామంగా, నంబర్ వన్ గానూ ఆడుతూ 100సెంచరీలు చేసి, ఇటు ప్రజలు అటు ప్రభుత్వం గుర్తింపు పొంది అత్యంత ప్రతిష్టాత్మకరమైన "భారతరత్న" బిరుదును పొందారు.రాజ్యసభలో సభ్యుడిగా గౌరవింపబడ్డారు. లిటిల్ మాస్టారుగా ప్రపంచంలో ఎందరికో అభిమాని అయ్యాడు.
     అయితే ఇంతకీ విషయమేమిటంటే ఈ లిటిల్ మాస్టర్ తన కెరీర్ లో అడుగదునా అడ్డంకులు ఎదుర్కొన్నాడు. కానీ లక్ష్యం గుర్తుంచుకుని అన్నిటికి అడ్జస్ట్ అయ్యానని ఆయన తన పుస్తకం "ప్లేయింగ్ ఇట్ మై వే" ఆటో బ్రయోగ్రఫీలో వెల్లడించారు.కొంతమంది పాత ప్లేయర్లతో ఆయన ఎలా అడ్జెస్ట్ అయ్యాడు. భారత క్రికెట్ కోచ్ గ్రెగ్ చాపల్ తనను ఎలా ఇబ్బంది పెట్టాదో సవివరంగా వర్ణించాడు. ఈ పుస్తకం ఏదో సంచలనం సృష్టించాలని రాయలేదు. పైగా ఆయనకు రావాల్సిన బిరుదులు,సత్కారాలు,ఐశ్వర్యం అంటూ ఏదీ లేదు.పైగా తను ఎన్నో దానాలు,గుప్తదానాలు చేశాడు.


    ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని "పుట్టాంరాజు కండ్రిగ" అనే గామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ యువతను సన్మార్గంలో నడిపించాలని నడుం కట్టుకున్నాడు.ఎవ్వరూ ఊహించనంత ఆర్ధిక సహాయం చేశాడు.
      "ప్లేయింగ్ ఇట్ మై వే"  పుస్తకం విడుదలకు ముందే లక్షా ఇరవై కాపీలు అమ్ముడై పునర్ముద్రణ నోచుకుంది. ఇది ఇక్కడితో ఆగదు. కోటి కాపీలకు పైగా అమ్ముడవుతుంది.
      ఈ సందర్భంగా ఒక ఆనందమైన, ఆశ్చర్యకరమైన అనుభవం మీతో షేర్ చేసుకుంటాను. పుస్తకం రిలీజైన మర్నాడే ఒకరు ఆ పుస్తకం PDF కాపీని అక్రమంగా సంపాదించి అప్ లోడ్ చేసి స్నేహితులకు, ఫేస్ బుక్, వాట్సప్ ద్వారా వేలాదిమందికి మెయిల్ పెట్టి "త్వర,త్వరగా Download చేసుకోండీ,సచిన్ కి తెలిస్తే అది తీసేస్తాడు" అని ఉచిత సలహా ఇచ్చాడు.
     అయితే సచిన్ అభిమానులకు చిర్రెట్టుకొచ్చింది. సచిన్ ఆ పుస్తకం ద్వారా వచ్చే డబ్బుని పేదవారి ఆరోగ్యం,త్రాగునీటిని ఇవ్వాలని ప్రకటించాడు. మనం ఇలా పైరసీ చేసి సచిన్ కి, పెదప్రజలకు అన్యాయం చెయ్యమని మెయిల్ పెట్టి, ఆ ప్రబుద్ధుడు పెట్టిన అడ్రస్సును చెరిపేశారు. ఇదంతా తెలుసుకుని సచిన్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. యువతీ,యువకుల పట్ల తనకున్న భాధ్యతను గుర్తించాడు.

1 కామెంట్‌:

 


Popular Posts

Recent Posts