ఆదివారం, అక్టోబర్ 20, 2019

🍁అష్టావధానంలో ఓ కొంటె పృచ్ఛకుడు ఇబ్బందికర పదాలైన పంది,చేప,కప్ప, కోడిపెట్ట అవధానికి చెప్పి,ఈ పదాలు కలుపుతూ ఒక బ్రాహ్మణుడి ఇంట పెళ్లి భోజనము గూర్చి వివరించమని తుంటరి ప్రశ్న వేయగా!*

*ఆ అవధానిగారు ఓస్ ఇంతేకదా అని క్రిందివిధంగా బ్రాహ్మణభోజనము వారికి పెట్టాడు.చదవండి.*

" అందమైనట్టి "పంది"రింట విందుచేయ
బ్రహ్మణుల ఇంట "చేప"ట్టే పరిణయమున
కొసరి మా"కప్ప"డాలు ప"కోడిపెట్ట"
కమ్మనౌ వంటకాలతో కడుపు నింపే ''

*ఆహా..ఏమి మన కమ్మని తెలుగు భాషాతియ్యదనం..*


*అందుకే కదా !  దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు..*

4 కామెంట్‌లు:

  1. తెలుగు బాష ఎంతో తియ్యనైనది,కమ్మనైనది...అయిననూ దానిని బ్రతికించేవాడు కరువాయ్యెను కదా?

    రిప్లయితొలగించండి
  2. అలాగే జరిగింది...జరుగుతుంది కూడా!

    రిప్లయితొలగించండి
  3. మన బాచ్చి రివర్స్ టెండరింగ్ ఎప్పుడో పట్టేశారు. ముందు పజ్జెం చెప్పడం, తర్వాత ప్రశ్న చూపడం.. ఇంకేముందీ, పండిత్తుడైపోవడం.

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts