శోధిని బ్లాగులో వచ్చిన టపా పట్టుకుని బ్లాగిల్లు శ్రీనివాస్, హరిబాబుగార్లు పెడుతున్న కామెంట్లు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు.
శ్రీనివాస్ గారు.
మీరు నాకిచ్చిన రెండు ఫోన్ నంబర్లు స్విచ్చ్ ఆప్ చేసుకుని ఉన్నారు గనుక ఈ పోస్ట్ రూపంలో తెలియజేస్తున్నాను.
మీకూ,నాకూ స్నేహమా? అది కలుషితమయిపోయిందా? ఏo కామెంట్లు పెడుతున్నారో అర్ధం కావడం లేదా?
మీ దగ్గర కొన్ని బ్లాగులు బహుశా రెండు బ్లాగులు ఒకటి సాక్ష్యం మేగజైన్, రెండు ఈ బ్లాగునూ! అయితే ఈ బ్లాగు డిజైన్ పెద్దగా నచ్చక మళ్ళీ నేనే బ్లాగర్లోకి మార్చుకుని డిజైన్ చేసుకున్నా! వీటికి నేను మీకు డబ్బులిచ్చే చేయించుకున్నాను. ఇలా మీ నంబర్, నా నంబర్ తీసుకోవడం, అప్పుడప్పుడూ మాటలాడుకోవడం జరిగేది. అంతవరకే. అంతకు మించి మన విషయంలో ఇంకేముంది? నాకు నా ప్రాణమిత్రులతో కలవడమే సరిగా కుదరడం లేదు. మీతో కలుషితమయ్యి పోయేంత స్నేహ బంధాలే నడిచాయా? చాలా హాస్యాస్పదంగా ఉంది మీ వ్యవహారం. మీది రాజమండ్రి, మాది కాకినాడ. వేట్లపాలెంలోని మా మావయ్య గారి బoక్ లో ఎక్కువుగా ఉంటాను కూడా. మీకు చాలా దగ్గరలో అయినా ఏనాడు మిమ్మల్ని కలవనే లేదు. మీరు చెపుతున్నంత స్నేహం మన మధ్య ఉంటే మనం కలవకుండా ఉంటామా? మీరు కల్సే ప్రయత్నం చేసానని చెప్పవచ్చు. అయితే మీతో ప్రత్యేకంగా కలిచేoత అవసరం, స్నేహభావం మనమధ్య లేవు. మీరు గతంలో కొంతమంది బ్లాగర్ల విషయంలో మీరు రికార్డ్ చేసిన ఫోన్స్ నాకు మెయిల్ ద్వారా వినిపించినప్పుడే మీకు ఫోన్స్ రికార్డ్ చేసే భయకరమైన గుణం ఉందని గుర్తించి ఉంటే ఆరోజు నుండే అప్పుడప్పుడూ మీరు కాల్ చేస్తూ నాతో మాట్లాడే విధానానికి స్వస్తి చెప్పేసే వాడిని.మీరు ఆదుకునేoత దౌర్భాగ్యపు స్థితిలో నేను లేను.ఇటువంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు కలిపించకండి.
గతంలో మీరు వివిధ ఐడిలతోనూ, బ్లాగులతోనూ పల్లా కొండల రావుగారి అగ్రిగేటర్ విషయంలో చేసిన దాడి నాకింకా గుర్తుంది. గతంలో నా బ్లాగులలో కూడా మీరు వివిధ ఐడిలతో కామెంట్ చేసేవారు కదా? ఆ విషయాలు నాతో కూడా పంచుకునేవారు కదా? మీరు అప్పుడప్పుడూ కావాలని చేసే వైరల్ దృష్టిలో పెట్టుకుని మీకు ఫోన్ కూడా చేసాను. కాని మీరు మాట్లాడిన తీరు చూస్తే మీరేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. అయితే ఫోన్స్ రికార్డ్ చేసే నికృష్టపు అలవాటు నాకు లేదు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు.
ఏమో నా అభిప్రాయం నిజం కావచ్చు. పొరపాటు కావచ్చు.నిజానికి వేరే బ్లాగులో వచ్చిన ఆ అజ్ఞాత కామెంట్ గురించి పట్టించుకోవడం అనవసరమనిపించిoది.
కాబట్టి నాగురించి మీరు చేస్తున్నది ఇక్కడితో ఆపు చేసేయండి. బాగుండదు. మీరు శోధినిలో టపా వేసినప్పుడే ఈ క్రింది కామెంట్ పెట్టాను. ఎవరివలన జరిగిందో ఎందుకు జరిగిందో, కావాలని జరిగిందో, తెలియదు గాని ఈ విషయాన్ని అనవసరం అన్న ఉద్దేశ్యంతో ఈ కామెంట్ పెట్టాను.
దానికి మీరు క్రింది విధంగా స్పందించి సరే సార్ అన్నారు.
మీకు కామెంట్ పెట్టి తీసేయడం అలవాటు కాబట్టి యధాప్రకారం ఆ కామెంట్ మీ బ్లాగునుండి తొలగించి వేసారు.అయితే మాలికలో స్టోరేజ్ అయ్యే ఉంది.
మీ సమాధానంలో సరే సార్..ఈ పోస్ట్ఉద్దేశ్యం వేరని చెప్పిన మీరు నాపై వ్యక్తిగత దూషణలకు ఎందుకు తీసుకు వెళ్తున్నారు? ఇక ఆపేయండి.మీకే మంచిది. మీకు నావలన ఇబ్బంది కలిగితే ఫోన్ చేయండి.మీరు రెండు రోజులనుండి ఫోన్ స్విచ్చ్ ఆప్ చేసుకుని ఉండాల్సిన పని లేదు. ఆన్ చేసుకోండి. నాకు ఫోన్ చేయండి.
ఇక హరిబాబు గారూ!
ఏమిటి మీ వ్యక్తిగత దూషణలు. ఎవడి అభిప్రాయాలు వాడు వ్రాసుకుంటాడు. నచ్చితే మా బ్లాగ్ చదవండి, లేకపోతే మానేయండి. వెధవ్వ , సన్నాసి, పిచ్చి పుల్లయ్య, సైకో, అక్కడ కలిపేస్తా, ఇక్కడ కలిపేస్తా? ఏమిటి సర్ ఈ వాగుడు? మా కీబోర్డులో బటన్స్ లేవనుకుంటున్నారా? మీ వయస్సుకు గౌరవాన్ని ఇవ్వకుండా ఉండలేకపోతున్నాము. అలాగే మా సంస్కారాన్ని వదిలి పెట్టలేము. నా పట్ల మా మేగజైన్ కంటెంట్ రచయితల పట్ల వ్యక్తిగత దూషణలు, సభ్యత దిగజారి మాట్లాడటం మానుకోండి. మా మేగజైన్ రచయితలు మీకంటే కూడా వయస్సులో పెద్దవారు ఉన్నారు. గౌరవంగా ప్రవర్తించడం నేర్చుకోండి. మీకంటే వయస్సులో చిన్న వాడినైన నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటాను. మీ అభిప్రాయాలు నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చలేదని మీతో ఏనాడైనా దూషణలు చేస్తూ కామెంట్ పెట్టానా? లేదే.
మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?
ఇక ఉంటాను. నాకు మీ ఇద్దరి ప్రవర్తన పట్లా కలిగిన బాధతో వ్రాసాను. ఇంకా ముఖ్యమైన, ప్రధానమైన విషయాలు ఉన్నప్పటికీ కొద్దివరకే వ్రాసాను. ఇలా వ్రాయడమే నాకు చిరాక్ కలిగిస్తోంది. శుభం.