మంగళవారం, అక్టోబర్ 18, 2016

ఏదో ఒక విధంగా ఎదగవలసిన అవసరం లేని వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు. ప్రతి వ్యక్తి - ప్రతి వ్యక్తి అంటున్నాను- తమ జీవితంలో కొన్ని రంగాలలో చదివి, సంపన్నులు కావల్సిన అవసరం ఉంది.

డా. ఒరిసస్ యస్. మర్డన్, విజయం [success] పత్రిక స్థాపకుడు. అతను చెప్పిన ఈ మాటలు పుస్తకాలు మీరు ఎదిగేలా చేసి మీ జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తాయో వివరిస్తాయి. 

మీరు మిమ్మల్ని మెరుగుపరుచుకోవాలని ఆతృతతో ఉన్నట్లయితే, మీ అభిరుచి పెంచే, మీ ఊహాశక్తికి పదునుపెట్టే, మీ ఆకాంక్షలను విశదపరిచే, మీ ఆదర్శాలను ఉన్నతం చేసే పుస్తకాలు చదవండి.

మిమ్మల్ని కుదిపివేసి ఏదో లక్ష్యం వైపు కదిలించే శక్తిమంతమైన పుస్తకాలు చదవండి. మిమ్మల్ని కార్యశూరులను చేసే, కొంత మెరుగుపరిచే, కొంచెం కష్టపడి మరో వ్యక్తిలా తయారుచేసే ప్రపంచంలో ఏదో ఒకటి సాధించే, వ్యక్తి గా చేసే పుస్తకాలు చదవండి.

ప్రతిరోజూ 15 నిమిషాల శ్రద్దతో చదివితే, ఐదు సంవత్సరాలలో మీకు అనేకమంది మహా రచయితలు పరిచయమవుతారు.

డా. మార్డన్ సూచించే పుస్తకాల లాంటి పుస్తకాలు మీరు చదువుతున్నారా? మీరు ప్రతి రోజు, ఏ రోజు విడవకుండా, రోజుకు 15 నిమిషాలు చదువుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం 'అవును' అయితే మిమ్మల్ని మిరు అభినందించుకోండి. ఎందుకంటే మీరు నిజంగా చదువుతూ, జీవితంలో సంపన్నులవుతున్నారు.

మీరు ప్రతి రోజు ఇలాగే చదవాలని నేను కోరుతున్నాను. మీరు చదువంటే అయిష్టపడే పాఠకులైతే, ప్రతిరోజూ చదవడం ప్రారంభించమని కోరుతున్నాను. డా.మార్డన్ సలహా పాటించే 'మీ అభిరుచిని పెంచే మీ ఊహాశక్తికి పదును పెట్టె మీ ఆకాంక్షలను విశదపరిచే, మీ  ఆదర్శాలను ఉన్నతం చేసే పుస్తకాలు చదవండి.' మీరు అలా చేసినట్లయితే, చదువులో నిబిడీకృతమై ఉన్న శక్తులు మీ జీవితంలో అన్నీ రంగాలలోనూ మీరు సంపన్నులు కావడానికి సహాయపడగలవు.

ఈ పుస్తకం ముగిస్తూ, మీరు చదివే పుస్తకాల ద్వారా విజయం మిమ్మల్ని వరించాలని నేను కోరుతున్నాను. ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు చదువుతూ ఉన్నట్లయితే... పయనిస్తూ ఉన్నట్లయితే... మీరు ఎదుగుతూ ఉంటారు.!

0 Comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Follow by Email

Popular Posts

Recent Posts