గురువారం, ఫిబ్రవరి 27, 2020

చదువు ద్వారా మీ జీవితం మార్చుకోండి. | Change your life by reading.

ప్రజలకు "డియర్ ఎబ్బీ"గా సుపరిచితమైన ఏబిగెయిల్ వాన్ బ్యూరన్ ఓఫ్రా విన్ ఫ్రీ రెండేళ్ల పసిపాపగా ఉన్నప్పుడు, జనరంజకమైన తన "సలహా కాలం" రాయడం మొదలు పెట్టింది. పదిమంది అమెరికన్లలో ఒకరి కంటే తక్కువమంది దగ్గరే టి.వీలు ఉన్న రోజుల్లో, డియర్ ఎబ్బీ కాలం ప్రపంచంలోని వార్తా పత్రికలలో ప్రచురించబడేవి. ఆమె తక్కువుగా టివి చూడమని,ఎక్కువుగా చదవమని ఎప్పుడూ చెబుతుండేది.

చదువు ప్రాముఖ్యత గురించి యువతకు ఆమె ఇచ్చే సందేశం ఇదే అయ్యుండేది. 
అంతేకాదు ఏ వయసు వారికైనా ఆమె మాటలు చాలా విలువైనవి.

          "నేను యువతకు ఒక సలహా ఇవ్వగలిగితే, ఆ సలహా ఏమిటంటే చదువు,చదువు,చదువు. చదువు ద్వారా వాస్తవమైనవి కాని, ఊహాజనితమైనవి కాని - నూతన ప్రపంచాలను మీరు ఆవిష్కరిస్తారు. సమాచారం కొరకు చదవండి. ఆనందం కొరకు చదవండి.మన లైబ్రరీలనిండా కావాల్సినంత జ్ఞానం ఉంది. సంతోషం ఉంది. మీరు ఉచితంగా అందుకోవడానికి అంతా అక్కడ రెడీగా ఉంది. చదవని వ్యక్తి, చదువురాని వ్యక్తి కంటే ఏ విధంగాను గొప్పవాడు కాదు."

నిజానికి ఆమె మాటలు ఏంతో స్పూర్తి దాయకమైనవి. "చదువు, చదువు, చదువు" తెలివైన స్త్రీ నుంచి వెలువడిన తెలివైన మాటలు. ఆమె సలహా కాలం 50 సంవత్సరాలకు పైగా నడిచిందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020


SA 1 10th Class General Science model paper 1 Telugu mediam


మార్చి-2020 10th Class పరీక్ష మోడల్ పేపర్లు మీకోసం అందించ్డమ్ జరుగుతుంది. ఈక్రింది యూటూబ్ ద్వారా మీరు అన్ని మోడల్ పేపర్లు పొందవచ్చు. మేము అతి త్వరలో అప్లోడ్ చేయబోయే పేపర్ల కోసం క్రింది యూటూబ్ లింక్ ను క్లిక్ చేసి ఆ తరువాత సబ్ స్క్రైబ్ చేసుకోగలరు. 

బుధవారం, ఫిబ్రవరి 19, 2020

is-happiness-for-man-in-money
మనిషికి కావల్సిన ఆనందాలు,సంతోషాలు కేవలం పూర్తి డబ్బులోనే లేవు.వీటిని పొందటానికి మాత్రం డబ్బు కూడా ఒకటి.ఈ మాట మీకు అర్ధం కాకపోవచ్చు.వింతగా అనిపించవచ్చు.కాని నిజం.
      మనిషి సంతోషంగా జీవించడానికి కావల్సిన వాటిలో డబ్బు  ప్రధానమైనది తప్ప..డబ్బే అన్నీ కాదు.డబ్బు ఏ కష్టఒ లేకుండా బ్రతకడానికి కావాలిగాని, కేవలం డబ్బు కోసమే బ్రతకడం ప్రారంభిస్తే అన్నీ కష్టాలే!అశాంతిమయాలే!!
      అతి అన్ని విషయాలలో ప్రమాదమే!అలాగే డబ్బు విషయంలో కూడా!
      అయితే మనిషి ఆ డబ్బు సంపాదన విషయంలో ముందుండాల్సిందే!
      హ్యాపీగా బ్రతకడానికి అతని దగ్గర డబ్బు లేకపోతే అతనికి ఏవిధమైన గుర్తింపు లేదు.సమాజంలో గౌరవం లేదు.
 ఆర్ధికబలం ఉన్నవాడికే సమాజం అండగా నిలుస్తుంది.తప్ప మంచి చెడులను బట్టి అస్సలు కాదు.
      ఎన్ని కుంభకోణాలు చేసిన నాయకుడైనా..ప్రజల మధ్య ఊరేగడం ప్రారంభిస్తే చేతులెత్తి నమష్కరిస్తుంది సమాజం.మనుష్యులను ఆ విధంగా తయారుచేస్తుంది డబ్బు.కాని వాళ్ల వ్యక్తిగత జీవితాలలో మాత్రం అలజడులు,అశాంతులు తప్ప మనశ్శాంతి మాత్రం ఉండదు.
     సరిపడే డబ్బే సంతృప్తి...అంతకు మించితే అనర్ధమే!
     నేనొకసారి కడపలో ఓ ఆధ్యత్మిక సభలోకి అతిధిగా వెళ్లినప్పుడు నా సందేశం ముగిసిన తరువాత ఓ ముస్లిం పండితుడు చక్కని కధ చెప్పాడు.
     ఆ ఊరి జమిందారు రాత్రి నిద్రపట్టక అతని ఇంటిపైన పచార్లు చేస్తున్నాడట.అయితే ఆ ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు క్రింద ఓ భిక్షగాడు దోమలు ఎంత కుడుతున్నా పట్టించుకోకుండా ఆదమర్చి నిద్రపోతున్నాడు.ఈ దృశ్యం జమిందారిగారి కంటబడింది.మనస్సులోనే అనుకున్నాడు"ఎంత విచిత్రం..నాకు గదిలో పడుకోవడానికి పరుపు,దుప్పట్లు,గదినిండా చల్లటి ఎ.సి ఉన్నా నాకు నిద్రలేదు.ఈ భిక్షగాడు చూస్తే అంత చలిలో అన్ని దోమకాట్లు మధ్య నిద్రపోతున్నాడు.
    జమిందారికి "నా బ్రతుక్కంటే నీ బ్రతుకే బాగుంది అనుకుని ఆ భిక్షగాడిని మనస్సులోనే అభినందించాడు.
 మర్నాడు ఉదయమే భిక్షగాడిని కల్సి ఓ వందరూపాయలు ఇచ్చి వచ్చాడు.
    ఆరోజు రాత్రి యధావిధిగా జమిందారుగారు తన డాబాపై తిరుగుతూ చెట్టు క్రింది భిక్షగాడు నిద్రపోకుండా దోమలను తోలుతూ కూర్చోవడం చూసాడు.జమిందారుగారు ఆశ్చర్యపోతూ డాబాపైనుండి క్రిందికి వచ్చి భిక్షగాడిని అడిగాడట ఎందుకు నిద్రపోలేదని?
    దానికి భిక్షగాడు "అయ్యా! ఉదయం మీరిచ్చిన 100రూపాయలలో 90రూపాయలు ఖర్చయింది.ఇంకా నాదగ్గర 10రూపాయలున్నాయి.వాటిని ఎవడు కొట్టేస్తాడోనని నిద్రపట్టడం లేదు బాబయ్యా అన్నాడట!
    ఏది ఏమైనా డబ్బు ప్రోగు వేతే మనిషి లక్ష్యం అయితే అతనికి మనసిక శాంతి కరువే!!

శనివారం, ఫిబ్రవరి 15, 2020

  • ఒకదారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరోదారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం.
  • ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం.


గురువారం, ఫిబ్రవరి 13, 2020

10th Class Pre-Final Exams from February 27th | పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి 27నుంచి

  👉పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 12వరకు నిర్వహించ నున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

Recent Posts