సోమవారం, జనవరి 20, 2020

SA 2 Model Question Papers CCE 2019



SA 2 Maths Question Papers CCE 2019 – 6th,7th,8th,9th,10th Classes

SA 2 Social Question Papers CCE 2019 – 6th,7th,8th,9th,10th Classes

SA 2 Science Question Papers CCE 2019 – 6th,7th,8th,9th,10th Classes
Read More : SA 2 Model Question Papers CCE 

ఆదివారం, జనవరి 19, 2020

పాఠకమహాశయులారా!… యండమూరి వారు రచించిన అత్యద్భుతమైన నవల “తప్పు చేద్దాం రండి” ఒకటి. దీనిని చదివిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎలా నడుచుకోవాలి అనేది తప్పనిసరిగా నేర్చుకుంటారు. ఈ నవలలో అడుగడునా జీవితాన్ని మలుపు తిప్పే ఆణిముత్యాలు దొరుకుతాయి. ఈ నవల మనిషిలో ఉన్న వ్యక్తిత్వపు నైపుణ్యాన్ని తీర్చిదిద్దుతుందనటంలో ఎటువంటి సంకోచం లేదు. 


పూర్తి వివరాలకు మా "Sakshyam Publications" వెబ్సైట్ చూడండి. అక్కడ పుస్తకం యొక్క వివరాలు కూడా దొరుకుతాయి.

మంగళవారం, జనవరి 07, 2020

సమయం  గడిచిపోయింది, ఎలా  గడిచిందో తెలియదు,
జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది  తెలియకుండానే.

భుజాలపైకి..ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు. తెలియనేలేదు..

అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం. ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో తెలియదు

ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ.. కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో తెలియదు

ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది. కానీ ఇప్పుడు  నాపిల్లలకు  నేను బాధ్యత గా మారాను ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియదు. .

ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం.. కానీ.. ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో.. ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు.

ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం.. అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో తెలియదు.

ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  .. ఎప్పుడు  రిటైర్  అయ్యామో.. తెలియనేలేదు.

పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో.. వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో తెలియదు.

రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు అందరూ... దూరమయ్యారో తెలియదు.

ఇప్పుడే   ఆలోచిస్తున్నాను..నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని.. కానీ.. శరీరం  సహకరించడం లేదు.
ఇవన్నీ..జరిపోయాయి.. కానీ  కాలం  ఎలా  గడిచిందో..తెలియనేలేదు.
It's  truth  of life.

గమనిక : పై ఆర్టికల్ నేను వ్రాసింది కాదు. ఒక మిత్రుడు వాట్సాప్ లో నాకు షేర్ చేస్తే చాలా బాగుంది కదా అని మీ అందరికోసం పోస్టు వేసాను. ఇంత గొప్ప జీవిత సత్యాలు తెలియజేసిన ఆ రచయిత(త్రి)గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

సోమవారం, జనవరి 06, 2020

"సీతకత్తి" సినిమా

Artists will always be alive .. | కళాకారులెప్పుడూ బ్రతికే ఉంటారు.. వారికి చావు లేదని తెలియజేసిన "సీతకత్తి" సినిమా!

అప్పుడప్పుడూ మంచి,మంచి సినిమాలు వెతికి,వెతికి చూడటం అలవాటు నాకు. నా వెతుకులాటలో దొరికిన తక్కువ సినిమాలలో మంచి సినిమా "సీతకత్తి"
సినిమా అంతా చాలా చక్కగా నడిచింది. నిజానికి సినిమాలో నాటకరంగం గురించి చూపటం జరిగింది. ప్రజాదరణ లేని కళాకారుల జీవితాలు ఏవిధంగా ధ్వంసమవుతున్నాయో ఈ సినిమా చక్కగా చూపించింది.

ఒక నాటక రంగం నడుపుతున్న హీరో (నాటక పెద్ద) తన మనుమడి బ్రెయిన్ ఆపరేషన్ కి రెండు లక్షలు ఖర్చవుతాయని కూతురు చెపితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. ఆ మర్నాడు నాటకంలో ఒక కుటుంబ పెద్ద పాత్ర పోషిస్తూ కూతురు పాత్రతోనూ, కాబోయే అల్లుడు పాత్రతోనూ మాట్లాడుతూ శాశ్వత మౌనం వహిస్తాడు. ఈ సన్నివేశం మనకి హృదయం ద్రవించిపోతుంది.

ఇక తరువాత నుండి ఆ హీరో ఆత్మ వివిధ హీరోలను ఆవహించి సినిమాల్లో నటించి తన మనుమడి బ్రెయిన్ ఆపరేషన్ చేయించడమే కాకుండా తన నాటకరంగం గ్రూపు వారందరినీ ఆర్ధికంగా స్థిరపడేలా చేస్తుంది.

అయితే ఒక ప్రొడ్యూసర్ కమ్ హీరో కధ ఒకటి చెప్పి సినిమా మరొకటి చేస్తుంటే హీరో ఆత్మ సినిమా మధ్యలోనే ఆ మోసం చేసిన హీరోను ఆవహించి నటించడం మానివేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సన్నివేశాలు సరదాగా నడుస్తాయి. చివరికి ఆత్మ పెట్టిన కేసుతో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ మోసం చేసిన ప్రొడ్యూసర్ కమ్ హీరో కి శిక్ష పడటంతో సినిమా ముగుస్తుంది.

అయితే ఈ సినిమాలో మనం ముఖ్యంగా గమనించాల్చింది " కళాకారుడు ఎప్పుడూ ప్రజల హృదయాలలో బ్రతికే ఉంటాడని."

బ్లాగు మిత్రులారా నేను వివరించడంలో గందరగోళం ఉండవచ్చు. కానీ మీరందరూ తప్పనిసరిగా ఈ  "సీతకత్తి" సినిమా చూడాలి. సినిమా డౌన్లోడ్ కొరకు క్రింది లింక్ ద్వారా వెళ్లవచ్చు.
 "సీతకత్తి" సినిమా డౌన్లోడ్

Recent Posts